మీకు పేస్ బుక్ ఎకౌంటు ఉందా? మీకు తమిళనాడు లో కానీ లేదా ఇతర దేశాల్లో కానీ మీ భాష తెలియని స్నేహితులు ఎవరైనా ఉన్నారా? మీరు తెలుగు లో పెడుతున్న పోస్ట్ లు వారికి అర్థం కావడం లేదా? మనం తెలుగు లో పోస్టులు పెట్టినా సరే వాళ్లకు ఎలాగైనా అర్థం కావాలి అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అయితే మీలాంటి వారి కోరికను పేస్ బుక్ తీర్చబోతోంది. సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజమైన పేస్ బుక్ మిమ్మల్ని ఇక గ్లోబల్ ఆడియన్స్ కు దగ్గర చేసి వారితో వారి భాష లోనే మీరు సంభాషించే ఏర్పాట్లు చేస్తుంది. మీరు మీ టైం లైన్ లో ఉంచిన పోస్ట్ లను ఆటోమాటిక్ గా అనేక భాషల లోనికి అనువాదం చేసే ఒక సరికొత్త సాఫ్ట్ వేర్ ను లంచ్ చేయనున్నట్లు పేస్ బుక్ ప్రకటించింది. మీరు పోస్ట్ చేసిన పోస్ట్ ల ను ఈ సాఫ్ట్ వేర్ మీ ఫ్రెండ్స్ కు కావలసిన భాషలోనికి తర్జుమా చేస్తుంది. దీనికి మీరు చేయవలసిందల్లా మీకు కావలసిన p-ఒస్ట్ ను టైపు చేయడం అక్కడ మెనూ లో మీకు కనిపించే సుమారు 45 భాషల లోనికి దానిని అనువదించేలా క్లిక్ చేయడమే. ఈ మల్టీ లింగ్యువాల్ కంపోజర్ ప్రస్తుతం ఒక చిన్న గ్రూప్ లో మాత్రమే పరీక్షించబడింది. త్వరలోనే దీనిని విస్తృతంగా అందుబాటులోనికి తీసుకురానున్నారు. పేస్ బుక్ చెబుతున్న దాని ప్రకారం పస్తుతం సుమారు 5000 పేస్ బుక్ పేజీలలో ఇది వాడ బడుతోంది. కాకపోతే ఇది వ్యాపార దృక్పథం లో డిజైన్ చేయబడినది. ఈ అనువాదానికి ఇది కృత్రిమ మేధస్సు ను ఉపయోగించనుంది. పేస్ బుక్ లెక్కల ప్రకారం సుమారు 1.65 బిలియన్ ల మంది తన వినియోగదారులలో సగానికిపైగా ఇంగ్లీష్ కాకుండా వేరే భాషలలో మాట్లాడేవారు ఉన్నారు. కాబట్టి ఈ ప్రయోగం తప్పకుండా విజయవంతం అవుతుందనే ఆశాభావం తో పేస్ బుక్ ఉంది. |