• తాజా వార్తలు

సెల్ఫీ లను అద్భుత కళాఖండాలుగా మార్చే 5 ఉచిత యాప్స్ మీ కోసం

మీ ఫోటో లను మరింత అందంగా మార్చాలి అనుకుంటున్నారా? ప్రత్యేకించి సెల్ఫీ లను అద్భుత కళాఖండాలుగా మార్చాలి అనుకుంటున్నారా? అయితే మీకోసమే ఇక్కడ ఒక 5 యాప్ లను ఇస్తున్నాం. సాధారణంగా రియర్ కెమెరా తో పోల్చితే ఫ్రంట్ కెమెరా సామర్థ్యం తక్కువ ఉంటుంది. దానితో సెల్ఫీ ల క్వాలిటీ మమూలుఫోతో లతో పోల్చితే కొంచెం తక్కువగానే ఉంటుంది. అయితే ఇక్కడ మేము చెప్పబోయే 5 యాప్ లను ఉపయోగించి మామూలుగా ఉన్న ఫోటో లను కూడా అద్భుత కళాఖండాలుగా మార్చుకోవచ్చు. వాటి గురించి చూడండి.

1.    మెయిటు
ఇది ఒక చైనీస్ యాప్. అంటే చైనా కు చెందిన ఒక కంపెనీ ఈ యాప్ ను విడుదల చేసింది. ఇది మామూలు ఫోటోలను కూడా అద్భుతం గా మారుస్తుంది. ఇదులో ఉండే ఫీచర్ ల ద్వారా మీ సేల్ఫీలను మరింత అందంగా మార్చుకోవచ్చు. ఇది చాలా వేగవంతంగా పనిచేస్తుంది. కాకపోతే దేనిని ఉపయోగించేతపుడు మీరు ఇంటర్ నెట్ కిఉ కనెక్ట్ అయ్యి ఉండాలి. ఆ తర్వాత మీరు మీ ఫోటోలను షేర్ చేసుకోవచ్చు కూడా. దీనికి ఉన్న ఒక ప్రతికూలత ఏమిటంటే దీనిని ఉపయోగించేతపుడు ఇది అనవసరమైన పర్మిషన్ లను అనేకం అడుగుతుంది. అయితే మీ ఫోన్ ఆండ్రాయిడ్ మార్ష్ మాలో 6.0 లేదా ఆ పై  ఆపరేటింగ్ సిస్టం అయినట్లయితే ఆయా పర్మిషన్ లకు పరిమితులు విధించవచ్చు. ఇది ఆండ్రాయిడ్ మరియు ఐఒఎస్ లలో లభిస్తుంది.

2.    పర్ఫెక్ట్ 365
ఇది కూడా మీ ఫోటో లను అందంగా మార్చే మరొక యాప్. దీనిని వన్ ట్యాప్ మేక్ ఓవర్ అని కూడా పిలుస్తారు. ఈ పర్ఫెక్ట్ 365 అనే యాప్ ఇమేజ్ లో ఉండే ఫేస్ లను గుర్తించడం తో పాటు కొన్ని ముఖ్యమైన అంశాలైన మీ కనుపాపల యొక్క ఆకృతి, బుగ్గల స్థానం, పెదవుల అందం మొదలైన ముఖమునకు అందాన్ని తీసుకువచ్చే అనేక రకాల అంశాల లో ప్రత్యేకంగా పనిచేస్తుంది. ఆయా స్థానాలలో ఎక్కడైనా మరకలు, మచ్చలు లాంటివి ఉంటే వాటిని కూడా ఆటోమాటిక్ గా తొలగిస్తుంది. దీనిద్వారా ఎడిట్ చేసిన ఫోటో లు చాలా సహజం గా కనిపిస్తాయి. ఇది ఆండ్రాయిడ్ మరియు ఐఒఎస్ లలో లభిస్తుంది.

3.    ప్రిస్మా
ఇది గత జూలై లో విడుదల అయింది. ఇంతకుముందు మన వెబ్ సైట్ లో దేని గురించి ఒక సమగ్ర విశ్లేషణ కూడా చేయడం జరిగింది. ఇది మామూలు ఫోటో లను అద్భుత కళాఖండాలుగా మార్చి వేస్తుంది. అది ఫోటో నా లేక పెయింటింగ్ నా అనే విధంగా ఇది మన ఫోటో లను మార్చి వేస్తుంది. దీనిని ఉపయోగించడం చాలా సులువు. మీరు ఏదైనా పిక్చర్ ను తీసిన సెకన్ల వ్యవధి లోనే ఇది తన ఫలితాలను చూపిస్తుంది. ఇంతకుముందు చెప్పుకున్న యాప్ ల లాగే ఇది కూడా సహజంగా అనిపించే ఇమేజ్ లను అందించడం తో పాటు షేరింగ్ కు అనువుగా ఉంటుంది. దీనిని ఉపయోగించాలి అంటే ఆన్ లైన్ లో ఉండాల్సిన అవసరo లేదు. అయితే ఇమేజ్ పై ఒక చిన్న వాటర్ మార్క్ ను ఉంచుతుంది. ఇది ఏమంత పెద్ద విషయం కాదు. ఇది ఆండ్రాయిడ్ మరియు ఐవోఎస్ లలో లభిస్తుంది.

4.    ఫ్రంట్ బ్యాక్
మనం పైన చెప్పుకున్న యాప్ లకు ఇది భిన్నంగా ఉంటుంది. దీనిని ఉపయోగించి ఏదైనా ఫోటో తీసేటపుడు ఇది రియర్ మరియు ఫ్రంట్ కెమెరా లు రెండింటినీ ఉపయోగించుకుంటుంది. దీనివలన మీరు ఒక అద్భుతమైన పిక్చర్ లను తీయగలుగుతారు. ఇది రెండు పిక్చర్ లనూ ఒకేసారి తీయదు. అయితే ఈ రెండు కెమెరా ల ద్వారా తీసిన ఫోటో లను కలిపి ఒక అద్భుతమైన ఇమేజ్ గా మీరు తయారుచేయవచ్చు. వీటిని అనేకరకాలుగా మార్చడం ద్వారా మీరు ఒక సరికొత్త కోణం లో ఫోటో లను ఎడిట్ చేసుకోవచ్చు.దీనిద్వారా మీరు ఫోటో లను షేర్ చేయవచ్చు. ఇన్ స్టా గ్రాం కు లాగా ఇందులో సోషల్ మీడియా లో కూడా షేర్ చేయవచ్చు. ఇది ఏ విధమైన ఫిల్టర్ లు ఉపయోగించనప్పటికీ ఫోటో లు చాలా అందంగా ఉంటాయి. ఇది కూడా ఆండ్రాయిడ్ మరియు ఐఒఎస్ లలో లభిస్తుంది.

5.    కార్టూన్ ఫేస్
మెయిటు యాప్ లానే ఇది మనుషుల ముఖాలని గుర్తిస్తుంది. మీ ఫేస్ లకు కార్టూన్ మాదిరి ఎడిట్ చేయడానికి ఇది పిస్మా తరహాలో ఉండే ఫిల్టర్ లను ఉపయోగించుకుంటుంది. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ యాప్ ద్వారా ఒరిజినల్ ఇమేజ్ లో ఉన్న ముఖం లోని భావాన్ని ( ఎక్స్ ప్రెషన్ ) ను మార్చివేయవచ్చు.  దీనికోసం ఇది మీ ఫేస్ లోని కళ్ళు, ముక్కు, పెదవులు లాంటి వివిధ భాగాలను దాని అల్గోరిథం ద్వారా దానికి తగ్గట్లు మార్చుకుంటుంది. తద్వారా ముఖం లోని భావం ఆటోమాటిక్ గా మారిపోతుంది. ఉదాహరణకు మీరు కోపం తో ఉన్న ఫోటో తీసారు అనుకోండి. ఈ యప్ ద్వారా దానిని నవ్వుతూ మార్చి వేయవచ్చు. ఇది కేవలం ఐఒఎస్ లో మాత్రమే లభిస్తుంది.

జన రంజకమైన వార్తలు