నేటి సామాజిక మాధ్యమ ప్రపంచం లో ఫేస్ బుక్ తిరుగులేని రారాజు గా ఉన్నది. చిన్న పిల్లల నుండీ పండు ముదుసలి వరకూ దాదాపుగా అన్ని వయసుల వారు ఫేస్ బుక్ యొక్క సభ్యులుగా తమతమ ఎకౌంటు లను కలిగిఉన్నారు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే సాధారణంగా ఏ సోషల్ మీడియా లో అయినా ఎకౌంటు ఓపెన్ చేసేముందు మనకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కనిపిస్తాయి. అయితే ఏముందిలే ఇవి ప్రతీ దానిలో ఉండేవే కదా అని కనీసం వాటిని చూడనైనా చూడకుండా తిచ్క్ పెట్టేసి అగ్రీ అన్నట్లుగా మన అకౌంట్ ను ఓపెన్ చేసేస్తాము. అయితే ఫేస్ బుక్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి తెలుసుకుంటే మాత్రం మనం విస్తుపోవాల్సిందే. వీటిని సరిగ్గా చదవకుండా టిక్ పెట్టేసి మన జుట్టును ఫేస్ బుక్ చేతుల్లో పెట్టేస్తూ ఉంటాము. ఇలా ఫేస్ బుక్ తో ఒప్పందం చేసుకునేటపుడు మనం చేసే 5 రకాల తప్పులను గురించి ఈ ఆర్టికల్ లో ఇవ్వడం జరిగింది. మరెందుకు ఆలస్యం చదివేయండి.
మీరు పోస్ట్ చేసిన ప్రతీదాని మీద ఫేస్ బుక్ హక్కును కలిగిఉంటుంది.
ఫేస్ బుక్ తో సైన్ అప్ అయ్యేటపుడే ఈ హక్కును మీరు ఫేస్ బుక్ కు ఇచ్సుస్తున్ నరు. మీరు మీ టైం లైన్ లో పోస్ట్ చేసే ప్రతీ అంశంపై ఫేస్ బుక్ సర్వ హక్కులు కలిగి ఉంటుంది. అంటే ఆ పోస్ట్ ను ఫేస్ బుక్ ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా ఉపయోగించవచ్చు అన్నమాట. అందులో ఏముంటుంది అంటే ఆ పోస్ట్ ను మీరు డిలీట్ చేసేంతవరకూ ఫేస్ బుక్ దానిపై హక్కును కలిగిఉంటుంది అని. అయితే ఒకవేళ మీరు డిలీట్ చేసినా అది మీ ఫ్రెండ్స్ టైం లైన్ లో ఉండే అవకాశం ఉంది కదా! మీ ఫ్రెండ్స్ దానిని షేర్ చేస్తే అది డిలీట్ అవ్వదు కదా! ఈ విధమైన నిబంధన మీరు ఎకౌంటు ఓపెన్ చేసేటపుడే ఉంటుంది. అయితే మనం అదేమీ చూడకుండా సైన్ అప్ చేస్తాము.
మీరు డిలీట్ చేసిన అంశాన్ని ఫేస్ బుక్ ఒక కాపీ గా తన దగ్గర ఉంచుకుంటుంది.
ఏదైనా అంశాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన తర్వాత కొంతకాలానికి దానిని డిలీట్ చేస్తే ఫేస్ బుక్ యాజమాన్యం బారినుండి తప్పించుకున్నట్లే అని మీరు భావిస్తే మీరు పప్పులో కాలు వేసినట్లే. మనం కంప్యూటర్ లో డిలీట్ చేసిన అంశాలు ఏ విధంగా అయితే రీ సైకిల్ బిన్ లో ఉంటాయో అదే విధంగా ఫేస్ బుక్ లో డిలీట్ చేసిన అంశాలు కూడా కొంతకాలం వరకూ బ్యాక్ అప్ లో సేవ్ అయ్యి ఉంటాయి. ఇవి సాధారణంగా ఫేస్ బుక్ అధీనం లో ఉన్ట్టాయి కాబట్టి వాటితో ఫేస్ బుక్ ఏదైనా చేయవచ్చు.
మీ ఫోన్ నెంబర్ మారితే 48 గంటల లోపు ఫేస్ బుక్ కు తెలియజేయాలి.
ఫేస్ బుక్ తో సైన్ అప్ అఎతపుడే మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ను అత్యంత ఖచ్చితంగానూ మరియు అప్ డేటెడ్ గానూ ఉంచుతానని మీరు ఒప్పందం చేసుకుంటారు. మీరు మీ ఫోన్ నెంబర్ మార్చినట్లయితే మీరు చేసుకున్న ఒప్పందం ప్రకారం 48 గంటల లోపు ఫేస్ బుక్ తెలియజేయవలసి ఉంటుంది. ఆ నెంబర్ ను మీ ఎకౌంటు కు అప్ డేట్ చేసుకోవాలి.
ఫేస్ బుక్ మీ పేరు నూ మరియు ఫోటో లనూ యాడ్ లకోసం వాడుకుంటుంది.
మీరు ఫేస్ బుక్ ను ఉపయోగించేటపుడు న్యూస్ ఫీడ్ లో మీ పోస్ట్ లను లికె చేసిన లేదా షేర్ చేసిన వారి పేర్లు మరియు ప్రొఫైల్ పిక్చర్ లు వస్తూ ఉంటాయి కదా! అదే నోటిఫికేషన్ లలో కూడా కనిపిస్తాయి. దీనితో పాటు మీకు తెలిసిన వ్యక్తులు అని కొంతమంది వ్యక్తుల ఫేస్ బుక్ ఎకౌంటు లు వారి వారి ప్రొఫైల్ పిక్చర్ లతో సహా మనకు న్యూస్ ఫీడ్ లో కనిపిస్తూ ఉంటాయి. అంటే దేని అర్థం ఏమిటి? అవి మీకు ఎలాగైతే కనిపిస్తున్నాయో మీరు కూడా ఎదో ఒక చోట అలా కనిపిస్తారు కదా! అంటే మీ పేరు నూ, మరియు ఫోటో లను ఫేస్ బుక్ యాడ్ లకోస్సం వాడుకుంటుంది అన్నమాట. ఏఎ విధమైన కండిషన్ కు కూడా మనం మొదట్లోనే ఒప్పందం చేసుకుంటాము. కానీ అది గమనించము.
ఫేస్ బుక్ పై ఏదైనా చర్య తీసుకోవాలి అంటే కేవలం కాలిఫోర్నియా లో మాత్రమే తీసుకోవాలి. దీనికి మీరు అంగీకరించారు
ఈ విధమైన టర్మ్స్ అండ్ కండిషన్ లు ఏక పక్షం గానూ మరియు మీ ప్రైవసీ కి భంగం కలిగించేవిగా ఉన్నాయి అని అనుకుంటున్నారా? దీనికి సంబంధించి మీరు ఫేస్ బుక్ పై కేసు వేయాలి అనుకుంటే అది కేవలం కాలిఫోర్నియా లోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ లో కానీ లేక స్యాన్ మ్యాటో కౌంటీ లోని స్టేట్ కోర్ట్ లో మాత్రమే మీరు దావా వేయవలసి ఉంటుంది. ఈ రకమైన కండిషన్ ను కూడా మీరు మొదట్లోనే యాక్సెప్ట్ చేశారు!
"
"