నిత్యం ఆన్ లైన్ లో ఉండడం, రోజుకి కనీసం ఒక గంట సేపైనా ఇంటర్ నెట్ ను ఉపయోగించడం అనేది నేడు ఒక నిత్యకృత్యం అయింది. ఇంటర్ నెట్ అనేది అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఇంటర్ నెట్ ను ఉపయోగించి తమ రోజు వారీ కార్యకలాపాలు చేసుకోవడం, స్నేహితులు మరియు సన్నిహితులతో నిరంతరం టచ్ లో ఉండడమే గాక ఇంటర్ నెట్ ను ఉపయోగించి డబ్బు సంపాదిస్తున్న వారు కూడా అనేక మంది ఉన్నారు. మరి ఈ ఇంటర్ నెట్ కు మనకు కావలసింది ఏమిటి? ఎలక్ట్రిసిటీ మరియు సరైన ఇంటర్ నెట్ కనెక్షన్ లే కదా!
ప్రస్తుత రోజుల్లో మనకు ఇంటర్ నెట్ ను అందిస్తున్న అనేక రకాల పరికరాలు అందుబాటులో ఉన్నాయి. టాబ్లెట్ లు, స్మార్ట్ ఫోన్ లు కూడా మనకు నెట్ ను అందిస్తాయి. ఇవి కాక మన కంప్యూటర్ కు అయితే బ్రాడ్ బ్యాండ్, వైఫై రూటర్ తదితరములు మనకు ఇంటర్ నెట్ ను అందిస్తున్నాయి. అయితే ఒక్కోసారి ఈ ఇంటర్ నెట్ అనేది తక్కువ స్పీడ్ తో లభిస్తూ మనలను చికాకు పెడుతూ ఉంటాయి. అవసరమైన సమయం లోనే ఇంటర్ నెట్ కనెక్టివిటీ నెమ్మదిస్తుంది.
అయితే అలాంటి సందర్భాలనుండి బయటపడడానికి ఇంటర్ నెట్ నుండి గరిష్ట ప్రయోజనాన్ని పొందడానికి 7 రకాల టిప్స్ ను ఈ ఆర్టికల్ లో అందిస్తున్నాం.
1.Test it
మీరు సాధారణంగా ఏదైనా లోకల్ సర్వీస్ ప్రొవైడర్ ల ద్వారా ఇంటర్ నెట్ కనెక్టివిటీ ని కలిగిఉంటారు. కాబట్టి మీరు ఎంత చెల్లిస్తున్నారు దానికి ఎంత స్పీడ్ రావాలి అనే అంశం పై మీకు ఒక స్పష్టమైన అవగాహన ఉంటుంది. మరి మీ ఇంటర్ నెట్ ఎంత స్పీడ్ తో వస్తుందో తెలుసుకునేదేలా? మీ ఇంటర్ నెట్ యొక్క స్పీడ్ ను తెలుసుకునేందుకు స్పీడ్ టెస్ట్ ను అందిస్తున్న అనేక రకాల వెబ్ సైట్ లు నేడు అందుబాటులో ఉన్నాయి. ఇవి మీ డౌన్ లోడ్ మరియు అప్ లోడ్ స్పేడ్ లను అత్యంత ఖచ్చితంగా మీకు తెలియజేస్తాయి. కాబట్టి వెంటనే వాటిని మీ కంప్యూటర్ లో ఇన్ స్టాల్ చేసుకోండి. అంతేగాక మన స్మార్ట్ ఫోన్ లలో ఉండే ఇంటర్ నెట్ స్పీడ్ ను తెలుసుకోవడానికి కూడా అనేకరకాల యాప్ లు నేడు అందుబాటులో ఉన్నాయి.
2. Secure it
మీరు కాకుండా వేరే వారు మీ ఇంటర్ నెట్ ను ఉపయోగిస్తున్నపుడు కూడా మీ నెట్ స్లో అవుతుంది. కాబట్టి మీ ఇంటర్ నెట్ ను WPA లేదా WPA 2 ఎం క్రిప్షన్ ద్వారా సెక్యూర్ గా ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఇలా మీ నెట్ కు పాస్ వర్డ్ ను సెట్ చేసుకోవడం ద్వారా వేరే వారు అనధికారికంగా మీ రూటర్ లేదా మోడెమ్ కు యాక్సెస్ అవకుండా ఉంటారు. మీ పాస్ వర్డ్ వీలైనంత పెద్దగా ఉండేట్లు చూసుకోండి. అది అంకెలు, సంకేతాలు, మరియు స్పెషల్ క్యారెక్టర్ ల తో కూడినదై ఉంటె మరింత సురక్షంగా ఉంటుంది. అంతేకాదు మీ వైఫై పాస్ వర్డ్ లను ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు.
3. Update it
మీరు రెండు విషయాలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవలసి ఉంటుంది. ఒకటి మీ రూటర్ యొక్క ఫర్మ్ వేర్ మరియు మీ బ్రౌజర్ యొక్క వెర్షన్. ఫర్మ్ వేర్ అనేది మీ రూటర్ కు సాఫ్ట్ వేర్ ను అందిస్తుంది. ఈ రూటర్ యొక్క సాఫ్ట్ వేర్ లో ఉండే లోపాలను ఆసరాగా చేసుకుని హ్యాకర్ లు మీ ఆన్ లైన్ ఆక్టివిటీ లపై దాడి చేసే అవకాశం ఉంది, దీని ప్రభావం మీ ఇంటర్ నెట్ స్పీడ్ పై కూడా పడుతుంది. కాబట్టి మీ రూటర్ యొక్క సాఫ్ట్ వేర్ ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవడం ఉత్తమం. ఇక రెండవదిగా మీ బ్రౌజర్ ను అప్ డేట్ చేసుకోవడం. మీరు పాత బ్రౌజర్ ను వాడుతూ ఉన్నట్లయితే అది మీకు తగినంత స్పీడ్ ను అందించదు. కాబట్టి మీ బ్రౌజర్ ను కూడా ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవాలి.
4. Reboot it
మీ రూటర్ ను ఎప్పటికప్పుడు రీ బూట్ లేదా రీ స్టార్ట్ చేసుకోవడం ద్వారా కూడా తక్కువ స్పీడ్ సమస్య నుండి బయటపడవచ్చు. ISp నుండి ఏవైనా అప్ డేట్ లు వచ్చినపుడు రీబూట్ చేసుకోవడం ద్వారా వాటిని ఇన్ స్టాల్ చేసుకోవచ్చు, తద్వారా మీ ఇంటర్ నెట్ స్పీడ్ ను పెంచుకోవచ్చు.
5. లొకేషన్
లొకేషన్ అనేది చాలా ముఖ్యమైన అంశం. మీ డివైస్ కూ మరియు మీ రూటర్ కి మధ్య ఎంత దూరం ఉంది, వాటి మధ్య గోడలు లాంటి అవరోధాలు ఏవైనా ఉన్నాయా అనేది కూడా మీ ఇంటర్ నెట్ యొక్క స్పీడ్ పై ప్రభావం చూపుతుంది.కాబట్టి మీ రూటర్ కూ మరియు మీ సిస్టం లూ మధ్య ఏ విధమైన అవరోధాలు లేకుండా సెట్ చేసుకోవడం మంచిది. అలాగే మీ రూటర్ ను మీ ఇంటిలోని అత్యంత ఎత్తైన స్థానం లో ఉంచడం ద్వారా కూడా మీరు ఎక్కువ స్పీడ్ ను పొందవచ్చు.
6. యాక్సెస్ పాయింట్
వైఫై సిగ్నల్ ను ఎక్స్ టెండ్ చేయడానికి ఉపయోగించేదే యాక్సెస్ పాయింట్. దీనివలన ఉపయోగం ఏమిటంటే ఈ యాక్సెస్ పాయింట్ ద్వారా కనెక్ట్ చేయబడిన పరికరాలు తమ డైనమిక్ IP అడ్రెస్ ను కలిగిఉంటాయి. అలాకాకుండా మీకు ఒక ప్రత్యెక వైఫై నెట్ వర్క్ కావాలి అనుకుంటే మీ ఇంట్లోని మరొక ప్రదేశం లో వేరొక రూటర్ ను సెట్ చేసుకోవచ్చు. తద్వారా కూడా మీరు గరిష్ట ఇంటర్ నెట్ స్పీడ్ ను పొందవచ్చు.
7. గూగుల్ WiFi
గూగుల్ వైఫై అనేది ఈ మధ్యే లాంచ్ చేయబడిన ఒక యాక్సెస్ పాయింట్. ఇక్కడ మూడు చిన్న పరికరాలు రూటర్ లాగా పనిచేస్తాయి. గూగుల్ యొక్క ప్రతి సెట్ లోనూ మూడు యాక్సెస్ పరికరాలు ఉంటాయి.వీటిని మీ ఇంట్లో ఎక్కడైనా ఉంచుకోవచ్చు. ఇలాంటి పరికరాలను వాడడం ద్వారా కూడా మీ ఇంటర్ నెట్ స్పీడ్ ను గరిష్టంగా పొందవచ్చు.