మనం ఫేస్ బుక్ ను ఉపయోగించేటపుడు మనలను ఫేస్ బుక్ నిరంతరం ట్రాక్ చేస్తూ ఉంటుంది. అందులో ఏ మాత్రం సందేహం లేదు. ఇది అందరికీ తెలిసినదే. ఫేస్ బుక్ యొక్క ప్రైవసీ పాలసీ లో కూడా ప్రకటనల కోసం మిమ్మల్ని ట్రాక్ చేస్తునట్లు ఉంటుంది. అయితే మనం ఫేస్ బుక్ వాడని సమయాల్లో కూడా అంటే మనం ఆఫ్ లైన్ లో ఉనపుడు కూడా ఫేస్ బుక్ మనల్ని ట్రాక్ చేస్తుందని ఎంత మందికి తెలుసు? అవును ఇదిద్ వాస్తవం. మనం ఆఫ్ లైన్ లో ఉన్నపుడు కూడా మన కార్యకలాపాలను ఫేస్ బుక్ నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటుంది. వివిధ రకాల కమర్షియల్ డేటా బ్రోకర్ లనుండి ఫేస్ బుక్ మన సమాచారాన్ని సేకరిస్తుంది.
ఫేస్ బుక్ ఉపయోగించడానికి ఫ్రీ గా ఉండే ఫ్లాట్ ఫాం కాబట్టి దీని ఆదాయం అంతా ప్రకటనల నుండే వస్తుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు వినియోగదారుని అవసరానికి తగ్గ ప్రకటనలు పంపడానికి ఫేస్ బుక్ మిమ్మల్ని ట్రాక్ చేయనున్నట్లు అది తన ప్రైవసీ పాలసీ లోనే పేర్కొంటుంది. అయితే ప్రో పబ్లికా అనే ఒక సంస్థ చేపట్టిన ఆరవే లో తేలిన విషయం ఏమిటంటే ఆఫ్ లైన్ లో కూడా ఫేస్ బుక్ అదే పనిలో ఉన్నది.
దీని రిపోర్ట్ ప్రకారం డేటా లోగిక్స్, ఎప్సిలాన్, ఆక్సియం, ఎక్స్పీరియాన్, మరియు క్వంటియం లాంటి వివిధ రకాల కమర్షియల్ డేటా బ్రోకర్ ల ద్వారా మీరు ఆఫ్ లైన్ లో ఉన్నపుడు కూడా మీ డేటా ను ట్రాక్ చేస్తుంది.
ఈ సర్వే ఎలా జరిగింది?
ప్రో పబ్లికా యొక్క రిపోర్టర్ ల చే తయారు చేయబడిన క్రోమ్ ఎక్స్ టెన్షన్ ను ఉపయోగించిఫేస్ బుక్ ను ఉపయోగించే కేటగరీ లన్నింటినీ డీ క్లాసిఫై చేసి , యూజర్ లను ఆ ఎక్స్ టెన్షన్ లను ట్రై చేసి వారి డేటా ను తన రిపోర్టర్ లతో పంచుకోవలసిందిగా కోరింది. అనుకున్నట్లు గానే ఈ డేటా అంతా రివీల్ చేయబడింది. జెండర్, లొకేషన్, ఫేవరెట్ రెస్టారెంట్, సూపర్ మార్కెట్ లో ఏమేమి కొంటారు, మీ ఇష్టా ఇష్టా లు ఏమిటి తదితర విషయాలన్నీ ఫేస్ బుక్ మిమల్ని ఆఫ్ లైన్ లో ఉండగా ట్రాక్ చేసినట్లు పరిశోధనలో తేలింది. మొత్తంమీద మీకు 52.235 రకాల అంశాలలో మీకు సంబందించిన సమాచారాన్ని ఫేస్ బుక్ ట్రాక్ చేసింది.
ఇలా ట్రాక్ చేసిన సమాచారాన్ని ఫేస్ బుక్ ఏం చేస్తుంది?
మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు ఫేస్ బుక్ యొక్క ప్రధాన ఆదాయ వనరు ప్రకటనలు. యూజర్ లు నివసించే ప్రదేశం, వారి ఇష్టా ఇష్టాలు, అభిరుచులూ, అవసరాలను తెలుసుకోవడం ద్వారా వారికి సంబందించిన ప్రకటనలు పంపుతుంది. ఇలా యూజర్ గురించి ఒక సమగ్రమైన సమాచారం కావాలి అంటే ఆన్ లైన్ సమాచారం ఒక్కటే సరిపోదు. ఎందుకంటే కొంతమంది తమ ప్రొఫైల్ లో నకిలీ సమాచారాన్ని కూడా ఉంచుతారు, మరికొంత మంది తమ పూర్తీ సమాచారాన్ని ఇవ్వడానికి ఇష్టపడరు. అలాంటి సందర్భాలలో వినియోగదారుని పూర్తీ సమాచారం తెలుసుకోవాలి అంటే కేవలం ఆన్ లైన్ సమాచారం ఒక్కటే సరిపోదు. మీరు ఆఫ్ లైన్ లో ఉన్నపుడు ఏమేం చేస్తున్నారు తదితర సమాచారాన్ని తెలుసుకోవడం ద్వారా మీకు సంబందించిన ప్రకటనలను ఫేస్ బుక్ మీ టైం లైన్ లో పోస్ట్ చేస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ డేటా ను ఫేస్ బుక్ రహస్యం గా సేకరిస్తుంది.