• తాజా వార్తలు

అమజాన్ ప్రైమ్ vs నెట్ ఫ్లిక్స్ vs హాట్ స్టార్ vs ఎయిర్ టెల్ మూవీస్ vs వూట్

న దేశం లో సినిమా లను చూసే వారి కంటే టీవీ షో లను చూసే వారి సంఖ్యే ఎక్కువ. దీనికి కారణం అందరూ ఊహించతగినదే. ప్రత్యేకించి సినిమా థియేటర్ లకు వెళ్లి వందల కొద్దీ డబ్బు ఖర్చు పెట్టడం దండగ కదా! అందుకనే సినిమా లను కూడా ఇంట్లో కూర్చునే టీవీ లలో వీక్షించే వారి సంఖ్య చాలా ఎక్కువ. అయితే ఈ టీవీ షో లు ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ రిపీట్ అవ్వవు. ఒకవేళ అయినా ఎప్పటికో అవుతాయి. మరి వాటిని తిరిగి చూడాలంటే ఎలా? అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికోసం వచ్చిందే ఆన్ లైన్ స్ట్రీమింగ్ సర్వీసెస్. నేడు అనేక రకాల ఆన్ లైన్ సర్వీస్ లు అందుబాటులో ఉన్నాయి. అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఆన్ లైన్ వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ లకు అంతగా ఆదరణ లభించలేదు. ఎందుకంటే అనేక టోరెంట్ సైట్ లు అప్పటికే అనేక రకాల వీడియో లను అందిస్తూ ఉన్నాయి. అయితే గత సంవత్సరం నుండీ పరిస్థితి లో మార్పు వచ్చినట్లు కనిపిస్తుంది. ఆన్ లైన్ వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ లు మెల్లమెల్లగా వేగం పుంజుకుంటున్నాయి.  ఇండియా లో ఇంటర్ నెట్ సర్వీస్ ప్రొవైడర్ లు FUP లకు ఎక్కువ డేటా ను అందిస్తూ ఉండడం తో ఆన్ లైన్ వీడియో స్ట్రీమింగ్ ను ఉపయోగించేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ వేగవంతమైన ఆన్ లైన్ ప్రపంచం లో అనేకరకాల వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏది ఎంచుకోవాలి అనే అంశం లో వినియోగదారులకు కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నమాట వాస్తవం. అమజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, వూట్, హాట్ స్టార్, మరియు ఎయిర్ టెల్ మూవీస్ లాంటి అనేక రకాల సర్వీస్ లలో ఏది ఉత్తమం అని ఎంచుకోవాలి అంటే కొన్ని విషయాలను పరిగణన లోనికి తీసుకోవలసి ఉంటుంది. వాటి గురించి మరియు వీటిలో ఉత్తమమైన దానిని ఎలా ఎంచుకోవాలి అనే అంశాల గురించిన విశ్లేషణ ఈ వ్యాసం లో చూద్దాం.

 పరిగణన లోనికితీసుకోవలసిన అంశాలు

  1. ధర
  2. వీడియో కేటలాగ్
  3. వీడియో ప్లే బ్యాక్ మరియు యూజర్ ఇంటర్ ఫేస్
  4. భారతీయ కాంటెంట్
  5. ఒరిజినల్ కాంటెంట్
  6. స్ట్రీమింగ్ మరియు ఆఫ్ లైన్ వ్యూయింగ్ ఆప్షన్ లు

ఈ అంశాలలో ఏది ఉత్తమo?

మిగతా పోటీదారులతో పోలిస్తే వూట్ చాలా వెనుకబడి ఉంది. అయితే MTV లోల ప్రసారమయ్యే ప్రముఖ టీవీ షో అయిన బిగ్ బాస్ ద్వారా ఇది మళ్ళీ ఊపులోనికి వచ్చింది.

మల్టిపుల్ సబ్ స్క్రిప్షన్స్ లన్నీ ఒకే యాప్ లో ఉంచడం ద్వారా ఎయిర్ టెల్ మూవీ యాప్ ముందంజ లో ఉన్నది. అయితే ఒరిజినల్ కాంటెంట్ ను ఆఫర్ చేయడం లో మాత్రం ఇది కొంచెం వెనుకబడి ఉన్నది.

నెట్ ఫ్లిక్స్ యొక్క అధిక ధర మరియు ఇండియన్ కాంటెంట్ లేకపోవడం అనేవి దీనికి ప్రతికూల అంశాలుగా మారుతున్నాయి.

వీటిలో నెట్ ఫ్లిక్స్ మంచి యూజర్ ఎక్ల్స్ పీరియన్స్ ను కలిగి ఉన్నప్పటికీ అమజాన్ నే ఉత్తమం అని చెప్పవచ్చు. ఎందుకంటే దీని ధర సంవత్సరానికి రూ 499/- లు మాత్రమే ఉంటుంది. అంటే నెలకు కేవలం రూ 42/- లు మాత్రమే. అంతేగాక దీని కాటలాగ్ లో అనేక రకాల షో లు ఉంటాయి.

ఇండియా లోని మొట్టమొదటి స్ట్రీమింగ్ సర్వీస్ లలో ఒకటైన హాట్ స్టార్ కూడా మంచి అనుభూతిని అందిస్తుంది. అద్భుతమైన ఇంటర్ ఫేస్ మరియు ఒరిజినల్ క్వాలిటీ మరియు ఇండియన్ కాంటెంట్ వలన హాట్ స్టార్ ఒక మంచి ఎంపిక గా కనపడుతుంది.

అమజాన్ ప్రైమ్ మరియు హాట్ స్టార్ లు రెండూ ఒక మంచి వీడియో లతో కూడిన కాటలాగ్ ను కలిగిఉంటూ వాటికీ చెల్లించే ధరకు తగిన కాంటెంట్ ను అందిస్తాయి. మిగతా వాటితో పోటీలో చూసుకుంటే ఇవి చాలా తక్కువ రేటు లోనే అందిస్తాయి.

ఒరిజినల్ కాంటెంట్ ను పొందాలంటే ఈ రెండింటి నుండీ ఎటువంటి సబ్ స్క్రిప్షన్ లేకుండానే పొందవచ్చు. అమజాన్ అతి త్వరలోనే భారత కేంద్రక ఒరిజినల్ కాంటెంట్ ను అందించనుంది. దీనితో ఇది ఈ విభాగం లో అగ్రస్థానం లోనికి వెళ్ళే అవకాశం ఉంది.

ఎలా ఎంచుకోవాలి?

మీకు ఇండియన్ కాంటెంట్ అంత అవసరం లేకపోతే మీరు నెట్ ఫ్లిక్స్ ద్వారా అద్భుతమైన ఇంటర్ ఫేస్ లో కొన్ని గొప్ప గొప్ప వీడియో లను చూడవచ్చు.

నెట్ ఫ్లిక్స్ అవసరం లేదు అనుకుంటే మీరు అమజాన్ ను ఎంచుకోవచ్చు. కాకపోతే కాంటెంట్ క్వాలిటీ నెట్ ఫ్లిక్స్ కు ఉన్న స్థాయిలో ఉండదు.

నెలకు కొంచెం ఎక్కువ ఖర్చు అయినా పర్వాలేదు ఇండియన్ కాంటెంట్ కావాలి అనుకుంటే మాత్రం హాట్ స్టార్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు.

ఏమీ చెల్లించవలసిన ఆలోచన లేకపోతే వూట్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ మూవీ లు, షో లు ఇందులో ఉండనప్పటికీ కొన్ని మంచి ఒరిజినల్ లను ఇది కలిగిఉంటుంది.

చూశారు కదా! మీ అవసరాలకు మరియు ఆలోచనలకూ తగ్గట్లు మీరు వీటిలో దేన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు.

జన రంజకమైన వార్తలు