అర్జెంట్ గా వీడియో కాల్ అటెండ్ అవ్వాలా ? వీడియో చాటింగ్, కాన్ఫెరెన్స్ కాలింగ్ అనేవి ప్రపంచ నలుమూలల ఉన్నవారిని కూడా ఎదురుగా మాట్లాడే అనుభూతిని కల్పిస్తాయి. అంతేగాక ఇవి ఇప్పుడు సర్వసాధారణం కూడా అయిపోయాయి. 3జి రాకతో వీడియో కాలింగ్ అవతరించగా 4జి రంగ ప్రవేశంతో అది తారాపథంలో దూసుకుపోతుంది. ఈ వీడియో చాటింగ్ అనేక రకాలు. పర్సనల్ కాలింగ్, ఇంటర్వ్యూ, సోషల్ మీడియాలో వీడియో కాలింగ్, ఇలా అనేక రకాలుగా వీడియో కాలింగ్ను వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్లలో ఉపయోగించే అనేకరకాల వీడియో కాలింగ్ యాప్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇలా అనేక మంది అనేక రకాలుగా వీడియో కాలింగ్ను వాడుతున్నప్పటికీ ఇంకా కొంతమంది వీడియో కాలింగ్ అంటే కొత్తగానూ, బెరుకుగానూ భావిస్తున్నారు. అలాంటి వారికోసమే ఈ ఆర్టికల్. సమర్థవంతమైన వీడియో కాలింగ్ చేయాలి అనుకునే వారికోసం కొన్ని రకాల ట్రిక్స్ను అందిస్తున్నాం. ఇది వీడియో కాలింగ్ ద్వారా ఇంటర్ వ్యూ అటెండ్ అయ్యే వారికి కూడా బాగా ఉపయోగపడుతుంది. 1. కెమెరా పొజిషన్ ను సరైన యాంగిల్ లో ఉంచడం మీ కంప్యూటర్ యొక్క లేదా ఫోన్ యొక్క వెబ్క్యాం ను సరైన యాంగిల్లో ఉంచుకోవాలి. అవతలి వైపు నుండి మీతో మాట్లాడుతున్న వ్యక్తికి మీ తల ముందు భాగం మరియు రెండు భుజాలు స్పష్టంగా కనిపించేట్లు ఒక త్రిభుజాకార (ట్రయాంగులర్) వ్యూని కల్పించాలి. మీ లాప్ టాప్ కెమెరాలో అయితే మరీ ముందుకు వచ్చి మాట్లాడకూడదు. 2. కెమెరా వైపే చూడండి. చాలా మందికి వీడియో కాలింగ్ చేసేటపుడు తమ డివైస్ యొక్క స్క్రీన్ పై చూడడం అలవాటు. అది సరే కానీ అదే పనిగా స్క్రీన్ వైపు చూడకూడదు. అవతలి వైపు ఉన్న వ్యక్తితో ఐ కాంటాక్ట్ ఉండాలంటే కెమెరా యొక్క లెన్స్ వైపే చూడడం మంచిది. దీనివలన అవతలి వారు మీరు పూర్తిగా సంభాషణలోనే ఉన్నారు అని అనుకుంటారు. కెమెరా వైపు చూసేటపుడు మీ ముఖం లో చిరునవ్వు చెరగనివ్వవద్దు. 3. లైటింగ్ మీరు వీడియో కాలింగ్ చేస్తున్న గదిలో కానీ లేదా ఆ పరిసరాలలో కానీ సరైన లైటింగ్ ఉండేట్లు చూసుకోండి. ఓవర్ హెడ్ లైట్లను వాడవద్దు. వాటివలన మీ కళ్ళకింద నీడలు ఏర్పడతాయి. కెమెరా లెన్స్కు రెండు వైపులా రెండు లైట్లు ఉండేలా చూసుకోవాలి. మీ కుడి పక్కనే ఒక లైట్ ఉండేలా చూసుకోవాలి. దీనివలన మీ ముఖం ప్రకాశవంతం గా కనిపిస్తుంది. 4. బ్యాక్ గ్రౌండ్ ను మార్చండి. మీ బ్యాక్గ్రౌండ్ వీలైనంత స్పష్టంగా ఉండేట్లు చూడండి. మీరు కూర్చున్న బ్యాక్ గ్రౌండ్ చూస్తున్నపుడు అవతలి వారికి ఒక మంచి ఫీలింగ్ కలగాలి. అది మీతో సంభాషణ కొనసాగించేలా ఉండాలి. దానికి తగ్గట్లు మీ బ్యాక్ గ్రౌండ్ ను మార్చుకోండి. 5. నీట్ గా కనిపించండి. వీడియో కాల్ లో మీరు సగం వరకే కనిపిస్తారు. అంటే మీ శరీరం లో పై భాగం వరకే కనిపిస్తుంది. అంతమాత్రాన మీ లుక్ ను అలా వదిలివేయకూడదు. మధ్యలో మీరు సీట్ లో నుండి పైకి లేవవలసిన సందర్భం రావచ్చు. అలాంటపుడు అవతలి వ్యక్తికి మీ డ్రెస్సింగ్ స్టైల్ నచ్చాలి. మీ బాడీ లాంగ్వేజ్ కూడా బాగుండాలి. పాజిటివ్ గా ఉండాలి. కంగారుగా ఉండకూడదు. మరింత ఎనర్జిటిక్గా కనిపించాలంటే మీరు కూర్చున్న కుర్చీలో స్ట్రయిట్ గా కూర్చోండి. |