యాహూ.. ఈ పేరు వింటనేనే ఒకప్పటి యువతలో ఎంతో క్రేజ్! ఎందుకంటే తొలి నాళ్లలో చాటింగ్ చేయడానికి యాహూ మెసెంజర్‌ని మించింది మరొకటి ఉండేది. కాదు దీనిలో చాటింగ్ చేయడం చాలా సులభం కావడంతో కుర్రాళ్లతో నెట్‌కేఫ్‌లకు క్యూలు కట్టేవాళ్లు. గంటల తరబడి యాహూ మెసెంజర్‌లో చాటంగ్ చేస్తూ గడిపేవారు. చాటింగ్ కోసం ఎన్నో కొత్త ఆప్షన్లు వచ్చినా... ఇప్పటికీ చాలా మంది యాహూ మెసెంజర్‌ని ఉయోగిస్తుంటారు. దానిపై ఉండే మక్కువ అలాంటిది. 1998లో తొలిసారి విడుదలైన ఈ యాహూ మెసెంజర్ తర్వాత కాలక్రమేణా ఎన్నో మార్పులకు లోనైంది. స్మార్టుఫోన్ల విప్లవం తర్వాత కూడా యాహూ హవా కొనసాగింది. ఆండ్రాయిడ్ ఫోన్లలో కొత్త వెర్షన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇంతటి ఘన చరిత్ర ఉన్న యాహూ మెసెంజర్ త్వరలోనే నిలిచిపోనుందట. 18 ఏళ్ల నుంచి వినియోగదారులకు సేవలు అందిస్తున్న యాహూ మెసెంజర్‌ను ఈ ఆగస్టు 5తో నిలిచిపోనుంది. ఇప్పటికీ యాహూ మెసెంజర్‌ను ఉపయోగిస్తున్న వారు ఇకపై ఈ సేవలు పొందలేరని యాహూ తెలిపింది. ఇతర విభాగాలపై దృష్టి సారించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ తెలిపింది. మెయిల్, సెర్చ్, టంబ్లర్, న్యూస్, స్పోర్ట్స్, పైనాన్స్, లైఫ్‌స్టయిల్‌ను మరింత మెరుగ్గా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు యాహూ చెప్పింది. గతేడాది డిసెంబర్‌లో ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లలో యాహూ మెసెంజర్ యాప్‌ను ఈ సంస్థ ప్రవేశపెట్టింది. ఈ కొత్త యాప్‌లో యాహూ సర్వీసులు ఫ్లికర్, టంబ్లర్ లాంటి ఆప్షన్లు ఉన్నాయి. వినియోగదారులు హై రిజల్యూషన్ ఇమేజ్‌లు, వీడియోలను షేర్ చేసుకోవడానికి ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సంస్థ తెలిపింది. అంతేకాక టంబ్లర్ ఆప్షన్‌ను ఉపయోగించి జీఐఎఫ్ ఇమేజ్‌లను, ఎమోజీలను వాడుకోవచ్చని చెప్పింది. ఇప్పుడంతా స్మార్ట్‌ఫోన్ల యుగం కావడంతో డెస్క్‌టాప్ మీద చాటింగ్ తగ్గిపోయిందని ఈ నేపథ్యంలోనే మెసెంజర్‌ను ఆపేస్తున్నట్లు యాహూ పేర్కొంది. |