మీరు సీరియస్ గా ఫేస్‌బుక్ చూడడంలో మునిగిపోతే నిజంగా మీ పక్కన ఫేస్‌బుక్ సీఈవో జుకెర్‌బర్గ్ వచ్చి కూర్చున్నా కూడా గుర్తించలేరు అంటూ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్లలో ఓ ఫొటో రీసెంటుగా హల్‌చల్ చేస్తోంది. ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ నెట్‌వర్క్‌లు జనాన్ని ఎంతలా మార్చేశాయో చెప్పడానికి ఇదో ఉదాహరణ మాత్రమే. పొద్దున లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఏ చిన్న పని చేసినా అప్‌డేట్ చేసేవారు, వాటికి లైక్‌లు, కామెంట్లు వస్తే చూసుకుని మురిసిపోయేవాళ్లు, ఒక హీరో లేదా పొలిటీషియన్ కు సంబంధించిన పోస్టులను పనిగట్టుకుని ట్రాల్ చేసే బ్యాచ్‌లు, ఇలా చాలా రకాల జనాలు వీటిలో కనిపిస్తుంటారు. అంటే తెలియకుండానే ప్రతి రోజూ గంటల కొద్దీ టైం వేస్ట్ చేస్తున్నామని చాలామంది గుర్తించినా అప్పటికే వారికి అది వదులుకోలేని అలవాటుగా మారిపోతుంది. వీటితో టైం వేస్ట్ కాకుండా ఏం చేయాలి అనుకునేవాళ్లు చాలామందే ఉన్నారు. ఇలాంటి వాళ్లకు నిపుణులు ఇస్తున్న సూచనలివిగో..
ఫేస్‌బుక్‌లో వందల కొద్దీ నోటిఫికేషన్లు, ఫ్రెండ్స్ నుంచి గ్రూప్స్ నుంచి మిమ్మల్ని డిస్ర్టబ్ చేస్తుంటే వాటిని కంట్రోల్ చేసేందుకు ఫేస్‌బుక్ యాప్ లేదా వెబ్ వెర్షన్‌లో కూడా ఆప్షన్లు న్నాయి. ఫేస్ బుక్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్ సెట్టింగ్స్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. దీనిలో నోటిఫికేషన్స్‌లోకి మీకు ఎన్ని రకాలుగా నోటిఫికేషన్స్ వస్తున్నాయో తెలుస్తుంది. అందులో అవసరం లేదనుకున్న వన్నీ ఆఫ్‌లో పెడితే చాలు క్షణక్షణం వచ్చే కొత్త నోటిఫికేషన్ల తో టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. అంతగా ఫ్రెండ్స్, బంధువులు, కొలీగ్స్‌కు సంబంధించిన సమాచారం ఏదైనా మిస్సవుతునేవారు రోజులో ఏదో ఒక అరగంట సేపు చూస్తే సరిపోతుంది.
* అకౌంట్ సెట్టింగ్స్‌లో నోటిఫికేషన్స్‌లోకి వెళ్లి యాప్స్‌ను క్లిక్ చేస్తే ఎన్ని యాప్‌ల నుంచి నోటిఫికేషన్స్ నుంచి వస్తున్నాయో చూడొచ్చు. అవసరం లేని యాప్ లన్నింటినీ ఆఫ్ చేస్తే వాటి నుంచి అనవసర నోటిఫికేషన్లను కంట్రోల్ చేయవచ్చు. ఈ యాప్‌లను ఫోన్లో నుంచి అన్ ఇన్‌స్టాల్ చేస్తే వాటి నుంచి ఫేస్‌బుక్‌కు ఎలాంటి నోటిఫికేషన్లు రావు. అయితే యాప్ లను యూజ్ చేయాలనుకునేవారు వీటి నుంచి వచ్చే నోటిఫికేషన్లను ఆఫ్ చేస్తే సరిపోతుంది.
* పెద్దగా పరిచయం లేకున్నా, వేరే ఫ్రెండ్ ద్వారా మ్యూచువల్ ఫ్రెండ్‌గా వచ్చి యాడయిన వారిని ఫ్రెండ్స్ లిస్ట్‌లో చాలామందే ఉంటారు. అలాంటి వారి నుంచి నోటిఫికేషన్లు ఒకటి రెండు రోజులు బ్లాక్ చేసి చూడాలి. ఇంపార్టెంట్ మెసేజ్‌లు లేవనుకుంటే వారిని అన్‌ఫ్రెండ్ చేయడం ఉత్తమం.
ట్విట్టర్‌లో కంపెనీ అకౌంట్లను అవసరం లేని సెలబ్రిటీ ఎకౌంట్లను ఫాలో అవడం మానేసినా చాలా టైం సేవ్ అవుతుంది. ఇలాంటి అకౌంట్లకు లేదా ఫ్రెండ్స్‌కు సంబంధించి ఏదైనా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఉందని తెలిస్తే నేరుగా సెర్చ్‌లో ఆ పేరు కొట్టి తెలుసుకోవచ్చు.
ఈ మెయిల్‌కు నోటిఫికేషన్లు
సెల్‌ఫోన్‌కే ఫేస్‌బుక్, ట్విట్టర్ నోటిఫికేషన్లు వస్తుంటాయి. అలా ఒక నోటిఫికేషన్‌తో మొదలై దానిపై కామెంట్లు, ట్విట్టర్ అయితే ఆ ట్వీట్‌కు రీ ట్వీట్లు ఇలా ఒకదాని తర్వాత ఒకటి చూస్తూ టైం వేస్ట్ చేస్తుంటారు. ఈ నోటిఫికేషన్లను ఫోన్‌కు కాకుండా ఈ మెయిల్‌కి వచ్చేలా సెట్ చేస్తే టైం సేవ్ అవుతుంది. ఫేస్ బుక్‌లో అయితే అకౌంట్ సెట్టింగ్స్‌లో నోటిఫికేషన్స్‌లోకి వెళ్లి ఈమెయిల్‌ను క్లిక్ చేసి ఈ ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు. అందులో కూడా ఎలాంటి నోటిఫికేషన్లు రావాలనేది స్పైసిఫై చేసుకోవచ్చు.
ట్విట్టర్‌లో అయితే ట్విట్టర్ సెట్టింగ్స్ పేజీలోకి వెళ్లి ఈ మెయిల్ నోటిఫికేషన్స్‌ను క్లిక్ చేసి ఈ మెయిల్ అలెర్ట్స్ పొందవచ్చు. దీనివల్ల మెయిల్ ఓపెన్ చేసినప్పుడే నోటిఫికేషన్లు కూడా చూసుకొని అవసరమైతే వాటిని ఫేస్‌బుక్ లేదా ట్విట్టర్‌లో ఫాలో కావచ్చు.
బ్రౌజర్లకూ ఫిల్టర్లు పెట్టండి
ల్యాప్‌టాప్ లేదా పీసీల్లో సోషల్ నెట్‌వర్క్‌లు వాడుతున్నవారికి వీటిని కంట్రోల్ చేసేందుకు మరో ఆప్షన్ కూడా ఉంది. క్రోమ్ యూజర్లకు స్టే ఫోకస్డ్ వంటివి, ఫైర్‌ఫాక్స్ వాడేవారికి లీచ్‌బ్లాక్ వంటి ఆప్షన్లు ఉన్నాయి. వీటిని ఉపయోగించి ఫలానా టైంలో ఫలానా సైట్‌ను ఎవాయిడ్ చేసేలా సెట్ చేసుకోవచ్చు. దీనితో వేరే పని చేసుకునేటప్పుడు నోటిఫికేషన్ల చికాకు ఉండదు.
మ్యాక్‌లు, విండోస్ కు కోల్డ్ టర్కీ, ఫ్రీడం , కీప్ మీ అవుట్ వంటి ఆప్షన్లు ఉన్నాయి.
డీయాక్టివేషన్.. అల్టిమేట్ ఆప్షన్
ఇవన్నీ కాదంటారా.. అసలు మీ ఫేస్‌బుక్ లేదా ట్విట్టర్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసి పారేయండి.. అంతకు మించిన అత్యున్నత పరిష్కారం లేదంటున్నారు ఎక్స్‌పర్టులు. ఫేస్‌బుక్ అకౌంట్ డిలీట్ చేయాలంటే అకౌంట్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి సెక్యూరిటీని క్లిక్ చేస్తే చివర కనిపించేది అకౌంట్ డీ యాక్టివేట్ ఆప్షన్. ట్విట్టర్‌లో అయితే అకౌంట్స్ సెట్టింగ్స్ పేజీకి వెళితే బాటమ్‌లో డీయాక్టివేట్ మై అకౌంట్ అని కనిపిస్తుంది. వీటిని గానీ క్లిక్ చేశారా మీకు కావలసినంత టైం దొరుకుతుంది. ప్రకృతిని ఎంజాయ్ చేయవచ్చు. సొసైటీలో మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో కాస్త తెలుసుకోవచ్చు. ఎదురింటివాళ్లను, ఫంక్షన్లకో పార్టీలకో వెళితే తెలిసున్న వాళ్లను పలకరించొచ్చు. సోషల్ నెట్‌వర్క్ మాయలో పడి ఇవన్నీ కోల్పోతున్నారు కదా మరి..!
"