ఇరుగు పొరుగు వారితో మరింత సఖ్యం గా ఉండండి - నియర్ గ్రూప్ యాప్ సహాయం తో ఉరుకులు పరుగులు గా సాగుతున్న నేటి మన ఆధునిక సమాజ జీవితం లో ఇరుగు పొరుగు వారితో సఖ్యంగా ఉండడానికీ అసలు వారితో మాట్లాడడానికీ ఎంతమందికి కుదురుతుంది? అసలు ఆ తీరిక ఎవరికైనా ఉందా? అరె నేటి టెక్నాలజీ లో ప్రతీ దానికీ యాప్ లు వచ్చేస్తున్నాయి కదా ఇరురు పొరుగు వారితో మాట్లాడానికి కూడా ఒక యాప్ ఉంటే బాగుంటుంది కదా అని కొంతమంది అనుకుంటే అది అతిశయోక్తి కాదేమో! అలాంటి వారికోసమే ఒక సరికొత్త యాప్ వచ్చేసింది. అదే నియర్ గ్రూప్ చాట్ యాప్. ఇది ఒక ఆండ్రాయిడ్ యాప్. మన ఇరుగు పొరుగు వారితో నిరంతరం టచ్ లో ఉండడానికీ వారితో కలిసి మంచి ప్రణాళికలు రచించడానికీ ఈ యాప్ చాలా ఉపయోగపడుతుంది. ఇది IOS లో కూడా లభిస్తుంది. ఇది ఒక పేస్ బుక్ పేజి ను కూడా క్రియేట్ చేస్తుంది. మన పొరుగు వారితో నిరంతరం టచ్ లో ఉంటూ ఒక సరికొత్త కమ్యూనిటీ ని ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని ఈ యాప్ కల్పిస్తుంది. ముందుగా మీ ఇరుగు పొరుగు వారందరి దగ్గరా ఈ యాప్ ఉండేలా చూసుకోవాలి. ఒకసారి ఈ యాప్ ఓపెన్ చేశాక మీ ఐడెంటిటీ ని వ్యక్తపరచుకోవాలి. ఒక్కసారి ఈ యాప్ ను ఇన్స్టాల్ చేసుకున్నాక అది మీరు నివసిస్తున్న ప్రాంతం ను అడుగుతుంది. మీ ప్రాంతాన్ని సెలక్ట్ చేసుకున్న తర్వాతే మిగిలింది అందులో కనపడుతుంది. ఇందులో ఒక పనిక్ బటన్ కూడా ఉంటుంది. ఒక వేళ మీరు ఏదైనా అపాయం లో ఉంటే మీ పొరుగు వారికి సంకేతాలు పంపుతుంది. ఈ యాప్ ద్వారా మీ పొరుగు వారిలో మీ మనస్తత్వానికి దగ్గరగా ఉండే వారితో మరింత స్నేహం గా ఉంటూ మీ ఆసక్తులనూ, ఇష్టాలనూ పంచుకోవచ్చు. ఒక ఉన్నత మైన మార్గం లో మీ పొరుగు వారితో ఒక గ్రూప్ సృష్టించే అవకాశాన్ని కూడా ఈ యాప్ కల్పిస్తుంది. మహిళా రక్షణ కు సంబందించిన అంశాలు కూడా ఈ యాప్ లో ఉంటాయి. ఇందులో బయ్/రెంట్ అనే ఒక విభాగం ఉంటుంది. మీరు ఏదైనా అమ్మాలి అనుకున్నా లేదా ఎవరిదగ్గరైనా అప్పు తీసుకోవాలన్నా ఈ విభాగం లో ఉంచితే చాలు . మీ ఇరుగు పొరుగు సమజం లో అవి అవసరమైన వారు మిమ్మల్ని సంప్రదిస్తారు. మొత్తానికి ఈ సాంకేతిక పరిజ్ఞానం అనేది జీవితాన్ని సులభతరం మరియు సుఖమయం చేయడమే కాక మెరుగైన సమాజాన్ని కూడా సృష్టిస్తుందన్న మాట. |