• తాజా వార్తలు

ట్విట్టర్ లో బిగ్ బీకి రెండు కోట్ల మంది ఫాలోవర్లు మోడీ కోటీ 88 లక్షల మంది ఫాలోవర్ల తో రెండో స్థా

లువురు ప్రముఖులు సోషల్ మీడియాలోనూ స్టార్లుగా నిలుస్తున్నారు. ముఖ్యంగా పబ్లిక్ ఫిగర్లకు వేదికైన ట్విట్టర్ లో సెలబ్రిటీల జోరు మామూలుగా లేదు. నరేంద్ర మోడీ పొలిటీషియన్లు ట్విట్టర్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ కూడా ట్విట్టర్ లో కింగే. తాజాగా ఆయన ట్విటర్లో కొత్త మైలురాయిని చేరుకున్నారు. ట్విట్లర్లో ఆయన ఫాలోవర్ల సంఖ్య 2 కోట్లకు చేరుకుందట.

తాజా లెక్కలతో బిగ్ బీ అమితాబ్ ట్విట్టర్ లో సెలబ్రిటీల విభాగంలో టాప్ లో నిలిచారు. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు టాప్ లో ఉన్న మోడీని అమితాబ్ దాటేశారట. మోడీ ప్రస్తుతం కోటీ 88 లక్షల మంది ఫాలోవర్లను కలిగి ఉండగా అమితాబ్ 2 కోట్లకు చేరుకున్నారు.

తాజా ర్యాంకింగులపై అమితాబ్ ఫుల్ ఖుషీగా ఉన్నారట. ‘‘థాంక్యూ ఆల్... ఇక 3 కోట్ల దిశగా వెళ్లాలి’’ అని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో రాశారు. కాలానికి అనుగుణంగా అప్ డేట్ అయ్యే అమితాబ్ ఆ టార్గెట్ కూడా రీచవుతారని అనుకుంటున్నారు. నిత్యం ట్విట్టర్ వేదికగా అనేక విషయాలు షేర్ చేసుకునే ఆయన 3 కోట్ల మార్కును త్వరలో రీచవుతారని భావిస్తున్నారు. మరి మోడీ ఆయన్ను బీటవుట్ చేస్తారో లేదంటే సెకండ్ ప్లేస్ కే పరిమితం అవుతారో చూడాలి.

 

జన రంజకమైన వార్తలు