• తాజా వార్తలు

ఫేస్ బుక్ లైవ్ బ్రాడ్ కాస్ట్ చేయడం ఎలా?

 

సెల్ఫీ లు దిగి ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేయడం అనేది దాదాపు పాత ఫ్యాషన్ అయిపొయింది. అవును సెల్ఫీ మేనియా ఇప్పుడు ఒక అవుట్ డేటెడ్ ఫ్యాషన్. ప్రస్తుతం అంతా లైవ్ స్ట్రీమింగ్ హవా నడుస్తుంది. ఫేస్ బుక్ లో ఎక్కడ చూసినా సెల్ఫీ లకు బదులు ఫేస్ బుక్ లైవ్ స్ట్రీమింగ్ వీడియో లే దర్శనమిస్తున్నాయి. మిమ్మల్ని మీరు ఈ ప్రపంచానికి ఒక సరికొత్త తరహా లో ప్రజెంట్ చేసుకోవడానికి ఒక అత్యుత్తమ సాధనంగా ఈ ఫేస్ బుక్ లైవ్ స్ట్రీమింగ్ అందరి ప్రశంసలు అందుకుంటుంది. మీరు స్మార్ట్ ఫోన్ లేదా టాబ్లెట్ లలో ఏది వాడుతున్నా సరే మీ కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ ఇంటర్ నెట్ ద్వారా మీ ఆడియో మరియు వీడియో ను లైవ్ లో చూసే అవకాశాన్ని ఈ లైవ్ స్ట్రీమింగ్ కల్పిస్తుంది.

   ఫేస్ బుక్ ఈ లైవ్ ను ఈ ఏప్రిల్ లో లాంచ్ చేయగా ఇప్పటివరకూ దీనిని 1.7 బిలియన్ ల మంది వినియోగించుకున్నారు. ఇది మామూలు ఫేస్ బుక్ వినియోగదారులకు కొంచెం సరికొత్త గానే ఉంది. మీతో పాటు అసోసియేట్ అవ్వాలి అనుకునే వారికి ఈ ఫేస్ బుక్ లైవ్ అనేది ఒక మంచి ఫ్లాట్ ఫాం. మీ ఫేవరెట్ వీడియో లను పేస్ బుక్ లో లైవ్ స్ట్రీమ్ లో ఉంచవచ్చు. తద్వారా మీరు మీ రీచ్ ను పెంచుకోవచ్చు, కామెంట్ లను కూడా పొందవచ్చు.

దీనిని చేయడం ఎలా?

మీ ఫేస్ బుక్ ప్రొఫైల్ నుండి ఈలైవ్ స్ట్రీమింగ్ ను ఉపయోగించడం చాలా సులువు. అయితే ముందుగా మీరు ఏప్రిల్ కంటే ముందు ఉన్న ఫేస్ బుక్ వెర్షన్ ను వాడుతున్నట్లయితే వెంటనే అప్ డేట్ చేసుకోవాలి.

  1. ముందుగా మీ ఫోన్ లేదా టాబ్లెట్ లో ఫేస్ బుక్ యాప్ ను ఓపెన్ చేయాలి.
  2. మీ ప్రొఫైల్ ను యాక్సెస్ చేసి స్టేటస్ బార్ ను ఓపెన్ చేయాలి. అక్కడ మీకు “ what is on your mind “ అని కనిపిస్తుంది.
  3. అక్కడ క్రింద భాగం లో ఉన్న “ లైవ్ వీడియో “ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
  4. ఒకవేళ మీ కెమెరా మీ యాప్ మరియు మైక్రో ఫోన్ తో  యాక్సెస్ అయి లేకపోతే యాక్సెస్ అవ్వవల్సిందిగా మీకు ఒక ప్రాంప్ట్ కనిపిస్తుంది. తద్వారా మీ కెమెరా మరియు మైక్రో ఫోన్ ను మీ ఫేస్ బుక్ యాప్ కు యాక్సెస్ చేయవచ్చు.
  5. ఈ పై ప్రక్రియ ఒక్కసారి చేస్తే చాలు మళ్ళీ మళ్ళీ చేయవలసిన అవసరం లేదు.
  6. దీని తర్వాత మీ వీడియో కు సంబంధించి లైవ్ ప్రి వ్యూ ను మీరు చూడవచ్చు. ఇది కేవలం ప్రివ్యూ మాత్రమే, మీరు ఇంకా మీ లైవ్ వీడియో ను ఫేస్ బుక్ కు బ్రాడ్ కాస్ట్ చేయలేదు.
  7. మీ ఫోన్ లో రేర్ లేదా ఫ్రంట్ కెమెరా ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
  8. దీనిని ఉపయోగించి మీ వీడియో ను ల్యాండ్ స్కేప్ మోడ్ లో కానీ లేదా పోర్ట్రేయిట్ మోడ్ లో కానీ రికార్డు చేయవచ్చు. కాకపోతే మీ వీడియో చతురస్రాకారం లో ఉండాలి. దానిని బట్టి మీ వీడియో మోడ్ ను మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు.
  9. ఇప్పుడు మీ వీడియో యొక్క టైటిల్ ను ఎంటర్ చేసి ఆ వీడియో గురించి ఏమైనా రాయాలి అనుకుంటే వివరించవచ్చు.
  10. అ తర్వాత ప్రివ్యూ పేజి కి వెళ్ళాలి, కానీ అక్కడకు వెళ్ళే ముందు మీ వీడియో రిలేటెడ్ ప్రైవసీ సెట్టింగ్ లలోకి వెళ్ళాలి.
  11. ఇక మీ బ్రాడ్ కాస్ట్ లైవ్ ను ప్రారంభించవచ్చు.
  12. కెమెరా ను ఒక నిర్దిష్ట కోణం లో ఉంచి  కుడి వైపు క్రింద భాగం లో ఉన్న “ go live “ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  13. 3..2..1.. ఇలా కౌంట్ డౌన్ ప్రత్యక్షం అవుతుంది.
  14. అంతే ఇక మీరు ఫేస్ బుక్ లైవ్ కు బ్రాడ్ కాస్ట్ అయినట్లే.
  15. మీ మిగతా పోస్ట్ ల లానే ఈ వీడియో కూడా మీ న్యూస్ ఫీడ్ లో కనిపిస్తుంది.
  16. మీ స్క్రీన్ రెండు భాగాలుగా విభజించబడుతుంది. మొదటి భాగం లో వీక్షకుల సంఖ్య తో పాటు మీ వీడియో కనిపిస్తుంది. రెండవ భాగం లో కామెంట్ లు, లైక్ లూ, మీ వీడియో ను ఎవరెవరు చూస్తున్నారో తెలుసుకునే ఆప్షన్ లు ఉంటాయి.
  17. మీరు మీ ఫేస్ బుక్ లైవ్ స్ట్రీమింగ్ ను స్టార్ట్ చేసిన వెంటనే దానిని చూడవలసినదిగా మీ ఫ్రెండ్స్ కు నోటిఫికేషన్ లను పంపిస్తుంది.
  18. మీ వీడియో కు వీక్షకులు పెరగాలి అంటే కొంత సమయం పట్టవచ్చు, అంతమాత్రాన నిరాశ చెందవలసిన అవసరం లేదు.
  19. మీ లైవ్ స్ట్రీమింగ్ అయిపోయిన తర్వాత “ ఫినిష్ “ అనే దానిపై ట్యాప్ చేయడం ద్వారా మీ బ్రాడ్ కాస్ట్ ముగుస్తుంది.
  20. ఈ వీడియో మీ ప్రొఫైల్ పేజి లో కానీ టైం లైన్ లో కానీ పోస్ట్ చేయబడుతుంది, తద్వారా మిగతా వారు కూడా ఈ వీడియో ను చూడవచ్చు.
  21. ఒక వేళ మీరు దీనిని డిలీట్ చేయాలి అనుకున్నా సరే చేసేయవచ్చు. డిలీట్ ఆప్షన్ కూడా అక్కడే ఉంటుంది.

    చూశారుగా ఎంతో సింపుల్ కదా! ఇక వెంటనే మీ ఫోన్ ను ఓపెన్ చేసి పేస్ బుక్ లైవ్ స్ట్రీమింగ్ ను ప్రారంభించండి.

 

జన రంజకమైన వార్తలు