ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ను వినియోగిస్తున్న వారి సంఖ్య దినదినాభివృద్ధి చెందుతుంది. ప్రతీ చిన్న విషయానికీ స్మార్ట్ ఫోన్ పై ఆధారపడే తత్త్వం పెరుగుతూ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ లలో ఎక్కువమంది ఉపయోగించేవి మెసేజింగ్ యాప్ లు. అవును తమ స్నేహితులతోనో, సన్నిహితులతోనో మెసేజ్ చేయడానికే ఎక్కువమంది ఈ స్మార్ట్ ఫోన్ లను ఉపయోగిస్తున్నారు.స్మార్ట్ ఫోన్ ల విస్తృతి తో పాటే వీటిలో ఉండే మెసేజింగ్ యాప్ లు కూడా పెరిగిపోయాయి. అనేకరకాలైన మెసేజింగ్ యాప్ లు ప్రస్తుతం ఆండ్రాయిడ్ మరియు iOS లలో అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటిలో ప్రస్తుతం లభిస్తున్న మెసేజింగ్ యాప్ లలో టాప్ 10 యాప్ లను ఈ ఆర్టికల్ లో అందిస్తున్నాం. ప్రస్తుతం ఎక్కువగా ఉపయోగిస్తున్న వాట్స్ అప్ కు మిగతా 9 యాప్ లు ప్రత్యామ్నాయం కాగలవు.
1. వాట్స్ అప్
ప్రపంచం లో ఎక్కువ మంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్స్ అప్. ఇది ఉచితం గా లభిస్తుంది. ఇది సెట్ అప్ చేసుకోవడానికి చాలా సులువు గా ఉంటుంది.మీరు చాట్ చేసుకోవచ్చు, మీ ఫోటో లు, లొకేషన్, డాక్యుమెంట్ లు, కాంటాక్ట్ లు తదితర విషయాలను షేర్ చేసుకోవచ్చు. మీరు ఈ వాట్స్ అప్ సహాయం తో వాయిస్ కాల్ మరియు వీడియో కాల్ లు కూడా చేసుకోవచ్చు. దీని సెట్ అప్ మీ కాంటాక్ట్ లిస్టు కు యాక్సెస్ ను కల్పిస్తుంది కాబట్టి మీ కాంటాక్ట్ లన్నీ ఆటోమాటిక్ గా మీ వాట్స్ అప్ అకౌంట్ కు సింక్ అవుతాయి. ఇది ఎండ్ టు ఎండ్ ఎం క్రిప్షన్ ను కలిగి ఉంది ప్రైవసీ మరియు సెక్యూరిటీ విషయం లో చాలా సురక్షం గా ఉంటుంది. ఫన్ కోసం ఇది GIF మరియు స్నాప్ చాట్ లాంటి ఎడిటింగ్ ఫీచర్ లను కూడా కలిగిఉంటుంది.
2. ఫేస్ బుక్ మెసెంజర్
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం అయిన ఫేస్ బుక్ తన వినియోగదారుల కోసం తన స్వంత మెసేజింగ్ యాప్ ను లాంచ్ చేసింది . అదే ఫేస్ బుక్ మెసెంజర్. ఇది మీ ఫేస్ బుక్ ఎకౌంటు లో ఉన్న కాంటాక్ట్ లు లేదా ఫ్రెండ్స్ లో ఉన్న కాంటాక్ట్ లను ఇది ఆటోమాటిక్ గా మెసెంజర్ కు సింక్ చేస్తుంది. మీరు ఒక కొత్త కాంటాక్ట్ ను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో చాలా స్టికర్ లు ఉంటాయి. మీరు GIF ఫైల్ లను కూడా పంపవచ్చు. ఇందులో ఉండే వాయిస్ మరియు వీడియో కాలింగ్ చాలా స్పష్టంగా ఉంటుంది. ఆండ్రాయిడ్ లో అయితే మీ హోం స్క్రీన్ లో పై భాగాన చాట్ హెడ్స్ అనే ఫీచర్ ఉంటుంది. దీనివలన మీకు ఏదైనా కొత్త చాట్ వస్తే నోటిఫికేషన్ మాదిరిగా వారి ప్రొఫైల్ ఫోటో తో పాటు కనిపిస్తుంది. ఇది చాలా సౌకర్యవంతం గా ఉంటుంది.
3. లైన్
ఇది చాలా ప్రముఖమైన మెసేజింగ్ యాప్. ప్రత్యేకించి ఆసియా లో అయితే ఇది సుమారు 600 మిలియన్ లకు పైగా వివియోగదారులను కలిగిఉంది. దీని ఫీచర్ లు చాలా రిచ్ గా ఉంటాయి. దీని టైం లైన్ ఫేస్ బుక్ ను పోలి ఉంటుంది. ఇక్కడ మీరు ఏదైనా పోస్ట్ చేయవచ్చు, మీ స్నేహితులు దానిపై కామెంట్ చేయవచ్చు. దీనినుండి ల్యాండ్ లైన్ కు కాల్ చేయవచ్చు, లైన్ టు లైన్ కాల్ లు చేయవచ్చు. మరొక లైన్ ఎకౌంటు ఉచిత వాయిస్ మరియు వీడియో కాల్ లను చేయవచ్చు. ఆసియా లో ప్రముఖమైన అనేక స్టికర్ లు ఇందులో ఉంటాయి. సుమారొ 200 మందితో ఒకేసారి గ్రూప్ చాట్ చేయవచ్చు. ట్విట్టర్ మాదిరిగా ఆర్టిస్ట్ లను మరియు బ్రాండ్ లనూ ఇందులో ఫాలో అవ్వవచ్చు. ఆల్బం లను సెట్ అప్ చేసుకుని అది మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవచ్చు. లైన్ ఈ మధ్య చాట్ లకు ఎన్ క్రిప్షన్ ను కూడా ప్రవేశపెట్టింది.
4. వైబర్
ఇది చాలా పాపులర్ యాప్. మీ కాంటాక్ట్ లను ఆటోమాటిక్ గా యాడ్ చేస్తుంది. ఇది టెక్స్ట్ మెసేజ్ లతో పాటు స్టికర్ మరియు ఎమోటికాన్స్ ను పంపడం, వాయిస్ మరియు వీడియో కాల్ లను చేయడం మీ ఫేవరిట్ ఫోటో లను షేర్ చేయడం లాంటివాటిని ఎలో చేస్తుంది. కలర్ కోడెడ్ ఎన్ క్రిప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది.. ఇంటర్నేషనల్ మరియు డొమెస్టిక్ కాల్ లను చేసుకోవడానికి వైబర్ అవుట్ అనే ఫీచర్ కూడా ఇందులో ఉన్నది.వైబర్ టు వైబర్ ఉచిత కాల్ లను అందిస్తుంది.
5. హ్యాంగ్ ఔట్స్
గూగుల్ కు చెందిన ఈ హ్యాంగ్ ఔట్స్ అనే యాప్ అన్ని ఆండ్రాయిడ్ పరికరాల లోనూ అందుబాటులో ఉంటుంది.ఇది మీ డిఫాల్ట్ మెసేజింగ్ యాప్ గా సెట్ చేసుకోవచ్చు. ఇది iOS లో కూడా లభిస్తుంది. అంతేగాక మీ pc లో మరియు లాప్ ట్యాప్ లో కూడా ఉపయోగించవచ్చు. దీనిని ఉపయోగించాలంటే గూగుల్ ఎకౌంటు ఉండాల్సిన అవసరం లేదు. ఇందులో మీరు మీ ఫోటో లను షేర్ చేసుకోవచ్చు. దీనిని మీ మొబైల్ లతో పాటు డెస్క్ టాప్ లో కూడా ఉపయోగించవచ్చు.
6. గూగుల్ అలో
గూగుల్ యొక్క సరికొత్త చాట్ యాప్ ఈ అలో. దీనిలోని ప్రత్యేక ఆకర్షణ అసిస్టంట్ ఫీచర్. iOS యూజర్ లకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఫోటో షేరింగ్, ఎమోజీ లు, స్టికర్ లు లాంటి ఫీచర్ లను అందిస్తుంది. దీని ఫంక్షన్ సిరి లేదా కోర్టానా లను పోలి ఉంటుంది.ఇది ఆండ్రాయిడ్ మరియు iOS లలో లభిస్తుంది.
7. WeChat
ఇది చైనా లో 700 మిలియన్ ల వినియోగదారులను కలిగిఉన్న పాపులర్ మెసేజింగ్ యాప్. ఫోటో షేరింగ్, వీడియో కాలింగ్ మరియు వాయిస్ కాలింగ్ లాంటి మామూలు మెసేజింగ్ ఫీచర్ లని ఇది అందిస్తుంది. వీటితో పాటు ఫ్రెండ్ రాడార్, పీపుల్ నియర్ బై మరియి షేక్ లాంటి అధునాతన ఫీచర్ లను కూడా ఇది అందిస్తుంది. మీ దగ్గరలో మీ స్నేహితులు ఎవరు ఉన్నారి ఈ ఫీచర్ లు చెబుతాయి. ఈ యాప్ ఆండ్రాయిడ్ మరియు ఆపిల్ లలో లభిస్తుంది.
8. IM+
దాదాపు ప్రతీ సర్వీస్ లోనూ అకౌంట్ ను కలిగి ఉన్న యూజర్ లకు ఈ IM+ యాప్ బాగా ఉపయోగపడుతుంది. వివిధ రకాల సర్వీస్ లనుండి మెసేజ్ లను రిసీవ్ చేసుకోవడం, పంపడం లాంటివాటిని ఇది అందిస్తుంది. మీకు గూగుల్, AIM, ట్విట్టర్, ICQ, యాహూ, ఫేస్ బుక్, లైవ్ ఇలా అనేక సర్వీస్ లో ఎకౌంటు ను కలిగి ఉన్నట్లయితే ఈ ఒకే ఒక్క యాప్ ద్వారా వాటిని మేనేజ్ చేయవచ్చు. మీరు పాత వెర్షన్ లలో ఉన్న యాప్ లను వాడుతూ ఉన్నట్లయితే వాటిని కూడా ఇందులో యాడ్ చేయవచ్చు.
9. సిగ్నల్
చాట్ ఎం క్రిప్షన్ సెక్యూరిటీ ని కలిగి ఉన్న యాప్ లలో ఇది అత్యుత్తమ మైనది గా చెప్పుకోవచ్చు. ఈ యాప్ లో మీ మెసేజ్ లకూ మరియు వాయిస్ కాల్ లకూ మిలటరీ గ్రేడ్ ఎన్ క్రిప్షన్ ను అందిస్తుంది. టెక్స్ట్ లు పంపించడం, వాయిస్ కాల్ లు, గ్రూప్ మెసేజ్ లు,మీడియా ఫైల్ లను పంపడం లాంటివాటిని ఇది సపోర్ట్ చేస్తుంది. సెక్యూరిటీ నే ప్రధానం గా భావించేవారికి ఇది మంచి యాప్
10. స్నాప్ చాట్
యువత మరియు సెలేబ్రటీ లలో ఇది ఇప్పుడిప్పుడే పాపులారిటీ ని సంపాదించుకుంటుంది. ఇది ఫోటో లను వీడియో లను షేర్ చేస్తుంది. ఫోటో ఎడిటింగ్ ఉ కూడా ఇది ఆఫర్ చేస్తుంది. ఫన్నీ గా ఉండే ఫీచర్ లను కలిగిఉంటుంది.
"