ఫేస్ బుక్ వాడకం లో మాత్రమే కాదు దానికి సంబందించిన మరో విషయం లో కూడా ఇండియా రికార్డు సృష్టించింది. సమాచార నిర్మూలన అనే అంశంలో అందరి కంటే ఎక్కువ డిమాండ్ లు పంపిన దేశంగా ఇండియా రికార్డు సృష్టించింది.కంపెనీ విడుదల చేసిన ఒక రిపోర్ట్ ప్రకారం మొత్తం 92 దేశాలలో ఫేస్ బుక్ ను వాడుతుంటే ఒక్క భారత్ నుండే 15,155డిమాండ్ లు వచ్చాయి. అసలు ఏమిటి ఈ సమాచారం? దానిని ఎందుకు నిర్మూలించాలి? ఫేస్ బుక్ వినియోగదారుల ల ద్వారా గానీ లేదా యాజమాన్యం ద్వారా గానీ కొన్ని పోస్ట్ లు పోస్ట్ చేయబడతాయి. అవి అందరికీ ఆమోద యోగ్యం గా ఉండాలన్న నిబంధన ఏమీ లేదుకదా? వాటిలో కొన్ని అభ్యంతరకరమైనవి ఉండవచ్చు, దేశంలో యువతను పెడదారి పట్టించేవి ఉండవచ్చు. లేదా మత సామరస్యాన్ని దెబ్బ తీసేవి ఉండవచ్చు.అలాంటి వాటిని ప్రతి దేశం యొక్క ఐటి విభాగం ఎల్లప్పుడూ మానిటర్ చేస్తూనే ఉంటుంది. అలా అభ్యంతరకరంగా ఉన్న సమాచారాన్ని తొలగించమని ప్రతి సంవత్సరం అన్ని దేశాలు ఫేస్ బుక్ యాజమాన్యానికి డిమాండ్ లు పంపుతాయి. 2014 జూన్ డిసెంబర్ మధ్య కాలంలో 5832 డిమాండ్ లను పంపిన ఇండియా ఈసారి ఏకంగా దానికి మూడింతలు అంటే 15,155 డిమాండ్ లను పంపిందని ఫేస్ బుక్ తన ద్వై వార్షిక నివేదిక లో వెల్లడించింది.వీటి వల్ల దేశంలో మత అనైక్యత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు హెచ్చరించడం వలన దీనిని తొలగించవలసి వచ్చిందని ఫేస్ బుక్ తెలిపింది. అంటే మనం ఫేస్ బుక్ లో ఏమి చేస్తున్నామో కూడా ఏజెన్సీ లు గమనిస్తూనే ఉంటాయన్న మాట. మన దేశంలో అలా నియంత్రించే ఏజెన్సీ లు ఏంటో తెలుసా? 1. లా అండ్ ఎన్ఫోర్సుమేంట్ ఏజెన్సీ ఇండియా 2. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం. ఇది భారత కమ్యూనికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేస్తుంది. భారత్ తర్వాత 4496 రిక్వెస్ట్ లతో టర్కీ రెండవ స్థానంలో ఉంటే 295 రిక్వెస్ట్ లతో ఫ్రాన్స్ మూడవ స్థానంలో ఉన్నది.ఈ ప్రక్రియను 2013 వ సంవత్సంరం లో లో ప్రారంభిస్తే వరుసగా మూడో సంవత్సరం కూడా ఇండియానే మొదటి స్థానంలో నిలవడం విశేషం.ఇది దేనికి సంకేతం?మన ప్రభుత్వ ఏజెన్సీ లు బాగా పని చేస్తున్నాయని సంతోషపడాలా?లేక దేశం లో ఇంతటి అభ్యంతరకరమైన సమాచారం సామాజిక మాధ్యమాలలో హల్ చల్ చేస్తుందని బాధపడాలా? |