ఫేస్ బుక్ లో ముఖ్యమైన విభాగం ఏదీ అంటే న్యూస్ ఫీడ్ అని సమాధానం వస్తుంది. అవును ఫేస్ బుక్ లో ముఖ్యమైన కార్యకలాపాలన్నీ న్యూస్ ఫీడ్ లోనే జరుగుతాయి. దీని వెనుక ఉన్న అల్గోరిథం మీరు మీ స్నేహితుల నుండి వచ్చే పోస్ట్ లలో ఏవేవి చూడవచ్చో , ఏవి చూడకూడదో తదితర విషయాలను నియంత్రిస్తుంది. మీరు ఫేస్ బుక్ లో చేసే ప్రతీ చిన్న పని కూడా ట్రాక్ చేయబడి అది చూపబడాలో వద్దో నిర్ణయించబడుతుంది. ఒక్కోసారి ఈ పనిని ఫేస్ బుక్ సరిగా చేయకపోయినా సరే మీకు తెలియని వ్యక్తుల నుండి వచ్చే పోస్ట్ ల తో మీ న్యూస్ ఫీడ్ నిండిపోయి కనిపిస్తుంది. ఇది మీకు కానీ ఫేస్ బుక్ కు కానీ అంత మంచిది కాదు. అయితే ఇలాంటి అవాంచిత, అపరిచిత పోస్ట్ లను మీ న్యూస్ ఫీడ్ నుండి తొలగించుకోవడానికి ఫేస్ బుక్ కొన్ని టూల్ లను డెవలప్ చేసింది. మీ న్యూస్ ఫీడ్ ను అతి సులువుగా ఎలా క్లీన్ చేసుకోవచ్చో దానికి ఉన్న మార్గాల గురించి ఈ ఆర్టికల్ లో చర్చిద్దాం.
మీ న్యూస్ ఫీడ్ లో ఉన్న వారిని ప్రాధాన్యతా క్రమంలో అన్ ఫాలో చేయండి.
మొదటగా వచ్చే ఆప్షన్ ఎమిఒతన్తె ఫేస్ బుక్ యొక్క న్యూస్ ఫీడ్ ప్రిఫరెన్స్ ఆప్షన్. మీ న్యూస్ ఫీడ్ లో ఎవరిని లేదా ఏ పేజి లను మొదటగా చూపించాలి, కొంతకాలం నుండీ ఎవరి పోస్ట్ లనైనా చూడకుంటే వారిని అన్ ఫాలో చేయడం ఎలా అనే వాటిని డిసైడ్ చేసే టోల్ ఇది. ఈ టూల్ వెబ్ సైట్ లోనూ, ఐఒఎస్ లోనూ, ఆండ్రాయిడ్ లోనూ ఒకేరకంగా ఉంటుంది.
అంతే ఇక మీ న్యూస్ ఫీడ్ లో అనవసరమైన పోస్ట్ లు ఏవీ కనబడవు. ఈ విధంగా మీ ఫేస్ బుక్ యొక్క న్యూస్ ఫీడ్ ను క్లీన్ చేసుకోవచ్చు.