ఫేస్‌బుక్ ముందు కూర్చుంటే కాలమే తెలియదు. గంటలు గంటలు ఇట్టే గడిచిపోతాయి. ఒక పోస్టు తర్వాత మరో పోస్టు... ఇలా బ్రౌజింగ్ సాగుతూనే ఉంటుంది. ఐతే అది ఒకప్పటి మాట. ఇప్పుడు ఫేస్‌బుక్ వాడకం బాగా తగ్గిందట. గతంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ సమయం ఈ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌కు కేటాయించట్లేదట. ఇటీవల ఒక సర్వే ప్రకారం రోజుకు సగటున ఒక ఫేస్‌బుక్ వినియోగదారుడు 50 నిమిషాల సమయాన్నే గడుపుతున్నాడట. ఇప్పుడు ఈ సమాయాన్ని మరింత పెంచడానికి ఫేస్‌బుక్ రకరకాల వ్యూహాలు రచిస్తోంది. ఫేస్‌బుక్ ఫస్ట్ క్వార్టర్ ఆదాయం 1.5 బిలియన్ డాలర్లుగా ఉంటే.. ఫేస్‌బుక్‌ను వినియోగిస్తున్న వారి సంఖ్య 1.65 బిలియన్లుగా ఉంది. కానీ ఈ వినియోగదారుల సంఖ్య తమకు చాలా తక్కువని ఎఫ్‌బీ భావిస్తోంది. ఈ సంఖ్యను ఇంకా పెంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. వాట్సప్‌తో పోలిస్తే ఫేస్‌బుక్, మెసెంజర్ యాప్, ఇన్‌స్టాగ్రామ్‌లను వినియోగిస్తున్న వారి సంఖ్య తక్కువేనట. ఒక మనిషి రోజులో ఎనిమిది గంటలు నిద్రకు, 2.8 గంటలు టీవీ, సినిమాలకు, 19 నిమిషాలు పుస్తకాలు చదవడానికి, క్రీడలు, వ్యాయామానికి 17 నిమిషాలు, సోషల్ ఈవెంట్స్‌కు 4 నిమిషాలు, తినడానికి, తాగడానికి 1.07 నిమిషాలు కేటాయిస్తున్నట్లు ఒక సర్వేలో తేలింది. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌పై వినియోగదారులు మరింత గడిపేలా ఆ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ఐతే ఆన్‌లైన్‌లో వినియోగదారులు ఎక్కువ సమయం కేటాయిస్తున్న సైట్లలో ఫేస్‌బుక్ తర్వా స్థానం యూట్యూబ్‌దే. ఈ సైట్లో ఆల్ఫాబెట్లను చూడటానికి 17 నిమిషాలు రోజులకు సమయాన్ని వెచ్చిస్తున్నారట. యాహూలో తొమ్మిది నిమిషాలు, లింక్డ్ ఇన్‌లో రెండు నిమిషాలు, ట్విటర్‌లో కొ నిమిషం సమయాన్ని కేటాయిస్తున్నారట. ఐతే వీరిలో ఎక్కువమంది సరదాగా సైట్లు చూస్తున్నవాళ్లే. ఇలాంటి వారి వల్ల ఆదాయం కూడా ఎక్కువగా ఉండట్లేదని ఎఫ్‌బీ తెలిపింది. ఈ నేపథ్యంలో మరింత ఎక్కువమంది వినియోగదారులను ఆకర్షించడానికి ఎఫ్‌బీ.. న్యూస్‌ఫీడ్, ఉద్యోగ సమాచారం, విద్యార్థులకు ఉపయోగపడే సమాచారం, ఆసక్తికర వీడియోలు ఎఫ్‌బీలో ఉండేటట్లు ప్రయత్నిస్తోందట. తమకు ఉపయోగపడే విషయాలు ఉంచినప్పుడే ఎక్కువమంది వినియోగదారులు ఎఫ్‌బీపై ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారట. |