• తాజా వార్తలు

వాట్సప్ ఫింగర్ ప్రింట్ ప్రొటెక్షన్ ఎందుకు ప్రారంభించడం లేదంటే...?

ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాం మీద అత్యంత జనాదరణ పొందిన ఛాట్ మెసెంజర్ ఏది? సమాధానం "వాట్సప్" అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాట్సప్‍లో చాటింగ్ చేసిన సమాచారం రహస్యం కాదు. కాస్త టెక్నాలజీ తెలిసి హాకింగ్ చేయగలిగిన వాళ్లు ఆ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ సమస్యను అధిగమించేందుకు వాట్సప్ ఈ మధ్యనే "ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్" ప్రవేశపెట్టింది. దీనివల్ల మెసేజి పంపినవారు అందుకున్నవారు తప్ప మిగిలినవారికి అది అర్థం కాదు. అంటే  ఇద్దరూ ఏం చాట్ చేసుకున్నారో వాట్సప్ యాజమాన్యం కూడా   తెలుసుకోలేదు, ప్రభుత్వం వారు అడిగినా ఇవ్వలేదు. ఇది కొంతవరకూ బాగానే ఉంది కానీ మన ఫోన్ ఎవరి చేతుల్లో అయినా పడితే అందులోని మెసేజిలన్నీ వాళ్లు చూసేసుకోవచ్చు. ఎందుకంటే వాట్సప్‍కు పాస్ వర్డ్ పెట్టుకొనే అవకాశం ఇవ్వలేదు. ఆండ్రాయిడ్‌లో నాచురల్‍గా ఇచ్చిన ప్రొటెక్షన్ ఒకటే దీనికి రక్షణ.

ఈ ప్రైవసీ సమస్యను ఎదుర్కొనేందుకు హైఎండ్ ఫోన్లన్నీ తాజా ఫింగర్ ప్రింట్ ప్రొటెక్షన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఆయా ఫోనుల్లో హార్డ్‌వేర్‍తో లింకయిన ఆప్షన్. హార్డ్‌వేర్‍తో సంబంధం లేకుండా ఫింగర్ ప్రింట్ ప్రొటెక్షన్ పొందే అవకాశం లేటెస్ట్ ఆండ్రాయిడ్ వర్షన్ అయిన మార్ష్‌మల్లో (ఆండ్రాయిడ్ ఎం)లో మాత్రమే ఉంది. అయితే ప్రస్తుతానికి ఈ ఆండ్రాయిడ్ ఎం అందుబాటులో ఉన్న వినియోగదారుల సంఖ్య చాలా తక్కువగా అంటే కేవలం7.5%మాత్రమే ఉంది.  ఎక్కువమంది మొబైల్ తయారుదారులతో ఒప్పందాలు కుదుర్చుకొని ఆండ్రాయిడ్ ఎం ఎక్కువమంది వినియోగదారులకు చేర్చాలని గూగుల్ ప్రయత్నిస్తోంది. ఈ లోగా తమ యాప్‌ను మరింత ఆమోదయోగ్యంగా మార్చేందుకు దానికి లాకర్ ఆప్షన్ జతచేయాలని వాట్సప్ ఆలోచిస్తోంది.  మరింత ప్రైవసీ కల వాట్సప్ కోసం ఎదురుచూద్దామా?

 

జన రంజకమైన వార్తలు