• తాజా వార్తలు

ఫేస్ బుక్ యాప్ ని మర్చిపోండి మొబైల్ సైట్ ని ఇలా వాడి తలనొప్పి తగ్గించుకోండి

 

నేటి సోషల్ మీడియా ప్రపంచం లో ఫేస్ బుక్ ను వాడే వారి సంఖ్య తక్కువేమీకాదు. అయితే pc ల ద్వారా ఫేస్ బుక్ ను ఉపయోగించేవారి కంటే కూడా స్మార్ట్ ఫోన్ ల ద్వారా దీనిని ఉపయోగించే వారి సంఖ్యే ఎక్కువ. వీరిలో కూడా దాదాపు 99 శాతం మంది తమ స్మార్ట్ ఫోన్ లలోని యాప్ ల ద్వారానే ఫేస్ బుక్ ను ఉపయోగిస్తున్నారు. ఫేస్ బుక్ ఆండ్రాయిడ్ మరియు ఐ ఫోన్ యూజర్ లకోసం రెండు ప్రత్యెక యాప్ లు రూపొందించింది. మీరు కూడా ఈ యాప్ లనే వాడుతున్నారా? అయితే వెంటనే ఆ యాప్ లను అన్ ఇన్స్టాల్ చేసేయండి. ఎందుకంటే ఈ రెండు యాప్ లూ ఏమంత గొప్పవి కాకపోగా, మీ ఫోన్ యొక్క బాటరీ పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఐ ఫోన్  యొక్క ఫేస్ బుక్ యాప్ మీ ఫోన్ బాటరీ ని పూర్తిగా డ్రెయిన్ చేసేస్తుంది. ఇక ఆండ్రాయిడ్ విషయానికొస్తే దీని ఫేస్ బుక్ యాప్ మొత్తం బాటరీ లో 20 % ని ఉపయోగించుకుంటుంది. కాబట్టి మీ ఫోన్ యొక్క పనితీరు పై ఇలాంటి దుష్ప్రభావాలను చూపించే ఈ యాప్ లను వాడడం ఆపి వేసి వెంటనే సైట్ లో ఫేస్ బుక్ ను వాడడం మొదలు పెట్టండి. ఇంతకూ ముందు ఈ ప్రక్రియ కొంచెం క్లిష్టత తో కూడుకున్నది గా ఉండేది కానీ ప్రస్తుతం ఇది చాలా సులభతరం అయింది. మీ ఫోన్ లో ఫేస్ బుక్ యాప్ ను డిలీట్ చేసేసి సైట్ లో ఓపెన్ చేయడం ఎలా అనే అంశంపై విశ్లేషణ ను ఈ వ్యాసం లో చర్చిద్దాం,

 

ఐ ఫోన్ లో ఫేస్ బుక్ యొక్క మొబైల్ సైట్ ను యాడ్ చేయడం ఎలా?

మొదటగా మీ ఐ ఫోన్ లో ఉన్న ఫేస్ బుక్ యాప్ అన్ ఇన్స్టాల్ చేయాలి. మీ ఫోన్ లో ని ఫేస్ బుక్ యాప్ పై లాంగ్ ప్రెస్ చేసి x ను ట్యాప్ చేయడం ద్వారా దీనిని అన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ తర్వాత సఫారీ వెబ్ వ్రౌజర్ ను ఓపెన్ చేసి facebook.com ను ఓపెన్ చేయాలి. అక్కడ మీ ఫేస్ బుక్ ఎకౌంటు తో సైన్ ఇన్ అవ్వాలి. అక్కడ స్క్రీన్ యొక్క క్రింద భాగం లో ఉండే షేర్ బటన్ ను ట్యాప్ చేయాలి. ఇది చతురస్రాకారం లో ఉండే ఒక ఐకాన్. బాణం గుర్తు పై వైపు ఉంటుంది. అక్కడ మీకు కనిపించే యాడ్ టు హోమ్ స్క్రీన్ అనే ఐకాన్ పై క్లిక్ చేయడం ద్వారా ఫేస్ బుక్ ను మీ హోం స్క్రీన్ నుండి లాగ్ ఇన్ చేయవచ్చు.

ఇప్పుడు ఫేస్ బుక్ మీ హోం స్క్రీన్ లో తన స్వంత ఐకాన్ ను కలిగిఉంటుంది. మీరు ఒక్కసారి దానిని ట్యాప్ చేస్తే చాలు డైరెక్ట్ గా ఫేస్ బుక్ ను యాక్సెస్ చేయవచ్చు. ఇది ఇన్ స్టాల్ చేయబడిన యాప్ కాదు కాబట్టి బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవ్వదు, కాబట్టి మీ బాటరీ డ్రెయిన్ అయ్యే అవకాశం లేదు.మీరు ఫేస్ బుక్ ఐకాన్ ను రీ అరేంజ్ చేసుకోవచ్చు.దానిని లాంగ్ ప్రెస్ చేసి దానిని డ్రాగ్ చేయడం ద్వారా వేరే స్క్రీన్ కు కూడా మార్చుకోవచ్చు. మీరు దీనిని యాప్ ఫోల్డర్ లో కూడా ఉంచవచ్చు.

కాకపోతే ఇది మొబైల్ నోటిఫికేషన్ లను చూపించదు. మీకు ఫేస్ బుక్ యొక్క మొబైల్ నోటిఫికేషన్ లు కావాలి అనుకుంటే మీ ఫేస్ బుక్ సెట్టింగ్స్ లో ఉండే ఈ మెయిల్ నోటిఫికేషన్ లను ఎనేబుల్ చేయడం ద్వారా మీ ఫేస్ బుక్ ఎకౌంటు కు వచ్చే నోటిఫికేషన్ లన్నీ మీ ఈమెయిల్ కు పొందవచ్చు. తద్వారా మీ ఫోన్ లో ఉండే మెయిల్ ఐకాన్ మీ ఫేస్ బుక్ నోటిఫికేషన్ లను చూపిస్తుంది.

 

ఆండ్రాయిడ్  లో మొబైల్ సైట్ ను యాడ్ చేయడం ఎలా?

ఇక్కడ కూడా ముందుగా మీరు మీ మొబైల్ లో ఉండే ఫేస్ బుక్ యాప్ ను అన్ ఇంస్టాల్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. ఈ ఫేస్ బుక్ యాప్ అనేది ఒక్కో ఫోన్ లో ఒక్కో రకంగా ఉంటుంది. అది స్మార్ట్ ఫోన్ తయారీదారుని బట్టి ఉంటుంది. ఒక్కో ఫోన్ లో లాంగ్ ప్రెస్ చేసి అన్ ఇంస్టాల్ అనే బటన్ పై ట్యాప్ చేయడం ద్వారా  అన్ ఇంస్టాల్ చేయాలి. ఒక్కో దానిలో లాంగ్ ప్రెస్ x పై ట్యాప్ చేయాలి. మరికొన్నింటిలో అయితే సెట్టింగ్స్ లోనికి వెళ్లి అక్కడ యాప్ లను ఓపెన్ చేసి అక్కడ అన్ ఇన్ స్టాల్ చేయాలి. కాబట్టి మీ ఫోన్ ఏ రకమో ఒక్కసారి చూసుకోండి.

ఒక్కోసారి మీ ఫోన్ లో అన్ ఇన్ స్టాల్ బటన్ ఉండదు. అంటే మీ ఫోన్ యొక్క తయారీదారుడు ఫేస్ బుక్ యాప్ ను ఇన్ బిల్ట్ గా ఇచ్చి ఉంటాడు. అలాంటి సందర్భాలలో డిజేబుల్ బటన్ ట్యాప్ చేయడం ద్వారా ఆ యాప్ ను పనిచేయకుండా చేయవచ్చు.

ఇప్పుడు దానిని ఫేస్ బుక్ యొక్క మొబైల్ సైట్ తో రీ ప్లేస్ చేయాలి. మీ ఫోన్ లో ఉండే ఏదో ఒక బ్రౌజర్ ద్వారా facebook.com ను ఓపెన్ చేయాలి. ఉదాహరణకు గూగుల్ క్రోమ్ ద్వారా మీరు ఈ సైట్ ను ఓపెన్ చేశారనుకుందాం.అక్కడ మీ అకౌంట్ ద్వారా ఫేస్ బుక్ లోనికి లాగ్ ఇన్ అవ్వాలి. మీరు మొదటిసారిగా ఈ వెబ్ సైట్ ను విజిట్ చేస్తున్నట్లయితే కొన్ని నోటిఫికేషన్ లను పంపుతున్నట్లుగా ఇది మిమ్మల్ని అడుగుతుంది. allow పై ట్యాప్ చేయడం ద్వారా మీ  ఫేస్ బుక్ నోటిఫికేషన్ లను క్రోమ్ ద్వారా మీరు చూడవచ్చు. ఒకవేళ మీకు నోటిఫికేషన్ లు ఇష్టం లేకపోతే బ్లాక్ చేసుకోవచ్చు.

ఇపుడు మీరు ఈ సైట్ ఐకాన్ ను మీ హోం స్క్రీన్ కు యాడ్ చేయాలి.  మెనూ బటన్ పై ట్యాప్ చేస్తే add to home screen అనే ఆప్షన్  వస్తుంది, దానిపై  ట్యాప్ చేయడం ద్వారా మీ ఫేస్ బుక్ సైట్ ను మీ హోం స్క్రీన్ కు యాడ్ చేసుకోవచ్చు. మీ హోం స్క్రీన్ పై ఉండే మిగతా షార్ట్ కట్ ఐకాన్ ల మాదిరిగానే ఫేస్ బుక్ సైట్ ఐకాన్ కూడా మీ స్క్రీన్ పై కనిపిస్తుంది. ఒక్క ట్యాప్ ద్వారా మేరు మీ ఫేస్ బుక్ ఎకౌంటు కు లాగ్ ఇన్ అవ్వవచ్చు. మీరు యాప్ ను ఉపయోగించడం లేదు కాబట్టి మీ బాటరీ డ్రెయిన్ అయ్యే అవకాశం లేదు. మీరు ఆ ఐకాన్ పై డ్రాగ్ చేసి స్క్రీన్ పై ఎక్కడ కావాలంటే అక్కడ ఉంచవచ్చు.

ఆండ్రాయిడ్ లో మరింత సౌకర్యవంతమైన అనుభూతి కోసం  “ మెటల్ ”  ను ఉపయోగించండి.

ఈ మొబైల్ ఫేస్ బుక్ సైట్ లో మరిన్ని ఫీచర్ లు ఉంటె బాగుండు అనుకుంటున్నారా ? అయితే మెటల్ ను ఉపయోగించండి.  ఇది ఒక మొబైల్ యాప్. ఇది మొబైల్ సైట్ ను దాని స్వంత షెల్ లో లోడ్ చేసుకుంటుంది. ఫేస్ బుక్ మొబైల్ యాప్ లో ఉండే ఫీచర్ లకు ఎక్స్టెండెడ్ ఫీచర్ లను ఇది అందిస్తుంది. మీరు ఫేస్ బుక్ యొక్క మొబైల్ సైట్ ను ఉపయోగిస్తున్నట్లయితే మెటల్ ను కూడా అలాగే ఉపయోగించవచ్చు. మీ సైట్ మెటల్ లో ఉంటుంది. మీ ఫేస్ బుక్ కు వచ్చే నోటిఫికేషన్ లన్నీ మెటల్ ద్వారా మీకు అందుతాయి. ఇది ఫేస్ బుక్ కు సైడ్ మెనూ ను యాడ్ చేస్తుంది. దీనివలన ఫేస్ బుక్ లో ఉండే వివిధ రకాల ఫీచర్ లను ఒక్క ట్యాప్ ద్వారా చేరుకోవచ్చు. ఇది మాత్రమే గాక మరెన్నో ఫీచర్ లను ఏ మెటల్ ఫేస్ బుక్ సైట్ కు అందిస్తుంది. కాబట్టి మీరు ఆండ్రాయిడ్ వినియోగదారులైతే వెంటనే మీ ఫేస్ బుక్ సైట్ ను మెటల్ ద్వారా ఓపెన్ చేయండి.

చూశారుగా యాప్ ల ద్వారా ఫేస్ బుక్ ను ఓపెన్ చేసి మీ బాటరీ ని పాడు చేసుకునే బదులు వెంటనే వాటిని అన్ ఇన్ స్టాల్ చేసి ఫేస్ బుక్ యొక్క మొబైల్ సైట్ లను మీ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోండి.సౌకర్యవంతమైన ఫేస్ బుక్ అనుభూతిని పొందండి. 

 

జన రంజకమైన వార్తలు