• తాజా వార్తలు

ఇకపై గూగుల్ మ్యాప్ ద్వారా రైలు ఎక్కడుందో తెలుసుకోవచ్చు 

ప్రముఖ సెర్చింజన్ గూగుల్ తన లేటెస్ట్ అప్‌డేట్స్‌లో భాగంగా గూగుల్ మ్యాప్స్ లో మూడు కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది, ఇందులో ప్రధానంగా రైల్వే లైవ్ స్టేటస్ అనే ఫీచర్ సరికొత్తగా ఉంది. ఈ ఫీచర్ తో పాటు బస్సు, ఆటో లైవ్ స్టేటస్ ను కూడా కొత్త ఫీచర్లలో జత చేశారు. తద్వారా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ కు సంబంధించిన సేవల్లోలకి గూగుల్ మ్యాప్స్ పూర్తి స్థాయిలో ప్రవేశించినట్లయ్యింది. ముఖ్యంగా ఈ ఫీచర్ ద్వారా ప్రధాన నగరాలైన ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్, పునే, లక్నో, హైదరాబాద్, చెన్నై, మైసూర్, కోయంబత్తూరు, సూరత్ వంటి నగరాల్లో గమ్యస్థానం చేరుకునేందుకు కచ్చితంగా ఎంత సమయం పడుతుందో ఈ ఫీచర్ల ద్వారా సదుపాయం కలిగింది. 

అలాగే వివిధ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసుల్లో ఈ గూగుల్ మ్యాప్స్ ద్వారా సమయాభావం లేకుండా ప్రయాణించే వీలుంది. అలాగే రైళ్ల రాకపోకలు, ఎంత సమయం ఆలస్యమవుతుంది. ఏ ప్లాట్ ఫామ్ మీదకు రైలు వస్తుంది, తరువాతి స్టేషన్ ఏంటి అనే ఫీచర్లను సైతం ఈ గూగుల్ కొత్త ఫీచర్ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్లను ఆండ్రాయిడ్ వీ10.17.2 బీటా వెర్షన్ ద్వారా తెలుసుకునే వీలుంది.గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా ట్రెయిన్‌ రన్నింగ్‌ స్టేటస్‌ను గురించి తెలుసుకోవచ్చు. అలాగే వివిధ ప్రాంతాల మధ్య తిరిగే రైళ్ల లిస్టు వివరాలు పొందవచ్చు. గతేడాది కొనుగోలు చేసిన వేర్‌ ఈజ్‌ మై ట్రెయిన్‌ యాప్‌ సంస్థతో కలిసి ఈ ఫీచర్‌ను అభివృద్ధి చేసినట్లు గూగుల్‌ పేర్కొంది.

గూగుల్‌ మ్యాప్స్‌ యూజర్లు ఇకపై బస్సు ప్రయాణాలకు పట్టే సమయం, ప్లాట్‌ఫాంపై రైళ్ల రాక గురించిన వివరాలను లైవ్‌లో తెలుసుకోవచ్చు. హైదరాబాద్‌ సహా దేశంలోని 10 పెద్ద నగరాల్లో ఈ సర్వీసులు అందుబాటులోకి తెచ్చినట్లు గూగుల్‌ తెలిపింది. ఆటో, ప్రజా రవాణా వాహనాలకు సంబంధించిన సమాచారం కూడా ఇచ్చే ఫీచర్‌ను మ్యాప్స్‌లో పొందుపర్చినట్లు వివరించింది. లైవ్‌ ట్రాఫిక్‌ వివరాలు అందించడం ద్వారా తమ యూజర్లకు ప్రయాణాలను మరింత సులభతరం చేయనున్నట్లు గూగుల్‌ పేర్కొంది. 

జన రంజకమైన వార్తలు