ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఏ స్మార్ట్‌ఫోన్ వాడేవారికైనా గూగుల్ ఫోటోస్ తప్పక తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఇది మీ ఫోన్‌లో తీసే ఫోటోలన్నీ భద్రపరిచే ఫోటో లైబ్రరీ కాబట్టి. అలాంటి గూగుల్ ఫోటోస్ యాప్ ఇప్పుడు రీడిజైన్ చేశారు. దీనిలో కొత్త ఫీచర్లేమిటో చూద్దాం.
సింపుల్ డిజైన్
గూగుల్ ఫోటోస్ కొత్త యాప్‌లో డిజైన్‌ను చాలా సింపుల్‌గా తీర్చిదిద్దింది. మూడు ట్యాబ్‌లతో ఇంటర్‌ఫేస్ ఉంటుంది. ఫోటోస్, సెర్చ్, లైబ్రరీ పేజెస్ అనే మూడు ట్యాబ్‌లు ఉంటాయి. ఈ కొత్త యాప్‌లో మీ ఫోటోస్ ఇంతకు ముందు కంటే కాస్త పెద్దగా కనిపిస్తాయి. థంబ్‌నైల్స్ కూడా పెద్దగా ఉంటాయి. వీడియోలు ఆటో ప్లే అవుతాయి. సెర్చ్ ఆప్షన్‌ను కూడా అప్‌డేట్ చేసింది.
మెమరీస్
గత సంవత్సరం గూగుల్ తన ఫోటోస్ యాప్‌లో మెమరీస్ ఫీచర్‌ను యాడ్ చేసింది. అంటే గత నెల లేదా గత సంవత్సరం మీ ఫోటోలను మీకు గుర్తు చేస్తుంది. ఇప్పడు ఈ మెమరీస్ ఫీచర్‌ను గూగుల్ మరింత డెవలప్ చేసింది. ఇయర్, రెండేళ్లు, మూడేళ్లు, నాలుగేళ్లు ఇలా ప్రతి సంవత్సరంలో మీ బెస్ట్ పిక్చర్స్, మీ క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫోటోస్, మీ ట్రిప్స్ ఇలాంటివన్నీ మీకు నోటిఫికేషన్స్ ఇస్తుంది. అంతేకాదు మీ ఫోటోలతో మూవీస్, కాలేజస్, యానిమేషన్స్ కూడా దానికదే తయారుచేసి మీకు చూపిస్తుంది.
మ్యాప్ వ్యూ
ఇక చివరి ఫీచర్ మ్యాప్ వ్యూ. ఇది మిగిలిన ఫోటో లైబ్రరీల్లో చాలాకాలం నుంచే ఉంది. గూగుల్ ఫోటోస్‌లో కాస్త లేట్‌గా వచ్చింది. మీ ఫోటోస్‌కు పక్కన ఉన్న మ్యాప్‌ను వేళ్లతో మూవ్ చేస్తే ఆ ఫోటో ఎక్కడ తీశారు? లొకేషన్ హిస్టరీ, డేట్, టైమ్ అన్నీ చూపిస్తుంది.
లైబ్రరీ ట్యాబ్
గూగుల్ ఫోటోస్‌లో లైబ్రరీ ట్యాబ్‌ను కూడా యాడ్ చేసింది. దీనిలో మీ ఆల్బమ్స్, ఫేవరెట్స్, ఆర్కైవ్స్, ట్రాష్ అన్నీ ఒకేచోట కనిపిస్తాయి.
ఎప్పుడు వస్తుంది?
గూగుల్ ఫోటోస్ రీడిజైన్ యాప్ వచ్చేవారంలోనే ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లకు అందుబాటులోకి వస్తుందని గూగుల్ ప్రకటించింది.