డేటా... డేటా.. డేటా.. రోజురోజుకీ అప్ డేట్ అవుతున్న స్మార్ట్ ఫోన్ లు మరియు వాటిలో ఉంటున్న అప్లికేషను లు డేటా ను విపరీతంగా తినేస్తున్నాయి. అవును ఇది నిజం. 3 జి ఉన్నపుడు ఈ పోకడ అంతగా లేకపోయినా 4 జి రంగ ప్రవేశం చేశాక దానితో సమాంతరంగా స్మార్ట్ ఫోన్ లలో ఉండే ఫీచర్ లు మరియు సరికొత్త యాప్ లు రంగ ప్రవేశం చేయడం తో ఇవన్నీ కలిసి మొబైల్ డేటా ఎక్కువగా ఖర్చు చేస్తున్నాయి 1 GB డేటా మీకు ఇంతకుముందు ఒక నెలరోజుల పాటు వస్తే ప్రస్తుతం అది ఒక రోజైనా వస్తుందో లేదో చెప్పడం కష్టం. వాస్తవానికి ఇది మన వినియోగంపై ఆధారపడి ఉన్నప్పటికీ మనం పైన చెప్పుకున్నవి కూడా దీనిపై తమ ప్రభావాన్ని చూపిస్తాయి. వీటితో పాటు వీడియో మరియు మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ లు వచ్చాక మొబైల్ డేటా మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అయిపోతుంది.
ఉదాహరణకు నెట్ ఫ్లిక్స్ లో కానీ యూ ట్యూబ్ లో కానీ ఏదైనా స్టాండర్డ్ డెఫినిషన్ స్ట్రీమింగ్ వీడియో ను ఒక గంటపాటు చూసారు అనుకోండి, 1 GB డేటా చాలా సులభంగా పూర్తి అయిపోతుంది. అదే HD వీడియో అయితే డేటా వినియోగం దీనికి రెండు మూడు రెట్లు ఉండవచ్చు. అలాగే గూగుల్ ప్లే లో కానీ ప్లే మ్యూజిక్ లో కానీ ఒక గంట పాటు మ్యూజిక్ వింటే 120 MB డేటా ఖర్చు అవుతుంది. చూడడానికి ఇది తక్కువగానే అనిపించవచ్చు.కానీ నేలమొత్తంమీద చూసుకుంటే కేవలం మ్యూజిక్ కే 3.2 GB దాదాపుగా ఖర్చు అవుతుంది. ఇక మిగిలిన బ్రౌసింగ్ కు ఏమి వాడతారు. ఇలాంటి సందర్భాలలో మీ నెలవారీ ప్లాన్ లు కాకుండా మరింత ఎక్కువ ప్లాన్ లకు మీరు మారవలసి ఉంటుంది. అది కొంచెం ఖర్చు తో కూడుకున్నదే కదా! కాబట్టి మీ డేటా ను సరిగ్గా మానిటర్ చేసుకుంటే ఎక్కువ డేటా వినియోగం నుండి తప్పించుకోవచ్చు. అదెలాగో ఈ ఆర్టికల్ లో చూద్దాం.
మీ డేటా యూసేజ్ ను చెక్ చేసుకోవడం ఎలా?
మీరు ఎంత డేటా ను ఉపయోగించిందీ చెక్ చేసుకోవడానికి అనేకరకాల ఆప్షన్ లు ఉన్నాయి. మొదటిది మీ నెట్ వర్క్ ఆపరేటర్ ద్వారా తెలుసుకోవడం. ఇది కాక మీ నెలవారీ మరియు రోజు వారీ డేటా తో పాటు మీ డేటా స్పీడ్ ను కూడా తెలుసుకోవడానికి అనేకరకాల యాప్ లు కూడా అందుబాటులో ఉన్నాయి. స్ప్రింట్, AT&T మరియు వేరిజోన్ కాలిక్యులేటర్ లాంటి వాటి ద్వారా మీ డేటా యూసేజ్ ను చెక్ చేసుకోవచ్చు. మీ నెట్ వర్క్ యొక్క వెబ్ పోర్టల్ లోనికి లాగిన్ అయ్యి తెలుసుకోవడం మరొక సులభమైన పద్దతి. మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో నుండి ఈ నెల మీ డేటా వినియోగాన్ని తెలుసుకోవాలి అంటే సెట్టింగ్స్> వైర్ లెస్ &నెట్ వర్క్స్ >డేటా యూసేజ్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మీ సెల్యూలర్ డేటా యూసేజ్ తో పాటు వైఫై ద్వారా ఏదైనా డేటా ఉపయోగిస్తే అదికూడా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా చాలావరకూ మీకు డేటా వార్నింగ్ లను కూడా ఇస్తాయి.
బ్యాక్ గ్రౌండ్ యాప్ లు
వీటి గురించి ఇంతకుముందు మనం అనేక ఆర్టికల్ లలో చదువుకుని ఉన్నాము. ఈ బ్యాక్ గ్రౌండ్ యాప్ ల వలన కేవలం బ్యాటరీ కి మాత్రమే కాక డేటా కు కూడా నష్టం వాటిల్లుతుంది.కొన్ని కొన్ని యాప్ లు మనం క్లోజ్ చేసినా సరే బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవుతూ విపరీతంగా బ్యాటరీ ని మరియు డేటా ను తినేస్తూ ఉంటాయి. వీటిలో ఫేస్ బుక్ ముందు ఉంటుంది. అంతేగాక కొన్ని యాప్ లు ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ ఉంటాయి. ఇవి బ్యాక్ గ్రౌండ్ లో ఉన్నపుడు మీ ప్రమేయం లేకుండానే అవి అప్ డేట్ అవుతూ డేటా ను తినేస్తూ ఉంటాయి. ఇలా ఏ ఏ యాప్ లు డేటా వినియోగానికి ఎక్కువ కారణం అవుతున్నాయో తెలుసుకోవడం కూడా చాలా సులభం. కానీ మనలో ఎవరూ దానిగురించి పట్టించుకోరు. ఇంతకుముందు చెప్పినట్లు సెట్టింగ్స్> వైర్ లెస్ &నెట్ వర్క్స్ >డేటా యూసేజ్ ద్వారా ఏ ఏ యాప్ లు ఎంత డేటా ను వినియోగిస్తున్నాయి అనేది చాలా స్పష్టం గా తెలుసుకోవచ్చు. తద్వారా మనకు అవసరం లేని డేటా హంగ్రీ యాప్ లను తీసివేయడం ద్వారా మీ డేటా తో పాటు బ్యాటరీ ని కూడా కాపాడుకోవచ్చు.
ఆండ్రాయిడ్ నౌగట్ యొక్క డేటా సేవర్ ను ఉపయోగించండి.
ఈ అవాంచిత డేటా వినియోగాన్ని తగ్గించడానికి ఆండ్రాయిడ్ నౌగట్ ఒక సరికొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టింది. అదే డేటా సేవర్. ఇది బ్యాక్ గ్రౌండ్ యాప్ లను పరిమితం చేస్తుంది. అంటే ప్రతీ యాప్ కూ బ్యాక్ గ్రౌండ్ డేటా ని డిఫాల్ట్ గా డిజేబుల్ చేస్తుంది, మీకు కావాలి అనుకుంటే ఎనేబుల్ చేయవచ్చు కానీ ఇది మాత్రం ఆటోమాటిక్ గా అపివేస్తుంది.
మీకు ఆండ్రాయిడ్ నౌగట్ లేదా?
మీ ఫోన్ లో ఉండే ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ నౌగట్ కాదా? ఏం పర్వాలేదు మీకు మరికొన్ని ఆప్షన్ లు ఉన్నాయి. హోం స్క్రీన్ కు వెళ్లి ఎక్కువ డేటా ను ఉపయోగిస్తున్న యాప్ లపై క్లిక్ చేస్తే దానికి సంబంధించి కొన్ని సెట్టింగ్ లు కనిపిస్తాయి. ఆ సెట్టింగ్ లలో డేటా వినియోగాన్ని నిరోధించడానికి ఏమైనా సెట్టింగ్ లు ఉన్నాయో చెక్ చేసుకుని వాటిని ఎనేబుల్ చేసుకోవాలి. చాలా యాప్ లు ఈ రకమైన సెట్టింగ్ లను కలిగిఉంటాయి, కానీ ఎవరూ వాటిని పట్టించుకోరు. ఉదాహరణకు ఆండ్రాయిడ్ లో మీరు ఫేస్ బుక్ యాప్ లోనిక్ వెళ్లి దాని సెట్టింగ్ లలో ఫ్రీక్వెన్సీ ని తగ్గించుకోవచ్చు. ఇది కేవలం డేటా కు మాత్రమే గాక మీ బ్యాటరీ లైఫ్ కు కూడా మంచి ఉపయోగకరంగా ఉంటుంది.
మరొక ఆప్షన్ కూడా ఉంది. ఇది కూడా ఇంతకుముందు చెప్పిందే. సెట్టింగ్స్> వైర్ లెస్ &నెట్ వర్క్ > డేటా యూసేజ్ కు వెళ్లి అక్కడ యాప్ పై ట్యాప్ చేస్తే అక్కడ రిస్త్రిక్ట్ బ్యాక్ గ్రౌండ్ డేటా అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే చాలు.
బ్యాక్ గ్రౌండ్ డేటా ను టర్న్ ఆఫ్ చేయడం, బ్యాక్ గ్రౌండ్ యాప్ అప్ డేట్ లను టర్న్ ఆఫ్ చేయడం, యాడ్ లను రిమూవ్ చేయడానికి మీకు ఇష్టమైన యాప్ లను ఖరీదు చేయడం, క్రోమ్ యొక్క డేటా సేవర్ ను ఉపయోగించడం , గూగుల్ మ్యాప్స్ డేటా ను కాచే చేయడం, స్ట్రీమింగ్ యాప్ లను ఆఫ్ లైన్ మోడ్ లో ఉపయోగించడం లాంటివి మరికొన్ని ఆప్షన్ లు. వీటిద్వారా మీ డేటా వినియోగాన్ని విజయవంతంగా మానిటర్ చేసుకోవచ్చు.
"