ఫేస్ బుక్. ఇది పరిచయం అక్కరలేని పేరు. సోషల్ మీడియా సైట్ లలో ప్రముఖమైనది ఫేస్ బుక్. ఇంటర్ నెట్ వాడేవారిలో ఫేస్ బుక్ ను ఉపయోగించని వారు ఉండడం దాదాపు అసాద్యం. మీ చిన్ననాటి స్నేహితుల గురించి తెల్సుకోవడానికి మరియు వారితో చాట్ చేయడానికీ, నిరంతరం టచ్ లో ఉండడానికీ ఈ ఫేస్ బుక్ ఒక చక్కటి ఫ్లాట్ ఫాం లాగా ఉపయోగపడుతుంది. కేవలం ఇది మాత్రమే కాదు, కొత్త కొత్త స్నేహితులను ఏర్పరచుకోవడానికి, ప్రస్తుతం ఉన్న స్నేహితులతో సంభాషించుకోవడానికి కూడా ఈ ఫేస్ బుక్ ఉపయోగపడుతుంది. కేవలం సంభాషణ మాత్రమే కాదు, ఇక్కడ మీరు మీ భావాలను ఇతరులతో పంచుకోవచ్చు, ఇతరుల భావాలను వీక్షించవచ్చు. ఫేస్ బుక్ లాంచ్ అయినదగ్గరనుండీ ఇప్పటివరకూ అనేకసార్లు అప్ డేట్ చేయబడింది. అప్ డేట్ చేసిన ప్రతీసారీ ఎదో ఒక కొత్త అంశం తో యూజర్ లను ఆకర్షిస్తుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే చిన్నా, పెద్దా ,ముసలీ, ముతకా తేడా లేకుండా స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కడూ ఫేస్ బుక్ ను ఉపయోగిస్తున్నారు.
సరే. ఇక విషయానికొద్దాం. మీరు మీ చిన్ననాటి స్నేహితుని గురించి ఫేస్ బుక్ లో వెతకాలి అనుకోండి. వెంటనే మీ ఫేస్ బుక్ ఎకౌంటు లోనికి లాగ్ ఇన్ అయ్యి అతని పేరు టైపు చేసినట్లయితే ఒక వేళ అతను ఫేస్ బుక్ ఎకౌంటు ను కలిగి ఉంటె ఖచ్చితంగా ఆయా వివరాలు మీకు కనిపిస్తాయి. మరి లాగ్ ఇన్ అవ్వకుండా ఇలా మీ ఫ్రెండ్స్ ను సెర్చ్ చేయడం ఎలా? అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే చదవండి. మనం మన ఫేస్ బుక్ ఎకౌంటు లోనికి లాగిన్ అవకుండానే మన స్నేహితులను సెర్చ్ చేసుకోవచ్చు. దానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటో ఈ ఆర్టికల్ లో చూద్దాం.
ఫేస్ బుక్ యొక్క “ పీపుల్ సెర్చ్ “ ఫీచర్ ను ఉపయోగించండి.
మీరుమీ ఫేస్ బుక్ అకౌంట్ లోనికి లాగిన్ అవకుండానే మీ స్నేహితులను సెర్చ్ చేసుకునేందుకు వీలుగా ఫేస్ బుక్ ఒక పేజి ని క్రియేట్ చేసింది.
ఈ పైన చూపిస్తున్న పేజి కి వెళ్ళడానికి https://www.facebook.com/friends/requests/?fcref=ffi ఈ లింక్ ను క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న బాక్స్ లో మీ స్న్హితుని పేరు టైపు చేయండి. ఇంకా స్పష్టంగా కావాలి అనుకుంటే అతను ఉంటున్న ఊరి పేరు లేదా చదువుకున్న పాఠశాల/ కళాశాల పేరు ను టైపు చేస్తే అతనికి ఫేస్ బుక్ ఎకౌంటు ఉన్నట్లయితే వెంటనే మీకు అతని వయారాలు కనిపిస్తాయి.
ఫేస్ బుక్ డైరెక్టరీ ని ఉపయోగించడం
ఫేస్ బుక్ డైరెక్టరీ అనేది పేరుకు తగ్గట్లు ఫేస్ బుక్ లో ఉన్నఅందరు వ్యక్తుల, ప్రదేశాల మరియు పేజి ల యొక్క సమస్త సమాచారం ఇక్కడ లభిస్తుంది. దీనిని ఉపయోగించి మీ స్నేహితుల మరియు సన్నిహితుల వివరాలను మీరు కనుక్కోవచ్చు. అది కూడా మీ ఎకౌంటు లోనికి లాగిన్ అవ్వకుండానే.
ఇది ఒక డిక్షనరీ మాదిరిగా పనిచేస్తుంది. అంటే మీరు మీ స్నేహితుల వివరాలను ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అంటే అక్షర క్రమం లో వెతుక్కునే సదుపాయాన్ని కల్పిస్తుంది. మీరు మీ బ్రౌజర్ లో CTRL+Fను ఉపయోగించడం ద్వారా అనేకరకాల పేర్లను మీరు కనుగొనవచ్చు.
గూగుల్ సెర్చ్
ఇది దాదాపు అందరికీ తెలిసినదే. అయితే ఇలా కూడా చేయవచ్చు అని చాలా మందికి తెలియదు. ఎందుకంటే ప్రతీ చిన్న విషయమూ ఇంటర్ నెట్ లో అందుబాటులో ఉంటున్న ఈ రోజుల్లో ఒక ఫేస్ బుక్ ప్రొఫైల్ ను కనుగొనడం ఏమంత కష్టమైన పని కాదు కదా! ఫేస్ బుక్ ఎకౌంటు లోనికి లాగిన్ అవ్వకుండానే మీ స్నేహితుల, సన్నిహితుల వివరాలను చూసే అవకాశం ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మీరు చేయవలసిందల్లా మీరు ఎవరి గురించి వెదుకుతున్నారో వారి పేరు ను టైపు చేస్తే చాలు . మిగతా వివరాలన్నీ అక్కడే స్క్రీన్ పై మీకు కనిపిస్తాయి.
చూశారు కదా ఫేస్ బుక్ ఎకౌంటు లోనికి లాగిన్ అవ్వకుండానే ఈ పై ఉదాహరించిన మార్గాల ద్వారా మీ స్నేహితుల వివరాలను తెలుసుకోవచ్చు.