• తాజా వార్తలు

యావరేజ్ గా ఉన్న ల్యాప్ ట్యాప్ బ్యాటరీ ని గరిష్టంగా వాడుకోవడం ఎలా?

మీలో లాప్ టాప్ ను వాడేవారు చాలామందే ఉంటారు కదా! ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నపుడు సడన్ గా మీ లాప్ టాప్ లో లో బ్యాటరీ అనో లేక బాటరీ అయిపోవడం జరిగితే ఎంత చికాకుగా ఉంటుంది? అవును ఖచ్చితంగా ఇలాంటి సందర్భాలను దాదాపుగా మనందరం ఫేస్ చేసి ఉంటాము. మనం ఖచ్చితంగా ఎల్లపుడూ మన ల్యాప్ ట్యాప్ లో సరిపోనూ ఛార్జింగ్ ఉండే విధంగా చూసుకుంటాము. అయితే అన్నీ మా చేతుల్లో ఉండవు కదా! ఒక్కోసారి మరచిపోవడమో లేక లాప్ ట్యాప్ యొక్క సగటు బ్యాటరీ లైఫ్ తగ్గిపోవడం వల్లనో ముఖ్యమైన పనిలో ఉన్నపుడు అది ఆగిపోతే ఎంతో చికాకుగా అనిపిస్తుంది కదా! తక్కువ ధర లో లభించే లాప్ టాప్ ల నుండి ఎక్కువ సామర్థ్యం ఉండే బ్యాటరీ లను ఎక్స్ పెక్ట్ చేయడం కష్టం. ఖచ్చితంగా హై ఎండ్ లాప్ టాప్ ల బ్యాటరీ లతో పోలిస్తే వీటి పనితీరు తక్కువగానే ఉంటుంది. నిరంతరం ఉపయోగించే ఏ లాప్ టాప్ కైనా ఎస్టిమేటేడ్ బ్యాటరీ లైఫ్ టైం 3.5 గంటల నుండీ 4 గంటల వరకూ ఉంటుంది. ఇంత తక్కువ సమయం అనేది అధునాతన ల్యాప్ ట్యాప్ లలో ఉండే మోడరన్ గ్రాఫిక్ ఇంటెన్సివ్ ఆపరేటింగ్ సిస్టం మరియు అప్లికేషనుల వలన జరుగుతుంది. ఇక ఈ సమయం కంటే తక్కువ సమయం మీ బ్యాటరీ వస్తున్నట్లయితే మీరు కొంచెం జాగ్రత్త గా ఉండవలసిందే. మరి ఇలాంటి సమస్యలకు పరిష్కారం ఏమిటి? మన లాప్ టాప్ యొక్క సగటు లైఫ్ టైం ను పెంచుకోలేమా? తద్వారా దీని బ్యాటరీ  ని గరిష్టంగా వాడుకోవడం ఎలా? తదితర అంశాలను ఈ ఆర్టికల్ లో చర్చిద్దాం.

బ్రైట్ నెస్ ను తగ్గించండి.

మీ లాప్ట్యాప్ లో ఉండే బ్రైట్ నెస్ ను వీలైనంత గా తగ్గించడం ద్వారా బాటరీ యొక్క సగటు జీవిత కాలాన్ని పెంచవచ్చు. కంట్రోల్ పానెల్ లు ఉండే డిస్ప్లే సెట్టింగ్ లలో బ్రైట్ నెస్ ను పవర్ సేవింగ్ కు తగ్గట్లు గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ బ్రైట్ నెస్ ఉన్నపుడు అది ఎక్కువ పవర్ ను వినియోగించుకుంటుంది. తద్వారా బ్యాటరీ తక్కువ సమయం వస్తుంది. అడ్వాన్స్డ్ పవర్ సెట్టింగ్స్ లోనికి వెళ్లి పవర్ సేవర్ మోడ్ లో కూడా మీ ల్యాప్ ట్యాప్ ను ఉంచుకోవచ్చు. ఈ రకంగా చేయడం ద్వారా మీ లీపు ట్యాప్ సుమారుగా 20 % బ్యాటరీ ని సేవ్ చేసుకున్నట్లు అవుతుంది. దీనికి అదనంగా మీరు మరికొన్ని పనులు కూడా చేయవచ్చు. ఎక్కువ కాంతి ఉండే గదిలో మీ వర్క్ చేయడం ద్వారా లాప్ టాప్ లో బ్రైట్ నెస్ ఎక్కువ ఉండవలసిన అవసరాన్ని తగ్గించవచ్చు. తద్వారా కూడా బ్యాటరీ ఎంతో కొంత సేవ్ అవుతుంది కదా!

స్క్రీన్ సేవర్ ను స్విచ్ ఆఫ్ చేయండి.

స్క్రీన్ సేవర్ లను స్విచ్ ఆఫ్ చేయడం ద్వారా కూడా కొంతవరకూ బ్యాటరీ లైఫ్ ను పెంచవచ్చు.

డీ ఫ్రాగ్మంటైజేషన్

ఇది రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. పవర్ వినియోగాన్ని తగ్గించడం తో పాటు హార్డ్ డ్రైవ్ మెయింటనన్స్ ను కూడా తగ్గిస్తుంది. డేటా యొక్క డీ ఫ్రాగ్మంటైజేషన్ అనేది హార్డ్ డ్రైవ్ పై ఒత్తిడి తగ్గిస్తుంది. దీనితో పాటే బ్యాటరీ కూడా సేవ్ అవుతుంది.

అనవసరమైన ప్రోగ్రాం లను తీసేయండి.

టాస్క్ బార్ లో అనవసరం గా ఉండే ప్రోగ్రాం లను డిలీట్ చేయండి. ctrl-alt-Del ద్వారా టాస్క్ బార్ లో ఉన్న అనవసర ప్రోగ్రాం లను డిలీట్ చేయవచ్చు.  

స్లీప్ మోడ్ లో కాకుండా హైబెర్ నేషన్ మోడ్ లో ఉంచండి.

కరెంటు స్టేటస్ ను సేవ్ చేసిన తర్వాత చాలామంది తమ లాప్ టాప్ లను స్లీప్ మోడ్ లో ఉంచుతారు. అలాకాకుండా లాప్ ట్యాప్ లను హైబెర్ నేషన్ మోడ్ లో ఉంచడం వలన  

టెంపరేచర్ ను కూడా గమనించాలి

మనం లాప్ టాప్ ను ఎక్కడ ఉంచుతున్నాము అనేది కూడా బ్యాటరీ యొక్క లైఫ్ టైం పై ప్రభావం చూపిస్తుంది. లాప్ టాప్ ను ఉంచే ప్రదేశం ఎక్కువ వేడిగా ఉండే ప్రదేశం లో ఉంచకూడదు. అలాగని చల్లగా ఉండే ప్రదేశాలలో కూడా ఉంచకూడదు. ఎందుకంటే అతి ఉష్ణం మరియు అతి శీతలం రెండూ బ్యాటరీ లైఫ్ కు ప్రమాదకరమే.

అప్ డేటెడ్ వెర్షన్ లో రన్ అయ్యేవిధంగా చూసుకోండి.

కొత్తగా విడుదల అయిన సాఫ్ట్ వేర్ లు ఎక్కువ సామర్థ్యం తో పనిచేస్తాయి కాబట్టి, మీ సాఫ్ట్ వేర్ ను ఎప్పటికప్పుడు అప్ డేటెడ్ గా ఉండేట్లు చూసుకోండి.

ఛార్జింగ్ పెట్టేటపుడు జాగ్రత్త వహించాలి.

మీ లాప్ టాప్ లో ఉన్న ఛార్జింగ్ మొత్తం దాదాపుగా పూర్తీ అయిన తర్వాతే తిరిగి ఛార్జింగ్ పెట్టడం అనేది మీ లాప్ టాప్ యొక్క బ్యాటరీ లైఫ్ ను పెంచుతుంది. కొత్త లాప్ టాప్ ఏదైనా మొదటిసారి ఛార్జింగ్ పెట్టేటపుడు 24 గంటల పాటు ఛార్జింగ్ పెట్టాలి. ఉపయోగించేటపుడు 40 % అయ్యాక తిరిగి మళ్ళీ ఛార్జింగ్ పెట్టాలి.. లాప్ టాప్ కోనేటపుడే అందులో ఉండే బ్యాటరీ గురించి వాకబు చేసి కొంటె ఆ తర్వాత ఏ ఇబ్బందీ లేకుండా ఉంటుంది. లిథియం అయాన్ బ్యాటరీ లు అయితే ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ అయ్యాక ఇక పవర్ ను తీసుకోవడం అపివేస్తాయి. అదే నాన్ లిథియం అయాన్ బ్యాటరీ లు ఇళ్ళ పనిచేయవు.

ఎక్స్ టర్నల్ డివైస్ లను అన్ ప్లగ్ చేయండి.

USB డివైస్ లు ఎక్కువ పవర్ ను వినియోగించుకుంటాయి. వీటితో పాటు వైర్ లెస్ ఫీచర్ లైన వై ఫై , బ్లూ టూత్ మరియు బిల్ట్ ఇన్ డేటా మోడెమ్ లాంటి వాటిని అవసరం లేనపుడు డిజేబుల్ చేయాలి. లేకుంటే ఇవి కూడా ఎక్కువ పవర్ ను ఉపయోగించుకుంటాయి. స్పీకర్ లు కూడా ఎక్కువ పవర్ ను వినియోగించుకుంటాయి. అలాగే  సిడి లేదా డివిడి లను డ్రైవ్ లో వదలివేయకూడదు.

సౌండ్స్ ను మ్యూట్ చేయండి.

అవసరం లేనపుడు స్పీకర్ లను టర్న్ ఆఫ్ చేయాలి. అలాగే ఇన్ స్టాల్ చేయబడిన సౌండ్ థీమ్ లు కూడా బ్యాటరీ ని తినివేస్తాయి. కాబట్టి మల్టీమీడియా అప్లికేషను లను మినిమైజ్ చేయండి.

లోకల్ కు షిఫ్ట్ అవ్వండి.

ఎక్స్ టర్నల్ డ్రైవ్ లో ఉన్న ఫైల్ లను డైరెక్ట్ గా ఉపయోగించకూడదు. ముందు వాటిని మీ సిస్టం లోని లోకల్ డ్రైవ్ లో సేవ్ చేసుకుని ఆ ఎక్స్ టర్నల్ డ్రైవ్ ను రిమూవ్ చేసి ఏదైనా ఆ ఫైల్ పై వర్క్ ఉంటె లోకల్ డ్రైవ్ లో ఉన్న దానిద్వారా చేసుకోవాలి. దీనివలన కూడా పవర్ సేవ్ అవుతుంది.

ఎక్కువ RAM ను ట్రై చేయండి

మీ డివైస్ లు సరిపోను ఉండే RAM ను కలిగిఉండడం ద్వారా మీ హార్డ్ డ్రైవ్ పై లోడ్ ను తగ్గించవచ్చు. తద్వారా మీ బ్యాటరీ యొక్క లైఫ్ లో కూడా గణనీయమైన మార్పును చూడవచ్చు.

మెమరీ ఎఫెక్ట్

ఈ తరహా సమస్య పాతతరం లాప్ టాప్ లలో ఉండే NI-MH బ్యాటరీ ల వలన ఉత్పన్నం అవుతుంది. దీనివలన  మీ బ్యాటరీ ని పదేపదే ఛార్జింగ్ పెట్టినా లేక పాక్షికంగా ఛార్జింగ్ పెట్టినా తొందరగా డిశ్చార్జ్ అవుతుంది. దీనికి ఉన్న పరిష్కారం బ్యాటరీ ని పూర్తిగా ఛార్జింగ్ అవ్వనివ్వాలి అలాగే పూర్తిగా డిశ్చార్జ్ అవ్వనివ్వాలి.

తక్కువ పవర్ ని వినియోగించే వర్క్ లు చేయాలి

గ్రాఫిక్ ఇంటెన్సివ్ అప్లికేషను లను ఉపయోగించడం వలన మీ లాప్ టాప్ లోని బ్యాటరీ ఎక్కువ వినియోగం అవుతుంది. కాబట్టి వీలును బట్టి ఆయా పనులను MS వర్డ్ లోకానీ స్ప్రెడ్ షీట్ లలో కానీ చేయడం వలన బ్యాటరీ పై ఒత్తిడి ని తగ్గించవచ్చు.

 

 

 

జన రంజకమైన వార్తలు