• తాజా వార్తలు

ఫేస్ బుక్ పట్ల అనాసక్తి చూపిస్తున్న హైదరాబాద్ యువత

దేశ వ్యాప్తంగా టీనేజి యువత ఫేస్ బుక్ ను ఒక వ్యసనంగా మార్చేశాయని  సర్వే లు చెబుతుంటే హైదరాబాద్ లో మాత్రం పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉన్నది.గత సంవత్సరం నగరం లోని టీనేజి యువత లో ఫేస్ బుక్ వాడే అలవాటు 91 శాతం మందికి ఉంటే ఈ సంవత్సరం అది 83 శాతానికి పడిపోయింది.అంటే 8 శాతం క్షీణించింది. ఫేస్ బుక్ పట్ల యువత లో తగ్గుతున్న క్రేజ్ కు ఇది ఒక ఉదాహరణ గా చెప్పుకోవచ్చు.హైదరాబాద్ టీన్స్ లో TCS నిర్వహించిన సర్వే లో ఇవి వెల్లడయ్యాయి. యువతులలో ఫేసు బుక్ కంటే గూగుల్ కే ఎక్కువ ఆదరణ ఉన్నట్లు తెలిసింది.హైదరాబాద్ లో ని యువతులలో 78%శాతం మంది అమ్మాయిలు గూగుల్ వాడుతుంటే కేవలం 74%మంది మాత్రమే ఫేస్ బుక్ వాడుతున్నారు.

గత సంవత్సరం రికార్డు స్థాయిలో 91 % మంది యువ వినియోగదారులతో సింహ భాగాన్ని ఆక్రమిస్తే 72%,మరియు 47%లతో గూగుల్ మరియు ట్విట్టర్ లు తర్వాతి స్థానాన్ని పొందాయి.కానీ సంవత్సరం తిరిగేసరికి సీన్ రివర్స్ అయింది.TCS సర్వే అనేది దేశం లోనే అతి పెద్ద సర్వే ఏజెన్సీ.ఈ సర్వే 12-18 సంవత్సరాల పిల్లల డిజిటల్ అలవాట్ల పై పరిశోధనలు నిర్వహిస్తుంది. స్మార్ట్ ఫోన్ లు హైదరాబాద్ యువత లో అత్యంత పాపులర్ అయిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్ లుగా ఈ సర్వే పేర్కొంది. కానీ ఇంటర్ నెట్ ను వాడుతున్న ఎలెక్ట్రోనిక్ పరికరాలలో డెస్క్ టాప్ లు,లాప్ టాప్ లే 48%శాతం తో అగ్రస్థానం లో ఉంటే,33%తో స్మార్ట్ ఫోన్ లు వాటి తర్వాతి స్థానం లో ఉన్నాయి.

నగరం లోని సుమారు 50 పాఠశాలల నుండి 1000 మంది విద్యార్థులతో ఈ సర్వే ను నిర్వహించారు. మన హైదరాబాద్ యువత ఎప్పుడు,దేనికి,ఎలా స్పందిస్తారో చెప్పడం కష్టమే మరి.

 

జన రంజకమైన వార్తలు