• తాజా వార్తలు

ఫేస్ బుక్ మెసేజ్ చూసి కూడా చూడనట్లు అజ్ఞాతంగా ఉండడం ఎలా?

ప్రస్తుత టెక్ ప్రపంచం లో ఎక్కువమంది ఉపయోగిస్తున్న సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ఏది అంటే ఫేస్ బుక్ అని ఎవరైనా టక్కున చెప్పేస్తారు. ఫేస్బుక్ కు ఉన్న ఈ ప్రాముఖ్యత వలననే ఫేస్ బుక్ యొక్క మెసేజింగ్ సర్వీస్ అయిన మెసెంజర్ కూడా బహుళ ప్రాచుర్యాన్ని పొందింది. వ్యక్తుల మధ్య ప్రైవేటు సంభాషణ ను కమ్యూనికేట్ చేయడానికి ఈ మెసెంజర్ ఉపయోగపడుతుంది. ఇది చాలా మందికి ప్రస్తుతం సర్వ సాధారణం అయింది. అయితే మీరు మీ ఫ్రెండ్ కు మెసేజ్ పంపిన తర్వాత అతను అది చదివిందీ లేనిదీ మీకు వెంటనే తెలిసిపోతుంది. అలాగే ఎవరైనా మీకు మెసేజ్ పంపితే మీరు దానిని చూసిందీ లేనిదీ వారికి కూడా తెలిసిపోతుంది. అయితే చాలా మందికి ఇది ఇష్టం ఉండదు. మనం మెసేజ్ ను చుసిన సంగతి వారికీ తెలియకుండా ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది.

వీటిని రీడ్ రిసిప్ట్స్ అని అంటారు.వీటిని డిజేబుల్ చేయడానికి ఫేస్ బుక్ లో ఏ రకమైన ఇన్ బిల్ట్ మెకానిజం ఉండదు. మీరు మెసేజ్ చుసిన సంగతి వారికి తెలియకుండా ఉండాలి అంటే ట్రిక్స్ మరియు టిప్స్ ఏవీ ఉండవు. దీనికి వేరే పరిష్కారం ఉన్నది. అది మొబైల్ కు ఒకరకం గానూ డెస్క్ టాప్ కు మరొక రకంగానూ ఉంటుంది. ఆ వివరాలను ఈ ఆర్టికల్ లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే ఇది ఐఒఎస్ లో పనిచేయదు.

క్రోమ్ మరియు ఫైర్ ఫాక్స్ : అన్ సీన్ ఎక్స్ టెన్షన్ ను ఉపయోగించండి.

మీరు ఎక్కువగా చాటింగ్ ను ఉపయోగిస్తున్న వారు అయితే క్రోమ్ మరియు ఫైర్ ఫాక్స్ లకు ఒక సింపుల్ ఎక్స్ టెన్షన్ అందుబాటులో ఉన్నది. ఇది చాట్ బాక్స్ లనుండి సీన్ డైలాగ్ ను తీసివేస్తుంది. మెసెంజర్.కాం లో ఉన్న వాటిని కూడా ఇది తొలగిస్తుంది. క్రోమ్ ఎక్స్ టెన్షన్ తో పోలిస్తే ఫైర్ ఫాక్స్ ఎక్స్ టెన్షన్ ప్రాథమిక స్థాయిలోనే ఉంటుంది. కాబట్టి ఈ రెండింటికీ వేరు వేరుగా చూద్దాం

క్రోమ్ యొక్క అన్ సీన్

ఇందులో మొదటగా మీరు క్రోమ్ యొక్క అన్ సీన్ ఎక్స్ టెన్షన్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి. వెంటనే మీ మెనూ బటన్ లో ఒక కొత్త ఐకాన్ ప్రత్యక్షం అవుతుంది. ఇది ఒక చిన్న ఐబాల్ లాగా కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే అది స్టార్ట్ అవుతుంది. ఇది ఇన్ స్టాల్ అయిన వెంటన్ అది సీన్ ఫీచర్ ను బ్లాక్ చేయడం ఆటోమాటిక్ గా స్టార్ట్ చేస్తుంది. దీనితో పాటు డెలివరీ రిసిప్ట్స్ మరియు టైపింగ్ ఇండికేటర్ ను కూడా బ్లాక్ చేస్తుంది. ఇందులో ఇంకా అనేక ఆప్షన్ లు అందుబాటులో ఉంటాయి. లాస్ట్ ఆక్టివ్ ఇండికేటర్, మార్క్ అస్ రెడ్ బటన్, దొ థింగ్స్ ఆన్ యువర్ టైం మొదలైన వాటిని కూడా ఇది బ్లాక్ చేస్తుంది. ఈ ఆప్షన్ లన్నీ మీ ఇష్ట ప్రకారం ఆక్టివేట్ లేదా డీ ఆక్టివేట్ అవుతాయి. ఒక్కొసారి ఇది నోటిఫికేషన్ లను కూడా బ్లాక్ చేస్తుంది.

ఫైర్ ఫాక్స్ యొక్క అన్ సీన్

ఇది చాలా సులభంగా ఉంటుంది. మొదటగా దీనిని ఇన్ స్టాల్ చేసుకోవాలి. ఇందులో ప్రత్యేకమైన సెట్టింగ్ లు కానీ, ఫీచర్ లు కానీ ఎనేబుల్ లేదా డిజేబుల్ చేయవలసినవి కానీ ఏవీ ఉండవు. ఇది కేవలం ఒక ఎక్స్ టెన్షన్ మాత్రమే. అంటే అంతకుమించి ఏదీ కాదు.ఇది కేవలం ఫేస్ బుక్ కు మాత్రమే పనిచేస్తుంది.

ఆండ్రాయిడ్ : అన్ సీన్ యాప్ తో మెసేజ్ లు పంపండి

క్రోమ్ మరియు ఫైర్ ఫాక్స్ లానే ఆండ్రాయిడ్ లో కూడా ఇది చాలా సింపుల్ గా ఉంటుంది. ఇక్కడ ఇది ఒక యాప్ రూపం లో ఉంటుంది.ఈ యాప్ ను కూడా అన్ సీన్ అనే అంటారు. ఇది అఫీషియల్ ఫేస్ బుక్ మెసెంజర్ యాప్ యొక్క ప్రత్యామ్నాయం గా ఉపయోగపడుతుంది. అయితే వాట్స్ అప్, వైబర్, మరియు టెలి గ్రామ్ లలో ఉండే సీన్ నోటిఫికేషన్ లను కూడా బ్లాక్ చేసేస్తుంది.

మొదటగా మీరు దీనిని మీ మొబైల్ లో ఇన్ స్టాల్ చేసుకోవాలి. తర్వాత సెట్ అప్ ప్రాసెస్ లో రన్ అవ్వాలి. ఇది మీకు ఈ యాప్ ఎలా పనిచేస్తుందో చెబుతుంది. ఇందులో చివరి స్టెప్ ఏమిటంటే మీరు ఈ యాప్ కు నోటిఫికేషన్ లను యాక్సెస్ చేయాలి. అయితే ఇందుకోసం మీరు ఫేస్ బుక్ యొక్క మెసెంజర్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి. అది ఉన్నపుడే ఇది సాధ్యం అవుతుంది.

ఇది ఫేస్ బుక్ మెసెంజర్ లోని ప్రతీ నోటిఫికేషన్ నూ చదువుతుంది. అది అక్కడనుండి టెక్స్ట్ ను మీ ఓన్ విండో కు పంపిస్తుంది. అక్కడ మీరు ఆ మెసేజ్ ను చదవవచ్చు. ఇక్కడ మీరు మెసేజ్ ను చదివిన సంగతి వేరెవరికీ తెలియకుండా ఉంచుతుంది. అంటే ఇక్కడ రెండు నోటిఫికేషన్ లు జనరేట్ చేయబడతాయి. ఒకటి మెసెంజర్ కోసం మరియు మరొకటి అన్ సీన్ కోసం. అంటే మీరు సదరు మెసేజ్ ను అన్ సీన్ లో చదువుతారు కాబట్టి మెసెంజర్ లో అది చదివినట్లు కనపడదు.

"

"

జన రంజకమైన వార్తలు