సోషల్ మీడియా అంటే ఇండియాలో మోడీ పేరే వినిపిస్తుంది. సోషల్ మీడియాలో మోడీని మించిన పాపులర్ నేత ఇంకెవరూ లేరు. తాజాగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతున్నారు. ఆయనకు కూడా మంచి ఫాలోయింగ్ ఉందని తేలింది. తాజా సర్వేలో ఫేస్ బుక్ లో ఎక్కవ మంది ఫాలో అయ్యే నేతగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 12వస్థానంలో నిలిచారు. ఇది ఇండియా స్థాయిలో ర్యాంకు కాదు సుమా... వరల్డ్ ర్యాంకు. ప్రపంచ నేతల్లో ఆయన పన్నెండో ప్లేసులో ఉన్నారు. వరల్డ్ రీడర్స్ ఆన్ ఫేస్ బుక్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ప్రణబ్ పాపులారిటీ ప్రకారం 12వ స్థానంలో ఉండడమే కాదు ఆయన ఫేస్ బుక్ పేజి మోస్ట్ విజిటెడ్ పేజిగా రెండో స్థానంలో నిలిచింది. ప్రపంచ నేతలు, ప్రభుత్వాలు, ప్రపంచ సంస్థలు పాపులారిటీ ఎలా ఉందో తెలుసుకోవడానికి వరల్డ్ లీడర్స్ ఆన్ ఫేస్ బుక్ అనే ఈ సర్వేను బుర్సాన్ మార్సటెల్లర్ జరిపారు. ఇందులో భాగంగా మొత్తం 512 ఫేస్ బుక్ పేజీలు పరిశీలించారట. దాని ప్రకారం అమెరికా అధ్యక్షుడు ఒబామా 46.41 మిలియన్ల లైకులతో టాప్ లో ఉండగా మోడీ 31.74 మిలియన్ల లైకులతో రెండో ప్లేసులో ఉన్నారు. ప్రణబ్ ముఖర్జీ 3.13 మిలియన్లు లైకులతో 12వ ప్లేసు సాధించారు. మోడీ తరువాత ఇంటర్నేషనల్ గా సోషల్ మీడియాలో ఆ రేంజిలో పాపులారిటీ వచ్చింది ప్రణబ్ కే కావడం విశేషం. |