• తాజా వార్తలు

మీ ఫ్రెండ్ రిక్వెస్ట్ ని పట్టించుకోని వారెవరో ఇలా తెలుసుకోండి సులువుగా !

మీ ఫ్రెండ్ రిక్వెస్ట్ ని పట్టించుకోని వారెవరో ఇలా తెలుసుకోండి సులువుగా !
 

మనం ఫేస్ బుక్ లో ఎంతో మందికి ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పంపిస్తూ ఉంటాము. మనకు కూడా చాల మంది రిక్వెస్ట్ లు పంపిస్తూ ఉంటాము. అయితే మనం పంపించే రిక్వెస్ట్ లలో మనకు ప్రియమైన వారు ఉండవచ్చు. మన బాల్య స్నేహితులు ఉండవచ్చు, మనకు ఇష్టమైన గురువులు ఉండవచ్చు, సహోద్యోగులు ఉండవచ్చు ............... అయితే మనం పంపిన రిక్వెస్ట్ ను వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే బాగానే ఉంటుంది. కానీ  చేయకపోతే మాత్రం కొంచెం బాధ గా ఉంటుంది. కొంతమంది అయితే ప్రపంచం మమ్మల్ని వెలి వేసిందా అనే రీతిలో బాధ పడుతూ ఉంటారు.ఇది అతి. సరే ఇంతకీ విషయం ఏమిటంటే మన రిక్వెస్ట్ ను ఎవరెవరు రిజెక్ట్ చేశారో ఇక పై మనం సులువుగా తెలుసు కోవచ్చు. ఇంతవరకూ మనం ఎవరెవరికి ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పంపాము, వారిలో ఎవరెవరు వాటిని రిజెక్ట్ చేసారు తదితర విషయాలన్నీ సులువుగా తెలుసుకోవచ్చు.

తెలుసుకోవడం ఎలా?

మన ప్రొఫైల్ పేజి లో పై భాగం లో కుడి వైపు ఉన్న ఫ్రెండ్ రిక్వెస్ట్ సెక్షన్ లో దీని వివరాలు ఉంటాయి. ఫ్రెండ్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేస్తే వ్యూ ఆల్ అనే ట్యాబు వస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే రెస్పాండ్ తో యువర్ ఫ్రెండ్ రిక్వెస్ట్ అనే కాలమ్ లో వ్యూ సెంట్ రిక్వెస్ట్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీ రిక్వెస్ట్ లను ఎవరెవరు రిజెక్ట్ చేసిందీ తెలిసి పోతుంది. ఎవరెవరు యాక్సెప్ట్ చేసిందీ వారి లిస్టు కూడా ఇక్కడ కనిపిస్తుంది.

ఇంతకూ ముందు ఇది తెలియాలంటే మనం ఎవరెవరికి రిక్వెస్ట్ లు పంపామో గుర్తు పెట్టుకోవలసి ఉండేది. ఆ తర్వాత వారి ప్రొఫైల్ ను చూసి వారు మనకు ఫ్రెండ్స్ అవునా కదా తెలుసుకునే వాళ్ళం. కానీ ఈ లేటెస్ట్ అప్ డేట్ తో ఈ ప్రక్రియ సులువు అవుతుంది.

 

జన రంజకమైన వార్తలు