పరీక్షలకు ముందే పేపర్లు లీక్ అయితే ఏ యూనివర్సిటీకి అయినా చాలా ఇబ్బందే. ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా ఈ లీకేజీ లాంటి వ్యవహారాలు ఉంటే చాలా కష్టం. ఇప్పడు ఈ పేసర్ లీకేజీని అరికట్టడానికి బెంగళూరు యూనివర్సిటీ ఒక కొత్త ప్రయోగాన్ని చేయబోతోంది. ఇలాంటి లీకేజీలను నుంచి బయటపడటానికి ఆ యూనివర్సిటీ ఒక ఉపాయాన్ని ఆలోచించింది. పరీక్ష రాసే ముందు విద్యార్థులు ప్రశ్న పత్రం సీల్ తీశాక.... దాన్ని వీడియో తీసి అధికారులకు వాట్సప్ ద్వారా పంపించాలని యూనివర్సిటీ కోరింది. దీంతో లీకేజీని అరికట్టే అవకాశం ఉంటుందని యూనివర్సిటీ భావిస్తోంది. ఆ యూనివర్సిటీ పరీక్షలు నిర్వహిస్తున్న 182 సెంటర్లలో ఈ వాట్సప్ వీడియోలు పంపాల్సిందిగా పరీక్షలను రాస్తున్న విద్యార్థులను ఆదేశించింది. ఇన్విజిలేటర్, చీఫ్ కరస్పాండెంట్, ఇన్విజిలేటర్, ఒక విద్యార్థి, ఒక విద్యార్థిని సమక్షంలో ప్రశ్నాపత్రాలు బండిళ్లు విప్పి దాన్ని వీడియో తీయాలని బెంగళూరు యూనివర్సిటీ సూచించింది. ప్రశ్నాపత్రాన్ని ఓపెన్ చేసేటప్పడు విద్యార్థులు తప్పకుండా వీడియో తీసి వాట్సప్‌లో పంపాలని యూనివర్సిటీ ఆదేశించింది. వీడియో తీసిన తర్వాత విద్యార్థులు తమ సెల్‌ఫోన్లను ఇన్విజిలేటర్లకు అప్పగించాలని కూడా సూచించింది. పరీక్ష జరిగే ప్రదేశంలో ఎలాంటి సెల్‌ఫోన్‌లు ఉండకూదని చెప్పింది. ఈసారి పరీక్షలకు హాజరయ్యేవారు 3.5 లక్షల విద్యార్థులు (2.5 లక్షల ప్రెషర్స్) ఈ ఆదేశాలు తప్పక పాటించాలని యూనివర్సిటీ తెలిపింది. విశేషం ఏమిటంటే వాట్సప్‌ను ఉపయోగించుకునే గతంలో యూనివర్సిటీ నిర్వహించిన పరీక్షల్లో విద్యార్థులు లీకేజీ ప్రశ్నాపత్రాలను అందరికి పంపించారు. గత నెలలో కొన్ని పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ కావడంతో బెంగళూరు యూనివర్సిటీ ఇంతటి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. కాగా ఇటీవల దేశవ్యాప్తంగా పలు పరీక్షల ప్రశ్నపత్రాలు వాట్సాప్ లోనే లీకవుతున్న నేపథ్యంలో ప్రశ్నాపత్రాల లీకేజీని అరికట్టడానికి కూడా అదే వాట్సాప్ ను ఎంచుకోవడం ఆసక్తికరమే. |