ఫోటో లు తీయడo మీ హాబీ నా? చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది కదా అని ఎలా పడితే అలా క్లిక్ మనిపిస్తున్నారా? అలా మీరు తీసే ఫోటో ఎంత నాణ్యం గా ఉందో ఎప్పుడైనా గమనించారా? అందమైన ఫోటో కి మామూలు ఫోటో కి తేడా ఏమిటో తెలుసా? ఫోటో గ్రాఫరే. అవును నిజం ఫోటో ఎంత అందంగా ఉన్నదీ దానిని తీసే వ్యక్తిపైనే ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి మామూలు కెమెరా లతో కూడా కళాఖండాలను తీయవచ్చు. అదే ఆండ్రాయిడ్ ఫోన్ తో నైతే కొన్ని చిన్న టెక్నిక్ లు ఉపయోగించడం ద్వారా మీరు తీసే ఫోటో లను అందమైన కళాఖండాలుగా మార్చుకోవచ్చు. సాధారణంగా ఆండ్రాయిడ్ ఫోన్ తో ఫోటోలు తీసేటపుడు అందరూ చేసే పొరపాట్లు ఏమిటి? ఎలా తీస్తే బాగుంటుంది అనే అంశంపై ఒక పది ముఖ్యమైన విషయాలను ఈ వ్యాసం లో చూద్దాం. 1. లెన్స్ ను క్లీన్ చేస్తున్నారా? సాధారణంగా మనలో అందరం ఫోన్ ను స్క్రీన్ పైవైపు ఉండే విధంగానే ఉంచుతాము. అంటే స్క్రీన్ వెనుక వైపు గురించి అస్సలు పట్టించుకోము. మరి కెమెరా లెన్స్ ఉండేది అక్కడే కదా! లెన్స్ తో కూడి ఉన్న మీ ఫోన్ కెమెరా కు దుమ్మి ధూళి లాంటివి అంటుకునే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి కదా! మరి అదే కెమెరా తో ఫోటో తీసి అందంగా రావాలి అంటే సాధ్యమా? అందుకనే వీలయితే రోజుకి కనీసం రెండు సార్లు కెమెరా లెన్స్ ను మెత్తడి గుడ్డ తో శుభ్రం చేయడం అలవాటు చేసుకోండి. ఇక ఆ తర్వాత మీ ఫోటో లు ఎలా ఉన్నాయో చూడండి. తేడా మీకే తెలుస్తుంది. 2. క్విక్ లాంచ్ ను ఉపయోగిస్తున్నారా? ఒక్కోసారి ఫోటో యొక్క అందం అనేది మనం ఫోటో తీసే టైమింగ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఒక్క క్షణం తేడా వచ్చినా సరే మూమెంట్ మారిపోయి వేరే ఫోజు లో ఫోటో వచ్చే అవకాశం ఉంది. ఇలా వచ్చిన ఫోటోలు అంత అందంగా ఉండకపోవచ్చు. అందుకే ఫోటో లు తీసేటపుడు స్టడీ అంటారు. మామూలుగా ఫోన్ లకు పవర్ బటన్ లేదా లాక్ స్క్రీన్ ఉంటాయి. కెమెరా ను ఓపెన్ చేసటపుడు ముందు వీటిని ఓపెన్ చేయవలసి ఉంటుంది. అంతా సెట్ అయ్యేసరికి కొంతసమయం తీసుకుంటుంది. ఈ సమయం వలనఫోటో లో మీకు కావలసిన ఫోజు రాకపోవచ్చు. కానీ సామ్సంగ్, మోటోరోలా లాంటి కొన్ని ఫోన్ ల కెమెరాలకు క్విక్ లాంచింగ్ ఫీచర్ ఉంటుంది. అంతేగాక మీ టచ్ స్క్రీన్ పై కూడా కెమెరా యొక్క షార్ట్ కట్ ఉంటుంది. దీనివలన కూడా సమయం ఆదా అవుతుంది. ఒకవేళ లేకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. క్విక్ లాంచ్ ను సపోర్ట్ చేసే కొన్ని యాప్ లు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. 3. కెమెరా సెట్టింగ్ లపై ఒక కన్నేయండి మీ కెమెరా లో ఉండే సెట్టింగ్ లు చూడడానికి కొంచెం సంక్లిష్టం గా ఉంటాయి కానీ వాటిని సరైన విధంగా వాడుకుంటే అద్భుతమైన ఫోటో లను పొందవచ్చు. అందుకనే ఒక్కసారి అసలు మీ ఫోన్ కెమెరా లో ఏఏ సెట్టింగ్ లు ఉన్నాయో నిశితంగా గమనించండి. మీకే అర్థం అవుతుంది. 4. ఫిల్టర్ లను విపరీతంగా వాడుతున్నారా? ఫోటో లను తీసేటపుడు ఫిల్టర్ లు వాడడం అనేది ఏమంత మంచి ఆలోచన కాదు. అది కెమెరా లో ఉండే ఒక చిన్న భాగం మాత్రమే. మీకు అంతగా ఫోటోను అందంగా చేయాలి అని ఉంటే ప్లే స్టోర్ లో లభించే వివిధ రకాల యాప్ లను ట్రై చేయవచ్చు. ఇలా ఫిల్టర్ లను వాడడం వలన తక్కువ కాంతి లో ఫోటో లు తీసేటపుడు ఎక్కువ టైం తీసుకోవడమే గాక ఫోటో లు మసక మసక గా వస్తాయి. కాబట్టి ఫోటో తీసేటపుడు ఫిల్టర్ జోలికి పోకుండా ఉండడమే మంచిది. 5. జూమ్ చేయడం అవసరం లేదు దూరంగా ఉండే ఫోటో లను తీసేటపుడు చాలా మంది జూమ్ చేస్తూ ఉంటారు. అది చాలా తప్పు. జూమింగ్ మోడ్ లో ఫోటో లు తీయడం వలన ఏ మాత్రం నాణ్యత ఉండదు. అలాకాకుండా మామూలు మోడ్ లోనే ఫోటో లను తీసి దానిని మీ ఫోన్ లో ఉండే సెట్టింగ్ ల ద్వారా క్రాప్ చేసుకోవడం ఉత్తమం. దీని వలన మీ ఫోటో యొక్క నాణ్యత దెబ్బతినదు. మీకు కావలసిన ఫోటో యొక్క పూర్తి భాగం స్పష్టంగా మీకు లభిస్తుంది. 6. రూల్ ఆఫ్ థర్డ్ ను ఉపయోగిస్తున్నారా? ఫోటో లు తీసేవారు ఖచ్చితంగా పాటించవలసిన థంబ్ రూల్ లలో ఈ రూల్ ఒకటి. ఇది మీ కెమెరా స్క్రీన్ ను 9 సమాన గ్రిడ్ లుగా విభజిస్తుంది. మీరు ఫోటో తీసే వస్తువు యొక్క ఇమేజ్ ను ఏ రెండు లైన్ ల కలయిక దగ్గరైనా ఉంచుతాయి. దీనివలన ఫోటో కి మరింత అందం వస్తుంది.ఇప్పుడు వస్తున్న చాలా కెమెరా లకు ఈ ఆప్షన్ ఉంటున్నది. ఒకవేళ లేకపోయినా మొబైల్ యాప్ ల ద్వారా వీటిని పొందవచ్చు. 7. సేల్ఫీ లు తీసుకుంటున్నారా? మీరు సెల్ఫీ ప్రేమికులా? అయితే ఇది మీకోసమే. సెల్ఫీ లు తీయడానికి స్క్రీన్ మీద ఉండే షటర్ బటన్ ను ఉపయోగిస్తున్నారా? అయితే అది ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. సెల్ఫీ లను తీయడానికి వాల్యూం బటన్ లను వాడడమే మంచిది. లేనిచో స్నాప్ షాట్ ల ద్వారా సెల్ఫీ లను తీసుకోండి. ఒకవేళ మీ ఫోన్ లో ఈ ఆప్షన్ లు లేకపోతే ఇయర్ ఫోన్ లను కానీ హెడ్ సెట్ లను కానీ ఉపయోగించి వాల్యూం బటన్ లద్వారా సెల్ఫీ లు తీసుకోండి. 8. మోనోపోడ్ లనూ ట్రై పోడ్ లనూ ఉపయోగిస్తున్నారా? ప్రస్తుతం లభిస్తున్న ఫోన్ లన్నీ ఆప్టికల్ ఇమేజ్ స్టేబిలైజేషన్ ను కలిగి ఉంటున్నాయి. కానీ అవి చెప్పుకోవడానికి మాత్రమే. చాలా వాటికి ఇది పనిచేయదు. అలాంటపుడు మోనో పోడ్ లు ట్రై పోడ్ లు వాడడం వలన మీరు తీసే ఫోటో లు మసక మసక గా ఉండక మంచి నాణ్యత తో కూడినవై ఉంటాయి. 9. HDR మోడ్ ను మర్చిపోవద్దు. మీ ఫోటో లను HDR మోడ్ లో తీయడం వలన లైటింగ్ తో సంబంధం లేకుండా అద్భుతమైన నాణ్యత తో కూడిన ఫోటో లు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం లభిస్తున్న దాదాపు అన్ని ఫోన్ లలోనూ ఈ ఫీచర్ ఉన్నది . కొన్ని ఫోన్ లకైతే ఆఒట్ HDR ఫీచర్ కూడా ఉన్నది. ఒక వేళా లేకపోయినా థర్డ్ పార్టీ కెమెరా యాప్ లద్వారా ఈ HDR మోడ్ ను మీ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. 10. ఫ్లాష్ ను వాడుతున్నారా? చివరిగా మీరు ఫోటో లను తీసేటపుడు ఫ్లాష్ ను వాడడం మానివేయండి. ఇవి చాలా వరకూ సరిగా పనిచేయవు.దానికి బదులుగా మీ కెమరా లో లో లైట్ కెమెరా మోడ్ ను ఆన్ చేసుకిని ఫోటో లు తీయవచ్చు. తద్వారా తక్కువ కాంతి లో కూడా అందమైన ఫోటో లను పొందవచ్చు. చెత్త ఫ్లాష్ తో ఉన్న ఫోటో కంటే లో లైట్ లో ఉండే ఫోటో నే మంచిది కదా! |