• తాజా వార్తలు

అతి త్వరలో ట్విట్టర్ ద్వారా చెల్లింపులు అమ్మకాలు షురూ

నేటి సమాజానికి అందుబాటులో ఉన్న సామాజిక మాధ్యమాలలో ట్విట్టర్ ఒకటి.ట్విట్టర్ ద్వారా సాధారణంగా ఎం చేస్తారు?అభిప్రాయాలు పంచుకుంటారు.అంతేకదా!అయితే ఇకపై మనం ట్విట్టర్ ని మరో కొత్త కోణం లో చూడబోతున్నాం.అదే ట్విట్టర్ బిల్లింగ్.అదేంటి ట్విట్టర్ ద్వారా బిల్లులు చెల్లించడం ఏమిటి అని ఆశ్చర్యంగా ఉందా అయితే ఈ ఆర్టికల్ చదవండి మీకే తెలుస్తుంది.

భారత్ లోని ట్విట్టర్ వినియోగదారులు అతి త్వరలోనే ట్విట్టర్ ద్వారా బిల్లులు చెల్లించే సదుపాయాన్ని పొందబోతున్నారు.ఈ మేరకు భారత్ లోని ట్విట్టర్ ప్రతినిధులు ఇండియా ఆధారిత స్టార్ట్ –అప్ కంపెనీ అయిన లుక్ అప్ తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించారు.ఈ ఒప్పందం ద్వారా ఇండియా లో ట్విట్టర్ ను వాడుతున్న వినియోగదారులు ఎవరైనా ఏదైనా ట్రాన్సక్షన్ చేయలన్నా,దేని గురించి అయినా సమాచారం కావాలన్నా @lookuplite ద్వారా డైరెక్ట్ మెసేజ్ లు పంపవచ్చు. వినియోగదారులు,రిటైలర్ లకు మధ్యన పరస్పర సంభాషణను లుక్ అప్ తన డైరెక్ట్ మెస్సేజింగ్ ద్వారా అందిస్తుంది.ఢిల్లీ,ముంబై,బెంగళూరు లనుండి పేరున్న వ్యాపారస్తులే గాక దేశవ్యాప్తంగా తనకు 1.2 మిలియన్ల మంది రిజిస్టర్డ్ యూసర్ లు ఉన్నట్లు లుక్ అప్ చెబుతుంది.

ఈ భాగస్వామ్యం ద్వారా ఇండియా లో ట్విట్టర్ ను వాడుతున్న వారి హోం పేజి పై BUY అనే ఒక బటన్ కనిపిస్తుంది. ఈ BUY అనే బటన్ ను క్లిక్ చేయడం ద్వారా వినియోగదారులు ఏదైనా కొనుగోలు చేయవచ్చు.ఈ సరికొత్త విధానం ద్వారా ఆర్డర్ లు,పేమెంట్ లు తదితరములన్నీ ట్విట్టర్ ను ఉపయోగించి సులువుగా చేసుకోవచ్చు.కస్టమర్ లను వారికీ తగిన వ్యాపారులకు అనుసంధానం చేయడానికి మరియు దాని నియంత్రణా సామర్థ్యాలను  లుక్ అప్ ట్విట్టర్ యొక్క API (అప్లికేషను ప్రోగ్రాం ఇంటర్ పేస్)ను ఉపయోగించుకుంటుంది).యూసర్ లను కనెక్ట్ చేయడానికి వారి ఫోన్ నెంబర్ లను ఉపయోగించే బదులు వారి ఏరియా లో ఉన్న రిటైలర్స్ యొక్క సమాచారం కోసం లుక్ అప్ గూగుల్  మ్యాప్స్ ను ఉపయోగించుకుంటుంది.

అదీ సంగతి.మరెందుకు ఆలస్యం.వెంటనే ట్విట్టర్ ను ఉపయోగించి ఏదోకటి కొనేయండి.

 

జన రంజకమైన వార్తలు