నేడు స్మార్ట్ ఫోన్ ను కలిగి ఉన్న ప్రతీ వినియోగదారుని దగ్గరా పవర్ బ్యాంకు ఉండడం చాలా సాధారణం అయ్యింది. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ లలో అనేక రకాల యాప్ లు ఉండడం వలన అవి బాటరీ ని విపరీతంగా తినేస్తూ ఉండడం వలన ఛార్జింగ్ తొందరగా అయిపోతూ ఉంటుంది. ఈ సమస్యనుండి బయటపడడానికి దాదాపు అందరూ పవర్ బ్యాంకు లను ఆశ్రయిస్తున్నారు. ఈ పవర్ బ్యాంకు ను ఉపయోగించి ఛార్జ్ చేయడం సౌకర్యవంతం గా ఉంటుంది కానీ ఇది ఎంత వరకూ సురక్షితమో ఆలోచించారా? మీ స్మార్ట్ ఫోన్ ను పవర్ బ్యాంకు ను ఉపయోగించి ఛార్జ్ చేయడం వలన మీ ఫోన్ కు ఏమైనా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందా?
మన స్మార్ట్ ఫోన్ ను పవర్ బ్యాంకు తో ఛార్జింగ్ చేయవచ్చా? మీ స్మార్ట్ ఫోన్ యొక్క చార్జర్ ను తీసుకుని దానిపై ఉన్న వోల్టేజి ను చూడండి. అది 5V ఉంటుంది. ఇప్పుడు మీ పవర్ బ్యాంకు ను తీసుకుని దాని వోల్టేజి చూడండి. అదికూడా 5V కానీ దానికంటే కొంచెం ఎక్కువకానీ ఉంటుంది. ఇలా ఉంటె కనుక ఏ ఇబ్బందీ లేదు. అలా కాకుండా మీ పవర్ బ్యాంకు యొక్క వోల్టేజి దానికంటే తక్కువ గానీ లేదా బాగా ఎక్కు గానీ ఉంటే మాత్రం మీరు అలోచించాల్సిందే. ఎందుకంటే 5V కంటే తక్కువ ఉండే ఏ పవర్ బ్యాంకు అయినా స్మార్ట్ ఫోన్ ను సరిగా ఛార్జ్ చేయకపోగా మీ ఫోన్ యొక్క బాటరీ ను విపరీతంగా తినేస్తుంది. దానివలన మీ బాటరీ తొందరగా డ్రెయిన్ అవుతుంది. మీరు సాధారణం గా 5V పవర్ బ్యాంకు లను ఉపయోగిస్తారు కాబట్టి కంగారుపడవల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు 5 V పవర్ బ్యాంకు ను ఉపయోగిస్తున్నప్పటికీ మీ బాటరీ తొందరగా డ్రెయిన్ అవుతున్నట్లైతే మీరు దానిని వాడక పోవడమే మంచిది.
ఓవర్ నైట్ ఛార్జింగ్ ను ఎలా వాడాలి? ఇప్పుడు వస్తున్న స్మార్ట్ ఫోన్ లు కట్ ఆఫ్ టెక్నాలజీ తో వస్తున్నాయి. బాటరీ ఫుల్ ఛార్జ్ అయితే అంటే బాటరీ ఛార్జింగ్ స్థాయి 100 % కు చేరుకుంటే ఛార్జింగ్ ప్రక్రియ ఆటోమాటిక్ గా ఆగిపోతుంది. మీరు అలాంటి స్మార్ట్ ఫోన్ కనుక వాడుతున్నట్లయితే మీరు పవర్ బ్యాంకు ను ఉపయోగించవచ్చు అలాగే మీ ఫోన్ ను ఓవర్ నైట్ ఛార్జింగ్ పెట్టవచ్చు. సాధారణంగా కట్ ఆఫ్ టెక్నాలజీ అనేది బాటరీ ఛార్జింగ్ 100 శాతానికి చేరిన వెంటనే ఆటోమాటిక్ గా ఆగిపోతుంది. ఒక వేళ మీ ఫోన్ కట్ ఆఫ్ టెక్నాలజీ ని సపోర్ట్ చేయకపోతే ఈ ప్రక్రియ ను ఇది కనపరచదు. అంటే ఇలాంటి ఫోన్ ను ఓవర్ నైట్ ఛార్జింగ్ కు ఉపయోగించడం కుదరదు.ఒకవేళ ఇలాంటి ఫోన్ లను ఓవర్ నైట్ ఛార్జింగ్ చేసినట్లయితే అది మీ ఫోన్ ను పాడు చేసే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి పేలి పోవచ్చు కూడా! మీ హ్యాండ్ సెట్ కట్ ఆఫ్ కు సపోర్ట్ చేయకపోతే మీరు పవర్ బ్యాంకు ఉపయోగించవచ్చు. దీనికోసం మీ ఫోన్ బాటరీ సామర్థ్యానికి సమానంగా ఉన్న పవర్ బ్యాంకు నే ఉపయోగించాలి. అంటే మీరు 2000mAh బాటరీ ఉన్న ఫోన్ ను వాడుతూ ఉన్నట్లయితే 2000mAh నుండీ 4000 mAh వరకూ ఉన్న పవర్ బ్యాంకు లను ఉపయోగించవచ్చు. మీ ఫోన్ ను పవర్ బ్యాంకు తో రీఛార్జి చేసేటపుడు పవర్ బ్యాంకు యొక్క బాటరీ కూడా తొందరగా అయిపోతుండడం మీరు గమనించవచ్చు. చూశారుగా పై విశ్లేషణ ను బట్టి మీ ఫోన్ ను బట్టి పవర్ బ్యాంకు ను ఉపయోగించాలా వద్దా అనేది మీరే నిర్ణయించుకోండి. |