భారత్ లో ప్రతి వినియోగదారుడు పై ఫేస్ బుక్ కు లాభం అమెరికాలో 630 రూపాయలు 2014-15 వార్షిక ఫలితాల ప్రకారం ఫేస్ బుక్ ఇండియా లో తన రెవిన్యూ ను 27% పెంచుకుని ఏకంగా 123.5 కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందింది. గత సంవత్సరం మొదటిలో 97.6 కోట్ల రూపాయలు గా ఉన్న ఫేస్ బుక్ యొక్క ఆదాయం ఒక్కసారిగా 27 శాతం వృద్ది రేటు ను సాధించి 123.5 కోట్ల రూపాయలకు చేరుకుంది.ఇది సగటున ప్రతి వినియోగదారునీపై సుమారు 9 రూపాయలు సంపాదించింది.అంటే ఫేస్ బుక్ వాడుతున్న ప్రతి వినియోగదారుడు ఫేస్ బుక్ కు సగటున 9 రూపాయలు చెల్లిస్తున్నాడన్నమాట. ఇది అమెరికా కాకుండా మిగిలిన దేశాల ఫేస్ బుక్ వినియోగం ఆదాయం తో పోల్చినపుడు మన దేశం రెండవ స్థానం లో ఉండడం విశేషం.అదే అమెరికా లో అయితే ఫేస్ బుక్ యొక్క తలసరి ఆదాయం 630 రూపాయలు గా ఉంది.అంటే అమెరికా లో ఫేస్ బుక్ ను వాడుతున్న ప్రతి ఒక్కరూ సగటున ఫేస్ బుక్ కు 630 రూపాయలు చెల్లిస్తున్నారు. అమెరికా లో దీని మొత్తం ఆదాయం తో పోల్చినపుడు మన దేశం నుండి వచ్చేది ఏమంత లెక్క లోనికి తీసుకో నవసరం లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఫేస్ బుక్ యొక్క ఆదాయం దాదాపు 84,000 కోట్ల రూపాయలు గా ఉన్నది. మరి అంత పెద్ద మొత్తం లో 123.5 కోట్లు పెద్ద విషయం కాదు కదా! అలా అని భారత్ లో ఫేస్ బుక్ కు ఆదరణ లేదా అంటే అస్సలు కాదు. స్కూల్ పిల్లల నుండీ పండు ముసలి వాళ్ళ వరకూ అందరూ ఫేస్ బుక్ వినియోగదారులే. సుమారు మన దేశం లో 14 కోట్ల మంది ఫేస్ బుక్ వినియోగదారులు ఉన్నట్లు ఒక అంచనా. ఇది నాలుగైదు రాష్ట్రాల జనాభాకు సమానం. మరి ఈ స్థాయిలో యూసర్ లు ఉన్నపుడు ఆదాయం ఆ స్థాయి లో లేక పోవడానికి కారణాలేంటి? ఏ టెక్ మీడియా కైనా ప్రధాన ఆదాయం యాడ్ లు అనే విషయం అందరికీ తెలిసినదే.మన దేశం లో చాలా మంది మార్కెటర్లు డిజిటల్ మీడియా లో ప్రకటనలకు అధిక ఆదాయం వెచ్చించడం ఎప్పుడో ప్రారంభించారు.గత కొంత కాలంగా దీనిని చెప్పుకోదగిన రీతిలో పెంచుకుంటూ వస్తున్నారు.కానీ ఇది డిజిటల్ మీడియా లో మాత్రమే కానీ సోషల్ మీడియా లో లేకపోవడం తో , సోషల్ మీడియా తో పోల్చితే డిజిటల్ మీడియా కీ ఈ యాడ్ ల వలన అధిక ఆదాయం వస్తుంది. భారత్ లోని మార్కెటర్లు డిజిటల్ మీడియా కు చెల్లిస్తున్న మొత్తం లో సుమారు 70 శాతం ఒక్క గూగుల్ కే వెళ్తుంది. మన దేశం లో గూగుల్ యొక్క ఆదాయం సుమారు 4,000 కోట్ల వరకూ ఉంది. మార్కెట్ విశ్లేషకుల ప్రకారం మార్కెటర్లు ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో తమ బడ్జెట్ ను పెట్టడం ప్రారంభించారు. స్థానిక టెలికాం కంపెనీలతో కలిసి డేటా ఛార్జ్ లను కవర్ చేయడానికి ఫేస్ బుక్ ప్రవేశ పెట్టిన సరికొత్త పథకం అయిన ఫ్రీ బేసిక్స్ ఈ రంగం లో ఒక గేమ్ చేంజర్ గా మారబోతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ ఇక్కడే ఒక చిక్కు ఉంది. ఇండియా లో ఈ సేవలన్నీ క్లౌడ్ కింద మాత్రమే పని చేయాలి.కానీ ఈ అంశం ఇప్పుడు నెట్ న్యూట్రాలిటి అనే సంక్లిష్టమైన సమస్యలో చిక్కుకు పోయింది.భారత్ లోని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ లనుండి ఫ్ర్రీ బేసిక్స్ ఆపి వేయాలని టెలి కాం కంపెనీ ల మీద విపరీతమైన ఒత్తిడి ఉన్నది.అదీగాక ఫ్రీ బేసిక్స్ అనే అంశం ఇండియా లో అనేక విమర్శలను ఎదుర్కొంటుంది. గూగుల్ లాగా ఫేస్ బుక్ ఇంటర్ నెట్ కు రాజ మార్గం లాగా ఏమీ లేదు.కాబట్టి ఇన్ని ప్రతికూలతల మధ్య ఫేస్ బుక్ తన వినియోగ దారులకు ఉచితంగా సేవలను అందించడం ద్వారా మార్కెటర్ల ను ఆకర్షించడానికి మరికొన్ని ప్రణాళికలు రచిస్తుంది.ఉదాహరణకు భారత్ లోని నెట్ వినియోగదారులలో మెజారిటీ శాతం మంది 2 జి కనెక్షన్స్ ఉన్నవారే. 2 జి తో నెట్ ఏ మాత్రం స్పీడ్ ఉండదనే విషయం మనందరికీ తెలిసినదే.కాబట్టి ఫేస్ బుక్ సరికొత్త ఐడియా తో ముందుకు వచ్చింది. అదే ఫేస్ బుక్ లైట్.ఈ ఫేస్ బ్బోక్ లైట్ ద్వారా వినియోగదారులు అతి తక్కువ డేటా ఛార్జ్ లు చెల్లించి అతి ఎక్కువ వేగం తో కూడిన సేవలను పొందుతారు. మరి మార్కెటర్ల నుండి లభించే ఆదాయం కోసం విపరీతమైన పోటీ నెలకొని ఉన్న ఈ పరిస్థితులలో ఫేస్ బుక్ తన సరికొత్త పథకాలతో ఏ మాత్రం లాభాలు సాధిస్తుందో వేచి చూడాలి. |