• తాజా వార్తలు

స్టాక్ ఎక్స్చేంజి సంగతులు సోషల్ మీడియాలో

కొన్ని రోజుల క్రితం బీహార్ ఎలక్షన్ గురించీ దాని ఫలితాల గురించీ అందరికీ తెలిసిందే .దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసింది ఏదీ లేదు.ఈ మధ్య దేశంలో ఏ చిన్న విషయం జరిగినా సోషల్ మీడియాలో దానిని పదంతలు చేసి చూపించడం దానిపై లైక్ లు, కామెంట్ లు, షేర్ లు ఇలా హడావిడీ చేయడం కూడా సర్వ సాధారణం అయిపొయింది.అయితే పైన ఉదహరించిన విషయాలకు మన వెబ్ సైట్ కు సంబంధం ఏమిటి?అయితే ఏ వ్యాసం చదవండి.ఈ మధ్య ప్రకటించిన బీహార్ ఫలితాల తర్వాత ట్విట్టర్ లో ఒక వ్యాఖ్య అందరినీ ఆకర్షించింది.అదేంటో చూడండి.

“మారుతి ని కొనండి.బీహార్ లో కిడ్నాప్ వ్యాపారం పునరుద్దరించ బడబోతోంది.మారుతి omni అమ్మకాలు ఎన్నో రెట్లు పెరుగబోతున్నాయి.కిడ్నాపర్ లకు omni ఒక చక్కని అవకాశం.అందుకే మారుతి పై పెట్టుబడి పెట్టండి రెట్టింపు లాభాలను పొందండి.”

ఎంత సరదా అయిన ట్వీట్ అది!అందుకే కొన్ని వందల సార్లు రీ ట్వీట్ చేయబడింది.కాసేపు సరదాను పక్కన పెట్టి అసలు ట్విట్టర్ లో స్టాక్ మార్కెట్ ఏమిటి?ఆలోచించండి.అవును మీ ఆలోచన కరెక్టే!స్టాక్ మార్కెట్ మదుపరులు తమ పెట్టుబడులకు ట్విట్టర్ ను ఒక చక్కటి వేదికగా చేసుకుంటున్నారు. మదుపరుల యొక్క పెట్టుబడులకు సంబందించిన ఐడియా లను పంచుకోడానికి ఒక చక్కని వేదిక కల్పిస్తుంది.అయితే ఇది స్టాక్ మార్కెట్ లో కొంత గందరగోళాన్ని,మాల్ ప్రాక్టీసు ల అవకాశాన్ని కల్పిస్తుందనేది ఆలోచించాల్సిన విషయం.

కేవలం 140 కారెక్టర్ ల మేటర్ ఎంత గందరగోళాన్ని సృష్టిస్తుంది.

 

జన రంజకమైన వార్తలు