యూట్యూబ్‌ను మోనిటైజ్ చేయడం గురించి మనకు తెలుసు. గూగుల్ యాడ్స్ గురించి తెలుసు. కానీ ఫేస్‌బుక్‌ను మోనిటైజ్ చేయడం గురించి తెలుసా? త్వరలో ఈ ఆప్షన్ రాబోతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఫేస్‌బుక్ త్వరలో విడుదల చేయనుంది. ఫేస్‌బుక్ ఉపయోగిస్తున్న వారికి ఆదాయాన్ని సమకూర్చడానికి ఎఫ్‌బీ ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా ఒక సర్వేను కూడా నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం ప్రస్తుతానికి కొంతమంది వినియోగదారులకు మాత్రమే ఈ అవకాశాన్ని కల్పించాలని ఫేస్‌బుక్ నిర్ణయించింది. ఎఫ్‌బీ ద్వారా వారు ఏ రకంగా ఆదాయాన్ని సంపాదించడానికి వారు ఆసక్తి చూపుతున్నారు లాంటి తదితర విషయాలపై ఫేస్‌బుక్ ఒక సర్వేను నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం కొంతమంది ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే మోనిటైజ్ అవకాశం కల్పించాలని ఎఫ్‌బీ నిర్ణయించింది. దీనికి సంబంధించి ఒక స్క్రీన్ షాట్‌ను కూడా ఫేస్‌బుక్ పోస్టు చేసింది. ఫేస్‌బుక్‌లో కంటెంట్ ఉంచడం వల్ల ఆదాయాన్ని ఎలా పొందవచ్చో ఫేస్‌బుక్ సోదాహరణంగా తెలిపింది. దీని కోసం కొన్ని ఆప్షన్లను కూడా ఎఫ్‌బీ ప్రవేశపెట్టింది. వాటిలో టిప్‌జార్ ఒకటి. తాము ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆయా బ్రాండ్‌లకు సంబంధించిన కంటెంట్‌ను పోస్టు చేస్తే వినియోగదారులు డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. మరో ఆప్షన్ స్పానర్ మార్కెట్ ప్లేస్.. ఈ ఆప్షన్ ద్వారా వినియోగదారులు ఎడ్వర్టైజర్లతో ఎఫ్‌బీ వినియోగదారులు నేరుగా సంప్రదించే అవకాశం ఉంటుంది. మరో సదుపాయం ఛారిటీ.. దీని ద్వారా వినియోగదారులు ఛారిటీలకు దానం చేయచ్చు. కాల్ టు యాక్షన్ బటన్ ద్వారా ఏదైనా కొనడానికి, లేదా సైన్ అప్ చేయడానికి, రెవెన్యూ షేరింగ్ చేయడానికి ఎంతో ఉపయోగపడనుంది. అంతేకాక యూజర్ల కంటెంట్‌కు ఉన్న యాడ్‌ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని పొందడానికి కూడా ఈ సదుపాయం ఉపయోగపడుంది. |