పరిపాలనలో వీలైనంతగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని భావిస్తున్న నరేంద్ర మోడీ సారథ్యం లోని NDA ప్రభుత్వం ప్రజలతో మరింత చేరువగా ఉండేందుకు ఆర్థిక శాఖకు సంబంధించి యు ట్యూబ్ చానల్ ను లాంచ్ చేసింది. “ఎన్నో ప్రకటనలు,మరెన్నో అంచనాలు భారత ఆర్థిక శాఖ మరియు భారత ఆర్థిక వ్యవస్థ గురించి నిత్యం మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటాయి. ఈ సందర్భం లో భారత ఆర్థిక శాఖ కు సంబందించిన పూర్తీ సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉంచడానికి ఒక ప్లాట్ ఫాం అవసరమని మేము భావిస్తున్నాము.ఆర్థిక శాఖ యొక్క ముఖ్య మైన కార్యకలాపాలు అన్నీ పబ్లిక్ డొమైన్ లోనే జరుగుతున్నప్పటికీ బాహ్య ప్రపంచానికి కూడా దీని గురించి తెలుసుకోవలసిన అవసరం ఉంది.ఈ యూ ట్యూబ్ చానల్ అందుకు ఒక చక్కటి ప్లాట్ ఫాం కాగలదు “ అని ఈ యు ట్యూబ్ చానల్ ను లాంచ్ చేసే సందర్భంగా భారత ఆర్థిక శాఖామంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఆర్థిక శాఖ యొక్క కార్యకలాపాలను వీడియో ల రూపంలో ఈ యూ ట్యూబ్ చానల్ ప్రసారం చేస్తుంది. కేంద్ర ఆర్థిక శాఖ కార్య దర్శి రతన్ పి వాతల్ ,ఎకనామిక్ అఫైర్స్ డిపార్ట్ మెంట్ సెక్రెటరీ శక్తీ కాంత్ దాస్, రెవిన్యూ కార్యదర్శి హస్ముక్ ఆదియా తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. ప్రభుత్వ యొక్క ముఖ్యమైన పథకాలు, సమావేశాలు, ఆర్థిక శాఖ యొక్క పత్రికా సమావేశాలు మొదలైన వాటికీ సంబందించిన వీడియో లన్నింటినీ ఈ యు ట్యూబ్ చానెల్ ప్రసారం చేయనుంది. ఆర్థిక శాఖ యొక్క ఆన్ లైన్ లో ప్రజల ముందు సాక్షాత్కరించడంలో ఈ చానల్ ఇంకా మెరుగు పడవలసి ఉంది. ఆర్థిక శాఖ ను ఆదర్శం గా తీసుకుని మిగిలిన శాఖలు కూడా ఆన్ లైన్ ద్వారా ప్రజలను పలకరించే రోజులు అతి త్వరలోనే రానున్నయస్ని ఆశిద్దాం. |