వాట్సాప్ లో కొత్తగా ప్రవేశపెట్టిన ఫీచర్ ఇప్పుడు దాని కొంపముంచే సూచనలున్నాయని నిపుణులు అంటున్నారు. భారత్‌లో వాట్సాప్ నిషేధానికి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వినియోగదారుల సందేశాలు, వాయిస్ కాల్సు హ్యాకర్ల బారిన పడకుండా వాట్సప్ సరికొత్త సెక్యూరిటీ ఎన్‌క్రిప్షన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ ఫీచర్ పట్ల యూజర్లు హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికి.. ఈ లేటెస్టు వెర్షన్ మాత్రం భారత్‌లో చట్టవిరుద్ధమయ్యే అవకాశం కనిపిస్తుంది. భారత ఐటి చట్టాల ప్రకారం వాట్సప్‌పై ప్రభుత్వం నిషేధం విధించే అవకాశం ఉంది. అయితే... వాట్సాప్‌కు ఉన్న అత్యంత ప్రజాదరణ ఉన్న కారణంగా ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడపోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. యూజర్ల మెసేజ్‌లు, వాయిస్ కాల్సు వాటంతటవే ఎన్‌క్రిప్టయ్యే విధంగా వాట్సప్ తాజా చర్యలు చేపట్టింది. ఈ చర్యల కారణంగా ప్రభుత్వం కావాలని కోరినా వాట్సప్ మీ సమాచారన్ని ఇవ్వలేదు. 256 బిట్ ఎన్‌క్రిప్షన్‌ను ఇందుకు వాడటమే కారణం. ఈ ఎన్‌క్రిప్షన్ మన ఐటి చట్టాల ప్రకారం అక్రమం. 256 బిట్ ఎన్‌క్రిప్షన్ వాడినందుకు వాట్సప్‌పై ఎవరైనా కేసు పెట్టవచ్చు. ఐటి చట్టాల నియమ నిబంధనల ప్రకారం ప్రైవేటు సర్వీసులు ఏవీ కూడా ఈ ఎన్‌క్రిప్షన్‌కు ఉపయోగించరు. ఈ ప్రైవేటు సర్వీసులు ఏమిటన్నది ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. అయితే డిపార్టుమెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (డిఒటి) ఈ విషయమై కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. వీటి ప్రకారం వాట్సప్ అక్రమమంటూ కేసు పెట్టవచ్చు. అయితే.. ఇండియాలో నిబంధనలకు ప్రకారం ఇక్కడ తన విధానం మార్చుకుంటుంతో లేదంటే మొండికేస్తుందో చూడాలి. లేదంటే ప్రభుత్వమే భద్రతా చర్యల దృష్టా వాట్సప్‌ని నిషేధిస్తుందో వేచి చూడాలి. |