• తాజా వార్తలు

టిక్‌టాక్‌లో ప్రైవ‌సీ కోసం ఉన్న ప్ర‌త్యేక ఫీచ‌ర్లు మీకు తెలుసా!

టిక్‌టాక్ త‌క్కువ కాలంలో ఎక్కువ‌మందిని ఆక‌ట్టుకున్న యాప్‌.. ప్ర‌పంచ వ్యాప్తంగా కొన్ని వంద‌ల కోట్ల మంది  ఈ యాప్‌ని యూజ్ చేస్తున్నారు. ముఖ్యంగా భార‌త్‌లో ఈ చైనా యాప్ ప‌ల్లెటూళ్ల‌కు కూడా వెళ్లిపోయింది. కానీ టిక్‌టాక్ వ‌ల్ల లాభాల కంటే న‌ష్టాలే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ఇటీవ‌ల జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌లే రుజువు చేశాయి. చాలా మంది అమ్మాయిలు ఆత్మ‌హ‌త్య‌లు లాంటికి కార‌ణం ఈ యాప్‌ను ఎలా యూజ్ చేసుకోవాలో స‌రిగా తెలియ‌క‌పోవ‌డ‌మే.  అందుకే టిక్ టాక్ ప్రైవ‌సీ ఫీచ‌ర్స్‌ని అందుబాటులోకి తెచ్చింది. మ‌రి  ఆ ఫీచ‌ర్లేంటో తెలుసా..

13 ఏళ్ల నిబంధ‌న‌
టిక్‌టాక్ యూజ్ చేస్తున్న‌వాళ్ల‌కు కూడా వ‌య‌సు నిబంధ‌న పెట్టాల‌ని ఆ కంపెనీ నిర్ణ‌యించింది. దీని వ‌ల్ల ఈ యాప్ ఉప‌యోగించేవాళ్లు విచ‌క్ష‌ణ‌తో ఉంటార‌ని ఈ యాప్ త‌యారీదారులు భావిస్తున్నారు. అందుకే 13 ఏళ్ల లోపు వాళ్లు టిక్‌టాక్ వాడ‌కూడ‌ద‌ని నిబంధ‌న పెట్టింది. ముందుగా ఏజ్‌ని చేసిన త‌ర్వాతే  టిక్‌టాక్ ఉప‌యోగించే అవ‌కాశం ఉంటుంది. 

స్క్రీన్ టైమ్ రిస్ట్రిక్ష‌న్స్‌
యూజ‌ర్ టైమ్ రిస్ట్రిక్ష‌న్స్ పెట్ట‌డం ద్వారా అన‌వ‌స‌ర కంటెంట్‌కు అడ్డుక‌ట్ట వేయ‌చ్చ‌నేది టిక్‌టాక్ ఆలోచ‌న‌. ఇందుకోసం డిజిట‌ల్ వెల్ బియింగ్ లాంటి ఆప్ష‌న్‌ను పెట్టింది. సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఈ ఆప్ష‌న్‌ను ట్యాప్ చేయ‌డం ద్వారా మ‌న స్క్రీన్ టైమ్ కంట్రోల్ అవుతుంది. అంటే మ‌నం ఎంత స‌మ‌యంలో టిక్‌టాప్‌పై ఉండాలో స‌మ‌యాన్ని ఇవ్వాలి. ఇది 40 నుంచి 120 నిమిషాల దాకా ఉంటుంది. ఈ స‌మ‌యం త‌ర్వాత మ‌ళ్లీ పాస్‌వ‌ర్డ్ రిక్వైర్ అవుతుంది. అంటే మ‌న‌కు స‌మ‌యం తెలిసిపోతుంది. 

కామెంట్ ఫీల్ట‌ర్‌
హార్ష్ కామెంట్స్‌, అన‌వ‌స‌ర కామెంట్స్ వ‌ల్లే చాలా మంది అమ్మాయిలు  సూసైడ్ అటెంప్ట్స్ చేస్తున్నారు. అందుకే కామెంట్ ఫీల్ట‌ర్ ఆప్ష‌న్ యూజ్ చేసుకోవాలి.  మీరు వీడియో చేసిన త‌ర్వాత కామెంట్ సెక్ష‌న్ హైడ్ చేసుకోవ‌చ్చు. అంటే 30 స్పెసిఫిక్ వ‌ర్డ్స్‌ని ఈ కామెంట్‌లో  ఎలో చేయ‌చ్చు. ఆ వ‌ర్డ్స్ లేక‌పోతే కామెంట్ ఫీల్ట‌ర్ అయిపోతుంది.  ఎవ‌రు కామెంట్ చేయాలి అనేది కూడా మీరు ఆప్ష‌న్ సెట్ చేసుకోవ‌చ్చు. ఇందుకోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఎవ్రీ వన్ లేదా ఫ్రెండ్స్ మాత్ర‌మే ఆప్ష‌న్‌ను క్లిక్ చేసుకోవాలి. 

జన రంజకమైన వార్తలు