ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువమంది ఉపయోగిస్తున్న సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లు ఏమంటే ఫేస్‌బుక్, ట్విటరే. ఐతే వినియోగదారులు, ఆదాయాన్ని లెక్కలోకి తీసుకుంటే ట్విటర్ కంటే ఫేస్‌బుక్ ముందంజలో నిలుస్తుంది. కానీ ఫీచర్లు, ఉపయోగాలను బట్టి ఫేస్‌బుక్ కంటే ట్విటరే ఉత్తమమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద ఫేస్‌బుక్ కంటే ట్విటరే పది రెట్లు మేలని వారు చెబుతున్నారు. 1. మీకు ఇష్టమైన సెలెబ్రెటీలకు దగ్గరవొచ్చు ఫేస్‌బుక్ ఓపెన్ చేస్తే చాలు ఎన్నో ఫేస్ అకౌంట్లు. ఏది నిజమైన అకౌంటో తెలియని స్థితి. కానీ ట్విటర్‌లో ఈ ఇబ్బంది ఉండదు. మనకు ఇష్టమైన సెలెబ్రెటీలను ట్విటర్ ద్వారా దగ్గరవొచ్చు. సెలెబ్రెటీలకు వెరిఫైడ్ అకౌంట్లు ఇవ్వడంతో నకిలీ అకౌంట్ల గొడవ ఉండదు. అంతేకాదు వారితో నేరుగా చాట్ చేయడం, మన అభిప్రాయాలు వెల్లడించడం చాలా సులభంగా ఉంటుంది. జస్టిన్ బీబర్, వేన్ రూని, లేడీ గాగా లాంటి సెలెబ్రెటీలకు ఫేస్‌బుక్ అకౌంట్ల కంటే ట్విటర్ అకౌంట్ల ద్వారానే ఎక్కువమంది అభిమానులు ఫాలో అవుతున్నారు. 2. లాగిన్ కాకుండానే సమాచారం మనకు నచ్చిన సెలెబ్రెటీల గురించిన సమాచారాన్ని మనం ట్విటర్ అకౌంట్‌లోకి లాగిన్ కాకుండానే తెలుసుకోవచ్చు. ట్విటర్ అకౌంట్ హోం పేజీలోనే సెలెబ్రెటీల సమాచారం ఉంటుంది. మనం వారికి ఫ్రెండ్స్ కాకపోయినా కూడా వారి గురించి వివరాలు తెలుసుకోవచ్చు. ప్రొటెక్టడ్ అకౌంట్లను వదిలేస్తే సెలెబ్రెటీల గురించి సమాచారం తెలుసుకోవడం చాలా సులభం. కానీ ఫేస్‌బుక్‌లో లాగిన్ అయితేనే మనం ఏదైనా సమాచారం పొందగలం. 3. ట్విటర్ లిస్టులు ట్విటర్‌లో ఉండే లిస్టు ఆప్షన్ ద్వారా మనకు అవసరమైన సమాచారాన్ని కేటగిరిల వారీగా విభజించుకోవచ్చు. కేటగిరిలకు తగ్గట్టు ట్వీట్లు చేయచ్చు. ఫ్యామిలీ, స్నేహితులు, కోలిగ్స్ ఇలా రకరకాల లిస్టులు మనం రూపొందించుకోవచ్చు. ఈ లిస్టులు మన టైమ్‌లైన్‌లోనే కనబతాయి. అవసరమైతే మన లిస్టులో సమాచారం షేర్ కూడా చేయచ్చు. 4. బ్రేకింగ్ న్యూస్ కావాలంటే.. అప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలని అందరికి ఉంటుంది. దీనికి ట్విటర్‌ను మించింది మరొకటి దొరకదు. ట్విటర్‌లో వచ్చినంత వేగంగా బ్రేకింగ్ న్యూస్ ఫేస్‌బుక్‌లో రావు. అన్ని వార్తా సంస్థలు ప్రత్యేకమైన ట్విటర్ అకౌంట్ల ద్వారా ఎప్పటికప్పుడు అప్‌డౌట్ న్యూస్ అందిస్తున్నాయి. అంతేకాదు సెలెబ్రెటీల సమాచారాన్ని వెంట వెంటనే తెలుసుకోవడానికి ట్విటర్ ఎంతో ఉపయోగపడనుంది. 5. మనకు కావాల్సినవి మాత్రమే.. ఫేస్‌బుక్‌లో న్యూస్‌ఫీడ్‌కు అంతు ఉండదు. న్యూస్ వరదలా పారుతుంది. ఒకే విషయం పదే పదే షేర్ అవుతుంది. కానీ ట్విటర్‌లో ఈ విషయంలో చాలా పొదుపు ఉంటుంది. దీన్ని ఉపయోగించివారు ఎక్కువ తెలివి తేటలపైనే ఆధారపడతారు. తక్కువ మాటల్లో ఎక్కువ సమాచారాన్ని తెలియజేడానికి ప్రయత్నిస్తారు. దీంతో న్యూస్‌తో పాటు ఫొటోలు, వీడియోలు విపరీతంగా షేర్ కావు. 6. వైవిధ్యం ఫేస్‌బుక్‌తో పోలిస్తే ట్విటర్ వైవిధ్యంగా ఉంటుంది. మనకు నచ్చినవాళ్లను ఫాలో కావచ్చు. వారికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ట్విటర్‌లో ఉద్యోగాన్వేషణ చేయచ్చు. రెస్టారెంట్ల సమాచారం, నచ్చిన మ్యూజిక్, ఇష్టమైన వ్యక్తులు, కళలు ఇలా రకరకాల విషయాల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. 7. హాష్ ట్యాగ్ పవర్ ట్విటర్‌లో ఉన్న మరో ఆప్సన్ హాష్‌ట్యాగ్. దీంతో మనకు కావాల్సిన సమాచారాన్ని స్పష్టంగా, నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. హ్యాష్‌టాగ్ కొట్టి మనకు ఏం కంటెంట్ కావాలో సెర్చ్ చేస్తే ఆ కంటెంట్‌కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని మనం పొందొచ్చు. అంతేకాదు హాష్‌ట్యాగ్ ద్వారా నిర్థిష్టమైన వ్యక్తుల సమాచారాన్ని మనం పొందొచ్చు. 8. క్రీడల, టెలివిజన్ సమాచారం ట్విటర్‌లో చాలా వేగంగా అప్‌డేట్స్ తెలుసుకోవచ్చు. దీనిలో అన్నిటికంటే కీలకం క్రీడా వార్తలే. ఒలింపిక్స్, ప్రపంచకప్ లాంటి మెగా ఈవెంట్లు జరుగుతున్నసమయంలో ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ తెలుసుకోవడానికి ట్విటర్ ఎంతో ఉపయోగపడుతుంది. దీనికి హ్యష్‌ట్యాగ్ ఆప్షన్ కూడా తోడైతే కచ్చితమైన సమాచారాన్ని పొందొచ్చు 9. పాత సమాచారం తెలుసుకోవచ్చు కొన్నేళ్ల క్రితం మనం పోస్టు చేసిన సమాచారాన్ని కూడా తెలుసుకోవడం ట్విటర్‌లో చాలా సులభం. మనకు కావాల్సిన సమాచారాన్ని సెర్చ్ చేసుకోవచ్చు. దీని వల్ల వందల పోస్టులను మనం వెతక కుండానే సమాచారాన్ని తెలుసుకోవచ్చు. 10. ట్విటర్ యాడ్ ఆన్స్ ట్విటర్‌లో మరో ఉపయోగపడే అంశం ట్విటర్ యాడ్ ఆన్స్. వేగవంతమైన న్యూస్ అలెర్ట్స్ కోసం, బుక్ రికమండేషన్స్ కోసం యాడ్ ఆన్స్ ఆప్షన్‌ను ఉపయోగించొచ్చు. దీని వల్ల మనకు కావాల్సిన అంశాలను సులభంగా, వేగంగా తెలుసుకోవచ్చు. |