ప్రస్తుతం ఉన్న అన్ని ప్రముఖ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం లలో టాప్ ప్లేస్ లో ఉండేది ఆండ్రాయిడ్ అనడం లో సందేహం లేదు. దీనికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ముఖ్యమైన కారణం మాత్రం ఆండ్రాయిడ్ లో ఉండే అద్భుత మైన పవర్ ప్యాక్డ్ ఫీచర్ లు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే డివైస్ ను మీకు నచ్చిన రీతిలో కస్టమైజ్ చేసుకునే అవకాశాన్ని ఇది కల్పిస్తుంది. కాబట్టి ఈ ఆండ్రాయిడ్ ఫోన్ మీ చేతిలో ఉంది కొన్ని యాప్ లను డౌన్ లోడ్ చేసుకుని ఉంటె మీరు ఒక అద్భుతమైన అనుభూతిని పొందవచ్చు అనేది అందరూ ఒప్పుకునే అంశం. అయితే ఆండ్రాయిడ్ లో ఇన్ని ప్రత్యేకత లు ఉన్నప్పటికీ ఇందులో ఉండే అనేక అద్భుత ఫీచర్ ల గురించి చాలామందికి తెలియదు. ఆండ్రాయిడ్ లో ఉండే ఈ అద్భుత ఫీచర్ ల గురించి ఈ రోజు ఆర్టికల్ లో ఇస్తున్నాం, చదివిఉ వాటిని మీ ఫోన్ లో ట్రై చేసి అద్భుతమైన ఆండ్రాయిడ్ అనుభూతిని పొందండి.