మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌కు ఎంత ఆదరణ ఉందో వేరే చెప్పక్కర్లేదు. అయితే దీనిలో ఉన్న చిక్కల్లా వర్డ్ లిమిటే. మొన్నటి వరకు 140 క్యారెక్టర్ల లిమిట్ ఉండేది. దాన్ని 280 క్యారెక్టర్లకు పెంచింది. అయితే యూజర్లందరికీ ఇంకా ఈ ఫీచర్ అందుబాటులోకి రాలేదు. ఇదిలా ఉంటే ఇద్దరు ఔత్సాహిక యూజర్లు ఏకంగా 35వేల క్యారెక్టర్లతో ట్వీట్ చేసి సంచలనం సృష్టించారు.
ఇదీ ట్వీట్
గత వారాంతంలో 35 వేల క్యారెక్టర్లతో ఇద్దరు వ్యక్తులు ఓ పెద్ద వ్యాసం లాంటి ట్వీట్ చేశారు. @Timrasett and @HackneyYT పేరుతో మేం ట్విట్టర్ క్యారెక్టర్ లిమిట్‌ను దాటి ట్వీట్ చేశాం. మీకు నమ్మకం కలగతకపోతే ఈ 35వేల క్యారెక్టర్ల ప్రూఫ్ చూడండి. అని ట్వీట్ మొత్తాన్ని ట్వీట్ చేశారు. దీంతో వెంటనే ట్విట్టర్ వారిద్దరి అకౌంట్లను సస్పెండ్ చేసింది. తర్వాత దాన్ని ఎత్తేసిందనుకోండి.
ఎలా సాధ్యమైంది?
ఏకంగా 35వేల క్యారెక్టర్లతో ట్వీట్ ఎలా చేశారో మాత్రం వారిద్దరూ చెప్పలేదు. అయితే మరో యూజర్ ఆ సీక్రెట్‌ను చెప్పేశారు. మెయిన్ బాడీని ఒక యూఆర్ఎల్‌లా ట్వీట్ చేశారు. అంటే www. అని స్టార్ట్ చేసి ఎక్కడా స్పేస్ ఇవ్వకుండా 35వేల క్యారెక్టర్లను టైప్ చేసి చివరకు.ccతో ఎండ్ చేశారు. అంటే ఇదంతా ఒకటే యూఆర్ఎల్ అయింది. అందులో ఎన్నిక్యారెక్టర్లున్నా మధ్యలో స్పేస్ లేని యూఆర్ఎల్ కాబట్టి ట్విట్టర్ దాన్ని సింగిల్ క్యారెక్టర్‌గానే తీసుకుంది. కావాలంటే మీరు కూడా చూసి చూడొచ్చు. అయితే ఇలా చేస్తే ట్విట్టర్ మీ అకౌంట్‌ను సస్పెండ్ చేయడం ఖాయం.