స్మార్ట్ ఫోన్ తయారీదారులు నిరంతరం తమ తమ ఉత్పత్తులను అప్ గ్రేడ్ చేస్తూ వస్తున్నారు. స్మార్ట్ ఫోన్ లు వచ్చినప్పటినుండీ ఇప్పటివరకూ చూసుకుంటే వీటిలో అనేకరకాల మార్పులు వచ్చాయి. మార్కెట్ లో అత్యుత్తమ హార్డ్ వేర్ ను అందించాలనే కోరికతో ఏ కంపెనీలు తమ ఫోన్ లను నిరంతరం అప్ డేట్ చేస్తూ ఉంటాయి.ప్రస్తుతం 6 GB RAM మరియు అత్యంత పవర్ ఫుల్ ప్రాసెసర్ లను కలిగిఉన్న స్మార్ట్ ఫోన్ లను మనం చూస్తూ ఉన్నాము. అయితే అదే సమయంలో తయారీదారులు స్మార్ట్ ఫోన్ ల యొక్క సైజు ని తగ్గిస్తూ వస్తున్నారు. అందంగా మరియు ట్రెండీ గా ఉండడానికి కూడా తయారీదారులు స్లిమ్ ఫోన్ లను అందిస్తున్నారు. దీనివలన స్మార్ట్ ఫోన్ లలో హీట్ మేనేజ్ మెంట్ అనేది విఫలం అవుతూ అక్కడక్కడా ఫోన్ లు పేలిపోవడం, ఫోన్ లు సరిగా పనిచేయకపోవడం మనం చూస్తూనే ఉన్నాము. అందువలనే ఎవరి ఆండ్రాయిడ్ ఫోన్ అయినా వేడెక్కడం ప్రారంభిస్తే వెంటనే ఆందోళన మొదలవుతుంది. అసలు ఆండ్రాయిడ్ ఫోన్ లు ఎందుకు వేడెక్కుతాయి? అలా వేడెక్కకుండా ఉండాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలను ఈ ఆర్టికల్ లో చూద్దాం.
ఆండ్రాయిడ్ ఫోన్ లలో ఓవర్ హీటింగ్ కు కారణాలు ఏవి?
ఈ ఆర్టికల్ లో ఆండ్రాయిడ్ పరికరాలు అని ప్రస్తావించినప్పటికీ ఈ కారణాలు దాదాపుగా అన్ని స్మార్ట్ ఫోన్ లకూ మరియు టాబ్లెట్ లకూ వర్తిస్తాయి.
⦁ రీఛార్జి చేసేటపుడు మీ ఫోన్ పై పడే ఒత్తిడి
చాలా మంది స్మార్ట్ ఫోన్ లో గేమ్ లు ఆడుతూ ఛార్జింగ్ పోర్ట్ కు కనెక్ట్ చేసి ఉంటారు. ఇదిచాలా తప్పు. ఎందుకంటే గేమ్ లను ఆడేటపుడు సాధారణం గానే ప్రాసెసర్ మరియు మదర్ బోర్డు పై ఒత్తిడి పడి ఫోన్ హీట్ అవుతూ ఉంటుంది. ఛార్జింగ్ చేసేటపుడు కూడా ఫోన్ వేడెక్కడం మనం గమనిస్తూ ఉంటాము. ఇక ఈ రెండు పనులూ ఒకేసారి చేస్తే ఎంత వేడి పుడుతుందో మీరే ఊహించండి. కాబట్టి ఛార్జింగ్ చేస్తూ గేమ్ లను ఆడితే మీ ఫోన్ యొక్క ప్రాసెసర్ మరియు మదర్ బోర్డు పై తీవ్ర ఒత్తిడి పెరిగి వేడెక్కుతుంది.
⦁ అధికంగా గేమ్ లను ఆడడం
పైన పేర్కొన్నట్లు ఎక్కువగా గేమ్ లను ఆడడం వలన ఫోన్ లోని ప్రాసెసర్ మరియు మదర్ బోర్డు ల పై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతుంది. దీనితో సహజం గానే గేమ్ లను ఆడడం వలన ఫోన్ వేడెక్కుతుంది. ప్రత్యేకించి ఫిఫా, మోడరన్ కంబాట్ లాంటి గేమ్ లను ఆడేటపుడు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.
⦁ పరిసరాలు మరియు వాతావరణ ప్రభావం
ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లపై పరిసరాల ప్రభావం చాల ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి వేడి ప్రాంతాలలోకానీ లేదా డైరెక్ట్ గా సూర్య కాంతి కింద గానీ ఆపరేట్ చేసేటపుడు ఇవి తొందరగా వేడెక్కుతాయి. కార్ డాష్ బోర్డు లాంటి ప్రదేశాలలో వీటిని ఉంచడం కూడా అంత శ్రేయస్కరం కాదు. మీ ఆండ్రాయిడ్ ఫోన్ ఓవర్ హీట్ అవుతూ ఉన్నపుడు ఒక్కసారి పరిసరాల శీతోష్ణస్థితి ని కూడా పరిగణన లోనికి తీసుకోవడం మంచిది.
⦁ అస్థిరమైన ఛార్జింగ్
మీ ఫోన్ అత్యుత్తమ బాటరీ లైఫ్ ను కలిగి ఉన్నా సరే అదే పనిగా ప్రతీ రోజూ ఛార్జింగ్ పెడుతూ ఉంటే అది మీ బాటరీ ని విపరీతంగా తినేస్తుంది. ఇది బాటరీ లైఫ్ ని తగ్గించడమే గాక అంతర్గతంగా మీ ఫోన్ యొక్క పనితీరును నాశనం చేస్తుంది. ఒకవేళ మీ ఫోన్ బాటరీ తొందరగా అవుతూ ఉంటె రోజుకి రెండు సార్లు కి మించి ఛార్జింగ్ పెట్టకూడదు.
“ *#*#4636#*#* “ ను డయల్ చేసి బాటరీ ఇన్ఫర్మేషన్ పై టాప్ చేయడం ద్వారా మీరు మీ బాటరీ స్టేటస్ ను తెలుసుకోవచ్చు.
మరి ఈ ఓవర్ హీటింగ్ సమస్య నుండి బయటపడేదెలా?
⦁ అన్నీ ఒకేసారి పనిచేయకుండా చూడాలి.
అనేక రకాల యాప్ లు బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవకుండా చూడాలి.లొకేషన్ సర్వీస్ లను హైయెస్ట్ యాక్సెస్ లెవెల్ కు సెట్ చేయడం, 4 జి డేటా కనెక్షన్ లేదా వైఫై హాట్ స్పాట్ oఆన్ లో ఉండడం , బ్లూ టూత్ కనెక్ట్ అయి ఉండడం ఇలాంటివి అన్నీ ఒకేసారి ఆన్ అయి ఉంటె గనుక మీ ఫోన్ ను దేవుడు కూడా కాపాడలేడు. కాబట్టి ఇవన్నీ ఒకేసారి ఆన్ అవకుండా చూసుకోవాలి. వైబ్రేషన్ మోడ్ లో కూడా ఎక్కువ సేపు ఉంచకూడదు. వైబ్రేషన్ అంటే ఫోన్ లో ఉండే ఒక చిన్న మోటర్ ఆన్ అవుతుంది. ఆ మోటర్ తిరిగే కొద్దీ దానికనుగుణంగా ఫోన్ కూడా వేడెక్కుతుంది. బ్రైట్ నెస్ అనేది మరొక అంశం. మీ ఫోన్ తొందరగా వేడెక్కకుండా ఉండాలి అంటే బ్రైట్ నెస్ ను వీలైనంత తగ్గించుకోవాలి. ఇవన్నీ చేయడం వలన మీ ఫోన్ యొక్క ప్రాసెసర్ పైఒత్తిడి తగ్గి బాటరీ తొందరగా వేడెక్కకుండా ఉంటుంది.
⦁ DU ఫోన్ కూలర్ ద్వారా చెత్త యాప్ లను గుర్తించి తొలగించండి.
ఇది ఒక ఆండ్రాయిడ్ అప్లికేషను. ఉచితంగానే లభిస్తుంది. మీ స్మార్ట్ ఫోన్ ను తొందరగా వేడెక్కించే యాప్ లను గుర్తించి వాటిని డిలీట్ చేసే ఆప్షన్ ను కల్పిస్తుంది. ఇది పూర్తిగా తగ్గించలేక పోవచ్చు కానీ వీలైనంత మాత్రం ఖచ్చితంగా తగ్గిస్తుంది. కనీసం 6 డిగ్రీల టెంపరేచర్ ను మీ ఫోన్ లో తగ్గిస్తుంది.
⦁ మీ ఫోన్ డి మెటల్ బాడీ నా లేక ప్లాస్టిక్ బాడీ నా?
మెటల్ బాడీ ని కలిగిఉన్న ఫోన్ లు తొందరగా వేడెక్కడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీ ఫోన్ కనుక మెటల్ బాడీ ని కలిగి ఉంటె దానికి ఒక ప్లాస్టిక్ కవర్ ను తొడుగుగా ఉంచడం మంచిది.
⦁ రూటింగ్
ఆండ్రాయిడ్ లో ఓవర్ హీటింగ్ కు రూటింగ్ అనేది ఖచ్చితంగా ఒక మంచి పరిష్కారం కాగలదు. కానీ అన్నింటికీ ఇదే పరిష్కారం కాదు. ఈ రూటింగ్ ద్వారా మీ CPU పై పడే ఒత్తిడిని వీలైనంత తగ్గించవచ్చు.ఒకవేళ సాఫ్ట్ వేర్ సమస్య వలన వేడెక్కడం జరుగుతూ ఉంటె ROM ఇన్స్టలేషన్ వలన ఆ సమస్యను పరిష్కరించవచ్చు.
⦁ మీ స్మార్ట్ ఫోన్ /టాబ్లెట్ ను క్లీన్ చేసుకోండి.
ఒక్కోసారి మీ ఫోన్ లోనికి వెళ్ళే చిన్ న చిన్న దుమ్ము ధూళి కణాల వలన మైక్రోఫోన్, ఫ్యాన్ లాంటి వాటి పనితీరుకువిఘాతం ఏర్పడి వేడెక్కడం లాటివి జరుగవచ్చు. కాబట్టి ఇలా జరుగుతుందేమో అనిపించినపుడు మీ దగ్గరలోని సర్వీస్ సెంటర్ కు వెళ్లి ఒక్కసారి క్లీన్ చేయించడం ఉత్తమం.
⦁ స్విచ్ ఆఫ్ చేయండి.
మీరెప్పుడైనా రోజు మొత్తం మీ ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసి ఉంచారా? అదేంటి ఫోన్ కొనేది స్విచ్ ఆఫ్ చేయడానికా? అనుకుంటున్నారు కదా! రోజులో చాలా సార్లు మనకు అసలు ఫోన్ అవసరం లేని సందర్భాలు ఉంటాయి. అలాంటపుడు ఊరికే దానిని అలా ఉంచే బదులు స్విచ్ ఆఫ్ చేయడం వలన దాని లైఫ్ టైం పెరుగుతుంది. సకల సమస్యల నుండి బయటపడుతుంది.
చూశారుగా. మన ఆండ్రాయిడ్ ఫోన్ వేడెక్కడానికి ఇవీ కారణాలు మరియు వాటి పరిష్కారాలు. ఇకపై మీ ఆండ్రాయిడ్ ఫోన్ వాడేటపుడు వీటిని దృష్టి లో ఉంచుకుని వాడండి. ఓవర్ హీటింగ్ సమస్య నుండి బయటపడండి.