• తాజా వార్తలు

మీ ఆండ్రాయిడ్ ఫోన్ ని వేగవంతంగా చేయడానికి ఏం చేయొచ్చు ఏం చేయకూడదు

 

మన ఫోన్ లు వేగవంతంగా ఉంటే బాగుండు అని అందరమూ అనుకుంటాము కదా! ఎందుకంటే మన స్మార్ట్ ఫోన్ కొన్నపుడు బాగానే ఉంటుంది. కానీ పోనుపోనూ దాని పనితీరులో తేడా స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వాటి గురించి ఇంతకుముందే మనం అనేక ఆర్టికల్ లలో చదువుకున్నాము.అయితే మన ఆండ్రాయిడ్ ఫోన్ వేగవంతంగా పనిచేయాలి అంటే మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? ఏం చేయాలి? ఏం చేయకూడదు తదితర విషయాలను ఈ ఆర్టికల్ లో నేర్చుకుందాం.

ఏం చేయాలి:

బేసిక్స్:-ఆండ్రాయిడ్ ఫోన్ లలో ఉండే డిఫాల్ట్ యాప్ లు గానీ సెట్టింగ్ లు కానీ ఏమంత ఫాస్ట్ గా ఉండవు.వీటికి చిన్న చిన్న మార్పులను చేయడం ద్వారా మీ ఆండ్రాయిడ్ ఫోన్ ను మరింత వేగంగా పనిచేసేట్లు మార్చుకోవచ్చు.

మీ హోం స్క్రీన్ ను క్లీన్ చేయండి:-  మీ ఫోన్ తక్కువ రామ్ తో పనిచేసేది అయితే మీ హోం స్క్రీన్ ను వీలైనంత ఖాళీగా ఉంచడం ఉత్తమమ. లైవ్ వాల్ పేపర్ లు, విడ్జెట్ లు లు లాంటివి బ్యాక్ గ్రౌండ్ లో కూడా రన్ అవుతూ ఉంటాయి కాబట్టి హోం స్క్రీన్ పై లనటివి లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి.

డిఫరెంట్ లాంచర్ ను ఉపయోగించండి: మీ ఫోన్ తో పాటు డిఫాల్ట్ గా వచ్చే లాంచర్ ఫోన్ కు తగినట్లు డిజైన్ చేయబడి ఉంటుంది. కాబట్టి సాధారణంగా ఇది నెమ్మదిగా ఉండే అవకాశం ఉంటుంది. అలాకాకుండా వేరే ప్రత్యేకమైన లాంచర్ లను ఉపయోగిస్తే అవి మీ ఆండ్రాయిడ్ ను మరింత వేగంగా పనిచేయించగలవు. నేడు అనేకరకాల లాంచర్ లు ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్నాయి.

బ్రౌజర్ లను మార్చండి :-  ఆండ్రాయిడ్ కు డిఫాల్ట్ బ్రౌజర్ గా చరో,మే లభిస్తుంది. ఇది మిగతా వాటితో పోలిస్తే కొంచెం హెవీ గా ఉండే యాప్. కాబట్టి కొన్ని చిన్న చిన్న మార్పులను చేయడం ద్వారా కానీ లేక వేరే బ్రౌజర్ ను వాడడం ద్వారా కానీ మీ ఫోన్ ను వేగంగా మార్చవచ్చు. ఓపెరా, యు సి లాంటి బ్రౌజర్ లను ఉపయోగించవచ్చు.

చెత్త యాప్ లను అన్ ఇన్ స్టాల్ చేయండి :- మన ఫోన్ లలో ఉండే కొన్ని చెత్త యాప్ లు ఫోన్ యొక్క పనితీరుకు ఆటంకం కలిగిస్తూ ఫోన్ నెమ్మదిగా పనిచేసేట్లు చేస్తాయి. వాటిని పూర్తిగా తొలగించడం ద్వారా మీ ఫోన్ ను వేగవంతం చేయవచ్చు. వీటిలో ప్రముఖమైనవి స్నాప్ చాట్ మరియు ఫేస్ బుక్ లు. వీటిని యాప్ లలో వాడే బదులు వెబ్ లో వాడడం వలన మీ ఫోన్ దెబ్బతినకుండా ఉంటుంది.

యాంటి వైరస్ సాఫ్ట్ వేర్ ను రిమూవ్ చేయండి :-   ఆండ్రాయిడ్ వినియోగదారులు కావాలనే తమ ఫోన్ లలో ఈ యాన్తి వైరస్ సాఫ్ట్ వేర్ లను ఇన్ స్టాల్ చేసుకుంటారు. వీటివలన కొంత ప్రయోజనం ఉన్నప్పటికీ ఇవి ఫోన్ నెమ్మదించడానికి కారణం అవుతాయి. కాబట్టి పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు వీటిని అన్ ఇంస్టాల్ చేసుకోవడమే ఉత్తమం.

ఆటో సింకింగ్ యాప్ లను ఆపి వేయండి.:- సోషల్, వెదర్, న్యూస్ ఇలా అనేకరకాల యాప్ లు ఒక రిమోట్ సర్వర్ ద్వారా ఆటోమాటిక్ గా మన ఫోన్ లోనికి వస్తూ ఉంటాయి. వీటిని గమనిస్తూ ఎప్పటికప్పుడు అపివేస్తూ ఉండాలి. లేనిపక్షం లో మీ ఫోన్ యొక్క పనితీరును గణనీయంగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి వీటిని తరచుగా గమనిస్తూ మన ఫోన్ లోనికి రాకుండా చూడాలి.

రెగ్యులర్ గా రీ బూట్ చేయాలి:   తరచుగా మన ఫోన్ ను రీ బూట్ చేయడం వలన కూడా ఫోన్ వేగంగా పనిచేసేట్లు చేసుకోవచ్చు.

 ఇవి కాకుండా మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కూడా మన ఆండ్రాయిడ్ ఫోన్ ను పరిగెత్తించవచ్చు. అవి

  1. యానిమేషన్ లను స్పీడ్ అప్ చేయడం
  2. డిఫరెంట్ ROM ను ట్రై చేయడం
  3. కస్టమ్ కెర్నల్ ను ఉపయోగించడం
  4. బ్యాక్ గ్రౌండ్ యాప్స్ ను గ్రీనిఫై యాప్ ద్వారా కంట్రోల్ చేయడం
  5. టాస్క్ కిల్లర్ లను తీసివేయడం
  6. స్పీడ్ బూస్టర్ లను ఉపయోగించకుండా ఉండడం

 

జన రంజకమైన వార్తలు