స్మార్ట్ ఫోన్ లను ఉపయోగించడం ఎంత ఆవశ్యకం అయిందో వాటి స్క్రీన్ ను కాపాడుకోవడం అనేది కూడా అంతే ముఖ్యమైన అంశం.స్మార్ట్ ఫోన్ ల యొక్క స్క్రీన్ లను ప్రొటెక్ట్ చేయడానికి అనేక రకాల స్క్రీన్ ప్రోటేక్టర్ లు నేడు అందుబాటులో ఉన్నాయి. అయితే అవి ఎంతవరకూ అవసరం అనే ప్రశ్న కూడా ఉంది. ఈ స్క్రీన్ ప్రోటేక్టర్ లు అన్నీ స్మార్ట్ ఫోన్ యొక్క స్క్రీన్ ను మచ్చలు, మరకలు లాంటివి పడకుండా మరియు మన చేతిలో నుండి క్రింద పడినపుడు డ్యామేజ్ అవకుండా కాపాడతాయి. అయితే ప్రస్తుతం వస్తున్న డివైస్ లన్నీ వీలైనంత దృడం గానూ గట్టిగానూ వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ తయారీదారులు కూడా డివైస్ లను అల్యూమినియం బాడీ తోనూ మరియు యూని బాడీ ఫ్రేమ్ తోనూ తయారు చేస్తున్నాయి. తద్వారా క్రిందపడినా కూడా ఫోన్ లకు ఏ విధమైన నష్టం జరగకుండా ఉంటుంది. గొరిల్లా గ్లాస్ లు కూడా స్మార్ట్ ఫోన్ ల యొక్క స్క్రీన్ ను పరిరక్షించడం లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. హై ఎండ్ గొరిల్లా గ్లాస్ ను ఉపయోగిస్తే ఇది ఎంత గట్టిగా ఉంటుందంటే దానిని బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యం. అయితే దీనిని వాడడం వలన మన ఫోన్ యొక్క ఒరిజినల్ లుక్ లో కొంచెం మార్పు వస్తుందనేది మాత్రం వాస్తవం. మరి ఫోన్ యొక్క లుక్ చెడకుండా మన ఫోన్ స్క్రీన్ ను పటిష్టం గా ఉంచేవి ఏవైనా ఉన్నాయా? ఈ విషయంపై ఒక విశ్లేషణ ను ఈ ఆర్టికల్ లో చూద్దాం.
అసలు స్క్రీన్ ప్రోటేక్టర్ లు అవసరమా?
ఖచ్చితంగా అవసరమే.స్మార్ట్ ఫోన్ స్క్రీన్ ను రక్షించుకోవడం లో స్క్రీన్ ప్రోటేక్టర్ అను వాడడం అనేది చాలా ముఖ్యమైన అంశం. గొరిల్లా గ్లాస్ కాకుండా మీ ఫోన్ క్రింద పడినపుడు చిన్న చిన్న డ్యామేజ్ లు జరగకుండా ఉండడానికి అదనపు ప్రోటేక్టివ్ లేయర్ లను వాడడం కూడా మంచిది. ప్రస్తుతం మార్కెట్ లో వివిధ రకాల స్క్రీన్ ప్రోటేక్టర్ లు అందుబాటులో ఉన్నాయి.వాటిలో ప్లాస్టిక్ మరియు టెంపర్ద్ గ్లాస్ లనేవి ప్రముఖమైనవి.
ప్లాస్టిక్ స్క్రీన్ ప్రోటేక్టర్ లు
ప్లాస్టిక్ స్క్రీన్ ప్రోటేక్టర్ లు స్క్రీన్ కు బేసిక్ లెవెల్ ప్రొటెక్షన్ ను అందిస్తాయి. దుమ్ము, ధూళి, నూనెలు లాంటి వాటినుండి ఇవి మన స్మార్ట్ ఫోన్ స్క్రీన్ ను పరిరక్షిస్తాయి. అయితే వీటిని నిపుణుల సమక్షం లోనే మన ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోవాలి. దీనిని ఇన్ స్టాల్ చేసేముందు లోపల ఏ విధమైన గాలి లేకుండా చూసుకోవాలి. డిస్ప్లే క్వాలిటీ, షార్ప్ నెస్ లాంటివి కొద్దిగా తగ్గే అవకాశం ఉంది.
టెంపర్ద్ గ్లాస్ స్క్రీన్ ప్రోటేక్టర్ లు
స్మార్ట్ స్క్రీన్ ప్రోటేక్టర్ లలో ఇది ఒక ఉత్తమ ఎంపిక గా చెప్పుకోవచ్చు. ప్లాస్టిక్ గ్లాస్ ల కంటే ఇది అత్యుత్తమ పనితీరును ప్రదర్శిస్తుంది. ప్లాస్టిక్ కేవలం దుమ్ము, ధూళి లాంటి వాటికే పరిమితం అయితే ఇది మరింత రక్షణ నిస్తుంది. ఒకవేళ మీ ఫోన్ చేతిలో ఉంది జారిపోయి క్రింద పడినపుడు ఫోన్ కు దెబ్బ తగలకుండా ఇవి కాపాడుతాయి. ఇవి మీ ఫోన్ కు ఒక అదనపు స్క్రీన్ గా ఉపయోగపడతాయి. ఇవి వివిధ రకాల మందాలలో లభిస్తాయి. దీనిని క్లీన్ చేయడం కూడా చాలా సులువు. ఒక పొడి గుడ్డ తీసుకుని దీనిని శుభ్రం చేయవచ్చు.
వీటిలో మీ అవసరానికి తగ్గట్లు ఎదో ఒకదానిని ఎంచుకోవచ్చు.
బంపర్ కేసు లను ఎంచుకోవడం
మీ స్మార్ట్ ఫోన్ ఒకవేళ చేయిజారి క్రింద పడింది అనుకోండి. ఫోన్ యొక్క అంచులు చిట్లి పోయి తద్వారా స్క్రీన్ కూడా పాడైపోతుంది. ఇలాంటి సమస్యలనుండి బంపర్ స్క్రీన్ కేసు ను వాడడం ద్వారా బయటపడవచ్చు. కేవలం స్క్రీన్ ను మాత్రమే గాక ఫోన్ యొక్క అంచులను కూడా ఇది కాపాడుతుంది.
టెంపర్ గ్లాస్ లు మరియు బంపర్ కేస్ లు రెండింటినీ కలిపి ఉపయోగిస్తే మీ ఫోన్ కు మరింత రక్షణ ఉంటుంది దానితో పాటు మీ ఫోన్ యొక్క లుక్ కూడా చెడకుండా ఉంటుంది.
"
"