• తాజా వార్తలు

వాట్స్ అప్ న్యూ ప్రైవసీ పాలసీ - మనందరం తెలుసుకోవలసిన 10 ముఖ్యమైన విషయాలు...

వాట్స్ అప్ న్యూ ప్రైవసీ పాలసీ

మనందరం తెలుసుకోవలసిన 10 ముఖ్యమైన విషయాలు

ప్రముఖ చాటింగ్ ప్లాట్ ఫాం అయిన వాట్స్ అప్ తన గ్లోబల్ ప్రైవసీ పాలసీని అప్ డేట్ చేసింది. దీని ప్రకారం మీరు మీ ఫోన్ నెంబర్ లను ఫేస్ బుక్ లో కూడా షేర్ చేసుకోవచ్చు. ఆ వివరాలు చూద్దాం.

  1. వాట్స్ అప్ వినియోగ దారుల ఎకౌంటు వివరాలైన ఫోన్ నెంబర్, మీరు వాడుతున్న స్మార్ట్ ఫోన్ యొక్క ఆపరేటింగ్ సిస్టం మరియు ఇతర వివరాలను తన మాతృసంస్థ అయిన ఫేస్ బుక్ తో పంచుకోనుంది. తద్వారా ఎకౌంటు లను కో ఆర్డినేట్ చేయనుంది.
  2. దీని వలన ఫేసు బుక్ కు తన సొంత ఫ్లాట్ ఫాం పై మరిన్ని అడ్వర్టైజ్మెంట్ లను పొందే అవకాశం ఉంది.
  3. వాట్స్ అప్ లో మాత్రం ఏ విధమైన అడ్వర్టైజ్మెంట్ లు ఉండవు.
  4. వాట్స్ అప్ మెసేజ్ లు ఫేస్ బుక్ లో కానీ థర్డ్ పార్టీ ద్వారా కానీ షేర్ చేయబడవు. వినియోగదారుల వాట్స్ అప్ మెసేజ్ లను ఫేస్ బుక్ ఏ దశలోనూ ఉపయోగించడం జరుగదు.
  5. వాట్స్ అప్ లో కమ్యూనికేషన్ ఎండ్-టు-ఎండ్ ఎన్ క్ర్యిప్షన్ లోనే కొనసాగుతుంది.
  6. వాట్స్ అప్ లో వ్యాపారం అనుమతించబడింది. అంటే మీ ప్రయాణ ఏర్పాట్లకు ఫ్లైట్ లేదా ట్రైన్ టికెట్ లు బుక్ చేయలన్నా లేదా ఏదైనా కొనుగోలు చేయలన్నా వాట్స్ అప్ లో ఎకౌంటు ద్వారా కూడా చేసుకోవచ్చు.
  7. వినియోగదారులకు వచ్చే స్పాం మెసేజ్ లపై వాట్స్ అప్ పూర్తీ దృష్టి ఉంచింది ఒక వేళ అలాంటివి ఏమైనా వస్తే వాటిని బ్లాక్ చేసేయవచ్చు.
  8.  ప్రస్తుత వినియోగదారులు ఈ కొత్త పాలసీ మరియు టర్మ్స్ ను అంగీకరించడానికి 30 రోజుల సమయం ఇవ్వబడింది.
  9. ఒక్కసారి వీటిని అంగీకరించాక ఫేస్ బుక్ తో షేరింగ్ చేయడానికి మరొక 30 రోజులు ఇవ్వబడతాయి.
  10. డేటా కోసం ఫేస్ బుక్ వాట్స్ అప్ ఎకౌంటు లను ఉపయోగించుకుంటుంది అనే విమర్శ లు వస్తున్నాయి కానీ అది నిజం కాదు. వినియోగదారుల అనుమతి లేకుండా వాట్స్ అప్ వారి డేటా ను ఎవరికీ షేర్ చేయదు. అది తన మాతృ సంస్థ తో కాకుండా తన సొంత ప్లాట్ ఫాం పై పనిచేస్తుంది.

 

జన రంజకమైన వార్తలు