• తాజా వార్తలు

వాట్స్ అప్ లో చూసిన ఫోటో లు, వీడియో లు రిపీటెడ్ గా చూడవలసి రావడానికి ఇదే మూల కారణం

మీరు వాట్స్ అప్ ను వాడుతున్నారా? అయితే కొన్నిసార్లు  ఓకే రకమైన ఫోటో లు, వీడియో లు మరియు GIF ఫైల్ లు వివిధ స్నేహితుల నుండీ మరియు గ్రూప్ ల నుండీ ఒకేసారి మీకు రావడం మీరు గమనించే ఉంటారు. ఇలాంటి వాటిని చూసి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కొంతమంది ఎక్కడో ఒక చోట కూర్చుని ఇలాంటి మెసేజ్ లను క్రియేట్ చేసి ఒకేసారి అనేక ఎకౌంటు లకు వెళ్ళే విధంగా చేసి పంపుతూ ఉంటారు. ఇలా జరగడానికి కారణం ఏమిటో తెలుసా? వాటిని ఎవరు పంపుతారో తెలుసా? అయితే ఈ వ్యాసం చదవండి.

ఫేస్ బుక్ యాజమాన్యం లోని వాట్స్ అప్ సుమారు 16 కోట్ల మంది వినియోగదారులను ఇండియా లో కలిగి ఉంది మార్కెటర్ లకు, సోషల్ ఇన్ఫ్లూ ఎన్సర్ లకు మరియు కొన్ని గ్రూప్ లకు టాప్ ఛాయస్ గా తయారు అయింది.  ఏదైనా బ్రేకింగ్ న్యూస్ జరిగినపుడు, లేదా పెద్ద సంఘటన ఏదైనా జరిగినపుడు జోక్ లు, వీడియో లు మరియు GIF ల ద్వారా వాట్స్ అప్ వినియోగదారులకు ఆ న్యూస్ ను చేరవేయడానికి పైన చెప్పుకున్న గ్రూప్ లు ప్రయత్నిస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఫెస్టివల్ సీజన్ లలో కూడా ఇలా జరుగుతూ ఉంటుంది.

పరిశోధకుల ప్రకారం నకిలీ వార్తల ప్రచారానికీ, అసత్య సమాచార వ్యాప్తికి, అడ్వర్టైజ్ పర్పస్ కు వాట్స్ అప్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సుమారుగా 260 స్మార్ట్ ఫోన్ వినియోగదారులను కలిగిఉన్న ఇండియా లో వాట్స్ అప్ ను ఉపయోగించి ఏదైనా విషయాన్ని ప్రచారం చేయడం అనేది ఏమంత కష్టమైన పని కాబోదు. ఇలా వైరల్ మెసేజ్ లను వాట్స్ అప్ ద్వారా విస్తరింప చేయడం అనే పనిని కేవలం ఏ ఒక్కరో చేయలేరు. దీనివెనుక ఒక వ్యవస్థ ఉంటుంది. లేదా అనేక మంది ఒక సిండికేట్ గా ఏర్పడి వైరల్ కాంటెంట్ ను విస్తృతం చేస్తారు. అంటే మనకు వాట్స్ అప్ లో వచ్చే మెసేజ్ ల వెనుక ఇంత తతంగం ఉంటుంది అన్నమాట.

ఇలా వైరల్ కాంటెంట్ ను వాట్స్ అప్ లో షేర్ చేయడం లో రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి కాంటెంట్ మరియు రెండవది ఆబ్జెక్టివ్ .

ఆబ్జెక్టివ్ ల విషయానికొస్తే ఎవరైనా ఈ పని చేయవచ్చు.ఏదైనా ఒక ప్రత్యెక లక్ష్యం తో అది సామాజిక లక్ష్యం కావచ్చు లేదా ప్రజల దృష్టి మళ్ళించడానికి కావచ్చు ఒక లక్ష్యం తో వీటిని స్ప్రెడ్ చేయడానికి అవకాశం ఉంది.

ఇక కాంటెంట్ విషయానికొస్తే సోషల్ మీడియా ఏజెన్సీ లు కానీ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ లు కానీ దీని వెనుక ఉంటాయి. ఇవి న్యూస్ ను వైరల్ గా మార్చి వాట్స్ అప్ లోనికి వదులుతూ ఉంటారు. ఇలా చేయడానికి వీరికి కొంతమంది స్టాఫ్ కూడా ఉంటారు. అది మంచి న్యూస్ నా లేక చెడ్డ న్యూస్ నా అన్న దానితో సంబంధం లేకుండా ప్రతీ విషయాన్నీ వీరు స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. నేడు ఇన్ని రకాల సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం లు ఉన్నప్పటికీ వీరు వాట్స్ అప్ నే ఎంచుకోవడానికి కారణం దేనికి ఉన యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ ఫేస్. ఈ వాట్స్ అప్ వినియోగదారుల మధ్య ఉండే డిగ్రీ ఆఫ్ సపరేషన్ అనేది చాలా తక్కువగా ఉండడం వలన మిగతా సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం లతో పోలిస్తే ఏ విషయం అయినా వాట్స్ అప్ లో వేగంగా వ్యాప్తి చెందుతుంది.

ఫేస్ బుక్ మరియు ఇన్ స్టా  గ్రామ్ లలో కూడా ఇలాంటి వైరల్ న్యూస్ సోరేఅద్ అవుతాయి కానీ  వాట్స్ అప్ కంటే తక్కువ స్థాయిలోనే ఇక్కడ జరుగుతుంది. వీటికి ఉన్న పటిష్ట అల్గోరిథం ఒక కారణం కావచ్చు.

జన రంజకమైన వార్తలు