• తాజా వార్తలు

వాట్స్ అప్ లో గ్రూప్ చాట్ చేయడం ఎలా?

వాట్స్ అప్ లో గ్రూప్ చాట్ చేయడం ఎలా?

సోషల్ మీడియా లో ఉన్న అనేక సాధనాలలో వాట్స్ అప్ ప్రతిహతంగా దూసుకుపోతుంది. మెసేజింగ్ కు ప్రతిఒక్కరూ వాట్స్ అప్ నే వాడుతున్నారు.  మీరు ఏ స్మార్ట్ ఫోన్ను ఉపయోగిస్తున్నారు అనే విషయం తో సంబంధం లేకుండా అందరూ వాట్స్ అప్ ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.ఈ వాట్స్ అప్ ద్వారా మీరు మెసేజ్ లు పంపించవచ్చు, ఇమేజ్ లు పంపించవచ్చు, ఆడియో , వీడియో ఫైల్ లను షేర్ చేయవచ్చు. దీనికి ఉన్న ఇన్ని ప్రత్యేకతల వలననే ఇది ఆ స్థాయిలో ఆదరించబడుతుంది. ఇందులో ఉన్న మరొక ప్రత్యేకత గ్రూప్ చాట్. ఒకేసారి అనేక మంది మీ స్నేహితులతో మీరు గ్రూప్ చాట్ చేయవచ్చు. అది ఎలాగో ఈ ఆర్టికల్ లో చూద్దాం

మీ స్మార్ట్ ఫోన్ లో ఉన్న వాట్స్ అప్ ను ఓపెన్ చేసి మెనూ ఐకాన్ ను క్లిక్ చేసి అక్కడ ఉన్న న్యూ గ్రూప్ ఫై క్లిక్ చేస్తే గ్రూప్ చాట్ ఓపెన్ అవుతుంది.

 

మీ కాంటాక్ట్ లను క్రిందకు స్క్రోల్ చేస్తూ మీరు ఎవరితోనైతే గ్రూప్ చాట్ లో మెసేజ్ చేయాలి అనుకుంటున్నారో వారిని గ్రూప్ కు యాడ్ చేసి నెక్స్ట్ అనే బటన్ పై క్లిక్ చేయండి.

 

మీ గ్రూప్ చాట్ కు సబ్జెక్ట్ ను యాడ్ చేయండి.

 

క్రియేట్ అనే ఐకాన్ పై ట్యాప్ చేయండి ఇక మీ గ్రూప్ చాట్ రెడీ అయినట్లే, మీ ద్వారా పంపబడిన మెసేజ్ ఏదైనా ఆ గ్రూప్ లో ఉన్న అందరికీ పంపబడుతుంది.

మీ స్నేహితులు మీరు మెసేజ్ చదివిన సంగతి తెలుసుకోకుండా ఉండాలంటే ఎలా?

గ్రూప్ చాట్ లో మీరు టర్న్ ఆఫ్ చేసినా సరే మీ మెసేజ్ ను ఎవరెవరు చదివారు అనే విషయాన్నీ యిట్టె తెలుసుకోవచ్చు. ఏదైనా మెసేజ్ పై ఎడమ వైపుకు స్వైప్ చేస్తే చాలు ఆ మెసేజ్ ను ఎవరెవరు చదివిందీ తెలిసిపోతుంది. అలాగే మీరు వారి మెసేజ్ ను చదివిన విషయాన్ని వారికి తెలియకుండా ఇక్కడే మేనేజ్ చేయవచ్చు.

గ్రూప్ చాట్ ను మేనేజ్ చేయాలి అంటే ఆ గ్రూప్ పేరుపై క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు కొత్త పార్టిసిపెంట్ లను యాడ్ చేయవచ్చు, గ్రూప్ ను డిలీట్ చేయవచ్చు, సబ్జెక్ట్ ను మార్చుకోవచ్చు

మీరు కాకుండా వేరే ఎవరినైనా కూడా అడ్మిన్ లా క్రియేట్ చేయవచ్చు. అప్పుడు వారు కూడా ఆ గ్రూప్ లో కొత్త సభ్యులను యాడ్ చేయగలరు, ఉన్నవారిని తీసి వేయగలరు.

సింపుల్ గా ఇదీ వాట్స్ అప్ యొక్క గ్రూప్ చాట్. ఇక దీనిసహాయం తో మీ ఫ్రెండ్స్ అందరి తో సులభంగా ఒకేసారిచాట్ చేయండి.

జన రంజకమైన వార్తలు