నేడు ప్రపంచం లో అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్ వాట్స్ అప్ అనే విషయం మనం క్రితo ఆర్టికల్ లో చర్చించుకున్నాం. అయితే కేవలం మెసేజింగ్ కు మాత్రమే కాక వాయిస్ కాల్స్ లోనూ వాట్స్ అప్ రికార్డు సృష్టించింది. వాట్స్ అప్ వినియోగదారులకు ఈ వాయిస్ కాలింగ్ ఫీచర్ అనేది మొట్టమొదటిగా ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోనికి వచ్చింది. ఆ తర్వాత స్థానాల్లో iOS, బ్లాక్ బెర్రీ , మరియు విండోస్ ఫోన్ లు ఉన్నాయి. ప్రస్తుతo పేస్ బుక్ యొక్క యాజమాన్యం లో ఉన్న ఈ కంపెనీ రోజుకు సుమారు పది కోట్ల కు పైగా వాయిస్ కాల్స్ ను వినియోగదారులు వాట్స్ అప్ ద్వారా చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి ప్రధాన కారణం వాట్స్ అప్ లో వాయిస్ కాలింగ్ ఫ్రీ. నామమాత్రపు డేటా చార్జీ లు. స్కైప్, వైబెర్ లాంటి మిగతా యాప్ లు కూడా వాయిస్ కాల్ లను అందిస్తున్నప్పటికీ వినియోగదారుల వోటు వాట్స్ అప్ కే ఉంది. దీనికి కారణం డేటా వినియోగం లో మిగతా వాటితో పోలిస్తే వాట్స్ అప్ కు ఉన్న సౌలభ్యమే. ఇప్పటికి ఒక బిలియన్ మంది వినియోగదారులు వాట్స్ అప్ ను వాడుతున్నట్లు సమాచారం. “ గత సంవత్సరం నుండీ వాట్స్ అప్ ద్వారా వినియోగదారులు ప్రపంచమంతటా వాయిస్ కాలింగ్ ను విరివిగా వాడుతున్నారు. ప్రపంచం లో వివిధ ప్రదేశాలలో ఉన్న స్నేహితులను, బంధువులను ఈ విధంగా కలుసుకోవడం అనేది ఒక గొప్ప అనుభూతి. ఈ రోజు సుమారు పది కోట్లకు పైగా వినియోగదారులు ప్రతిరోజూ వాట్స్ అప్ ద్వారా వాయిస్ కాలింగ్ ను వినియోగించుకుంటున్నారు. సెకను కు సుమారు 1100 మంది కాల్ లు చేసుకుంటున్నారు.” అని వాట్స్ అప్ తన బ్లాగ్ లో ప్రకటించింది. |