• తాజా వార్తలు

వాట్స్ అప్ లో కొత్తగా వచ్చిన ఫీచర్స్

ప్రస్తుత సాంకేతిక యుగంలో తమ ఫోనులో ఏ యాప్ లేకున్నా ఖచ్చితంగా వాట్స్ అప్ మాత్రం ఉంటుంది. మొబైల్ కంపెనీలకు పెద్ద సావాల్ గా మారుతూ వారిని ఆర్థికంగా బాగా దెబ్బతీసింది వాట్స్ అప్. ఇంతకు ముందు ఇతరులకు తమ సందేశాలను కేవలం మామూలుగా పంపేవారు. దానికి మొబైల్ కంపెనీలకు భారీగానే ఆదాయం వచ్చేది. మెసేజ్ లకోసం ప్రత్యేకమైన ఆఫర్లు ఉండేవి. కానీ వాట్స్ అప్ రాకతో చాలా మటుకు మొబైల్ కంపెనీల మెసేజ్ లు వాడటం మానేశారు. ఈ నేపద్యంలో వాట్స్ అప్ కూడా రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతూ అనేక రకాల ఫ్యూచర్లను అందుబాటులోకి తెస్తోంది. భద్రత పరంగా చాలా పటిష్టం చేసింది. ఈ నేపద్యంలో వాట్స్ అప్ లో వచ్చిన కొన్ని కొత్త ఫీచర్స్ గురించి చర్చించుకుందాం.

1. మాములుగా మీరు పంపే సందేశాలు ఒకే రకమైన టెక్స్ట్ లో ఉంటాయి. కాని వాటిని వివిధ రకాలుగా మార్చి పంపవచ్చు. ఎలాగంటే ఎంఎస్ వర్డ్ లో మనం పదాలను ఎలా కావాలంటే అలా చేంజ్ చేస్తామో వాట్స్ అప్ లో కూడా అలానే చేయవచ్చు.  టెక్స్ట్ ను బోల్డ్, ఇటాలిక్, స్ట్రైక్ వంటి ఆప్షన్స్ ను అందించింది.

2. జీ మెయిల్ లో మనం అనేక రకాల ఫైల్స్ ను పంపించుకుంటాము. వాటిలో PDF ఫార్మాట్ లో చాలా మటుకు డాకుమెంట్స్ ఉంటాయి. ఇది వరకు PDF డాకుమెంట్స్ ను వాట్స్ అప్ లో పంపించుకోవడానికి వీలు ఉండేది కాదు. దీనితో తిరిగి మెయిల్ నే ఆశ్రయించే వారు. కాని ఇప్పుడు PDF డాకుమెంట్స్ ను కూడా పంపించుకునే వెసులు బాటు కల్పించింది. దీనితో చాలా ఉపయుక్తంగా ఉంటుంది చాలా మందికి. దీనికోసం  చాట్ విండో లో పైన attachment సింబల్ పై టచ్ చేసి Document ఆప్షన్ ఎంచుకోని కోరిన PDF డాకుమెంట్స్ ను షేర్ చేసుకోవచ్చు.

3. లైక్స్ బటన్ దగ్గర  పేస్ బుక్ లో కొత్త సింబల్స్ ని యాడ్ చేసినట్లుగానే ఇక్కడ కూడా కొన్ని ఎమోటికాన్స్ స్మైలీ సింబల్స్ ను అప్ డేట్ చేసింది. వీటితో పాటు అదనంగా కొత్త ట్యాబ్ లను కూడా యాడ్ చేసింది.

4. వాట్స్ అప్ లో మనకు నచ్చిన గ్రూప్స్ క్రీయేట్ చేసుకుని వాటిలో మన ఫ్రెండ్స్ ను యాడ్ చేసుకుని అందరికి ఒకే సారి తమ సందేశాన్ని పంపించుకోవచ్చు. కాని అది పరిమితిమేరకే ఉండేది. ఒక గ్రూప్ లో కేవలం 100 మిత్రులను మాత్రమే యాడ్ చేసుకునే వీలు ఉండేది. కాని ఇప్పుడు డానికి 256 మందిని యాడ్ చేసుకోవడానికి వీలు కలిగే విధంగా పెంచింది. 

 

జన రంజకమైన వార్తలు