ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది వాడే మెసేజింగ్ యాప్‌లలో వాట్సప్ ఒకటి. ఈ మెసేజింగ్ యాప్‌లో కొత్త ఫీచర్లు వస్తున్నాయి. దీంతో వాట్సప్‌ను వాడే యూజర్లు రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. అయితే 2020లో కొన్ని ఫోన్లలో వాట్సప్ ఉండే అవకాశం లేదంట.. మరి వాట్సప్ వాడే వినియోగదారులు ముందే జాగ్రత్తపడండి.
ఓల్డ్ ఫోన్లకే ఎఫెక్ట్
భారత్‌లో పాత తరం మోడల్ స్మార్ట్‌ఫోన్లలో వాట్సప్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ఇటీవలే ఆ కంపెనీ ప్రకటన చేసింది. వాట్సప్‌కు సంబంధించి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్‌లో వాట్సప్ ఈ విషయాన్ని సవివరంగా తెలియజేసింది. వచ్చే ఏడాది వాట్సప్ ఉపసంహరించుకునే ఫోన్ల జాబితా కూడా వాట్సప్ తెలియజేసింది.
ఫిబ్రవరి 2020 నుంచి అమలు
వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి భారత్‌లో పాత మోడల్ ఫోన్లలో వాట్సప్ ఉండబోదని ఆ సంస్థ తెలిపింది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ స్మార్ట్‌ఫోన్లు కూడా వీటిలో ఉండడం గమనార్హం. ఆండ్రాయిడ్ వెర్షన్ 2.3.7 ఉన్న ఫోన్లలో ఇక వాట్సప్ సపోర్ట్ చేయదు. ఐఫోన్లో ఐవోఎస్ 8 లో కూడా ఇక వాట్సప్ వాడడం కుదరదు. ఈ ఫ్లాట్‌ఫామ్‌లో మీరు వాట్సప్ వాడాలని అనుకుంటే తప్పకుండా అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుందని వాట్సప్ తెలిపింది.
విండోస్ ఫోన్లలో కుదరదు
విండోస్ ఫోన్లలో రాబోయే ఏడాది నుంచి వాట్సప్ వాడడం కుదరదు. ఇది డిసెంబర్ 31, 2019 నుంచే అమల్లోకి రానుంది. ఇదో రోజు మైక్రోసాఫ్ట్, విండోస్ 20, మొబైల్ ఓఎస్ మధ్య బంధానికి తెరపడనుండడం కూడా విశేషం. మీరు విండోస్ ఫోన్ యూజర్లు అయితే మీ చాట్‌ను సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ కూడా కుదరదు. దీని కన్నా చాట్‌లోకి వెళ్లి ఎక్స్‌పోర్ట్ చాట్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 4.0.3 ప్లస్, ఐఫోన్ ఐవోఎస్ 9 ప్లస్, కైయ్ 2.5.1 ప్లస్ వెర్షన్లలో ఇక వాట్సప్ పని చేయదు.