• తాజా వార్తలు

మీ నమ్మకస్తులకి మీరు ఎక్కడ ఉన్నారో నిరంతరం తెలిపేలా గూగుల్ ట్రస్టెడ్ కాంటాక్ట్స్

 

మీరు ఎక్కడ ఉన్నారో మీ స్నేహితులకు, సన్నిహితులకు చెప్పడానికి అంటే మీ లొకేషన్ ను షేర్ చేయడానికి నేడు అనేకరకాల స్మార్ట్ ఫోన్ యాప్ లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో చాలా వరకూ ఆపరేట్ చేయడానికి కష్టం గా ఉంటూ విసుగు తెప్పిస్తూ ఉంటాయి. మరియు ఖచ్సితత్వాన్ని కలిగి ఉండవు. అంత వేగంగా కూడా ఉండవు. అయితే గూగుల్ ట్రస్టెడ్  కాంటాక్ట్స్ అనే ఒక సరికొత్త యాప్ ను విడుదల చేసింది. మీ లొకేషన్ ను ఇతరులతో పంచుకోవడం లో ఇది చాలా సూటిగా ఉండడమే గాక అత్యంత ఖచ్చితంగా మరియు వేగంగా ఉంటుంది.

ఈ గూగుల్ ట్రస్టెడ్  కాంటాక్ట్స్ అనే యాప్ ల మీరు మీ సన్నిహితుల యొక్క కాంటాక్ట్ లిస్టు ను సేవ్ చేసుకుని మీరు మీ లొకేషన్ ను వారికి పంపాలి అనుకున్నపుడు వారికి షేర్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఇందులో మీరు మీ ఆక్టివిటీ స్టేటస్ కూడా చూసుకోవచ్చు. ఎవరైనా మీ లొకేషన్ ను ఖచ్చితంగా కావాలి అనుకుంటే అంటే మీరు  ఎక్కడున్నారో వారికి తెలియాలి అనుకుంటే వారు మీకు ఒక రిక్వెస్ట్ కూడా పెట్టవచ్చు. మీరు ఆ రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేయవచ్చు లేదా రిజెక్ట్  చేయవచ్చు. అలా ఎవరైనా మీ లొకేషన్ ను అడిగినపుడు మీరు ఆక్ రిక్వెస్ట్ కు 5 నిమిషాల లోపు రెస్పాండ్ అవ్వాలి లేకపోతే అది ఆటోమాటిక్ గా మీ లొకేషన్ వారికీ పంపుతుంది.

ఈ గూగుల్ ట్రస్టెడ్  కాంటాక్ట్స్ ద్వారా మీ లొకేషన్ ను షేర్ చేయడం ఎలా?

1. మొదటగా ప్లే స్టోర్ లోకి వెళ్లి ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఇది ఉచితంగానే లభిస్తుంది.

2. గూగుల్ ఎకౌంటు తో సైన్ అప్ అయ్యి మీ గూగుల్ ట్రస్టెడ్  కాంటాక్ట్స్ లిస్టు లో మీకు ఇష్టమైన వారి కాంటాక్ట్ లను యాడ్ చేసి లిస్టు ను తయారు చేసుకోవాలి. ప్రస్తుతానికి స్కిప్ అయ్యి తర్వాత కూడా దీనిని చేసుకోవచ్చు.

3. మీ హోం పేజి లో పై భాగాన మీ స్టేటస్ ఉంటుంది. దాని క్రింద లిస్టు ఉంటుంది అన్నింటి క్రింద షేర్ యువర్ లొకేషన్ అనే బటన్ ఉంటుంది.చివరిగా ఒక చిన్న ఆరంజ్ ఐకాన్ ఉంటుంది. దీనిద్వారా మీరు అందరికీ ఒకేసారి మీ లొకేషన్ ను షేర్ చేయవచ్చు.

4. మీరు మీ లొకేషన్ ను షేర్ చేసేటపుడు + బటన్ ను ట్యాప్ చేయడం ద్వారా అప్ డేట్ లను కూడా పోస్ట్ చేయవచ్చు.

5. సెషన్ ను పూర్తీ చేయాలంటే సింపుల్ గా పైన ఉండే స్టాప్ బటన్ ను ట్యాప్ చేస్తే సరిపోతుంది. లేకపోతే నోటిఫికేషన్ లలో స్టాప్ షేరింగ్ ను ట్యాప్ చేసినా సరిపోతుంది.

6. ఇంకా ఎక్కువ కాంటాక్ట్ లను యాడ్ చేయాలంటే ఎడమవైపు ఉండే నావిగేషన్ డ్రాయర్ ద్వారా చేయాలి.

7. ఇగ్నోర్ కాంటాక్ట్స్ అనే ఐకాన్ ద్వారా మీకు ఇష్టం లేని వారి కాంటాక్ట్ లని ఇగ్నోర్ చేయవచ్చు. ఈ లిస్టు సెట్టింగ్ మెనూ లో ఉంటుంది.

జన రంజకమైన వార్తలు